
సినిమాలు ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కానీ కొన్ని చూసినప్పుడు మాత్రం దానిలో ఎమోషన్ మనసుల్ని తాకుతుంది. మనల్ని భావోద్వేగానికి గురిచేస్తుంది. అలాంటి చిత్రమే 'సత్యం సుందరం'. కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గతేడాది రిలీజైంది. దీనికి '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకుడు.
(ఇదీ చదవండి: సూర్యకు గిఫ్ట్ ఇచ్చిన 'రెట్రో' డిస్ట్రిబ్యూటర్..)
గతేడాది సినిమా వచ్చింది. కమర్షియల్ గా హిట్ కాలేదు గానీ చాలామంది ప్రేక్షకులకు మాత్రం సినిమా నచ్చింది. సరే ఇప్పుడు ఈ విషయం ఎందుకా అంటారా? దర్శకుడు ప్రేమ్ కుమార్ కి ఇప్పుడు సూర్య-కార్తీ మర్చిపోలేని బహుమతి ఇచ్చారు. ఎందుకంటే ప్రేమ్ చాన్నాళ్ల నుంచి ఈ కారు కొనుక్కుందామని అనుకుంటుండగా.. ఇప్పుడు సూర్య-కార్తీ ఇతడి కల నెరవేర్చారు. ప్రేమ్ కుమార్ ఇన్ స్టా పోస్ట్ చూస్తే ఇది అర్థమైపోయింది.
'మహీంద్ర థార్ నా డ్రీమ్ కారు. కొన్ని కారణాల వల్ల 5 డోర్స్ వెర్షన్ కోసం నేను ఎదురుచూస్తున్నాను. ప్రత్యేకంగా డిజైన్ చేసిన థార్ ఆర్ఓఎక్స్ఎక్స్ ఏఎక్స్ 5ఎల్ 4x4 మోడల్ లో వైట్ కలర్ కారు కొనాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. నా దగ్గర డబ్బులున్నా సరే కారు రావడానికి చాలారోజులు పట్టేస్తుంది. దీంతో రాజా సర్ సాయం అడిగా'
'ఒకానొక సందర్భంలో కారు కొనడం కంటే అవసరాలు ఎక్కువైపోయాయి. దీంతో కారు కోసం దాచుకున్న డబ్బులన్నీ ఖర్చుయిపోయాయి. కల చెదిరిపోయింది. ఇదంతా రాజా సార్ కి చెప్తే సైలెంట్ గా ఉండిపోయారు. కానీ నిన్న సూర్య అన్న నుంచి కారు ఫొటో మెసేజ్ వచ్చింది. నేను ఫస్ట్ షాకయ్యాను. వెంటనే రాజా సర్ కి ఫోన్ చేసి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని చెబితే.. ఆయన నవ్వి, ప్రేమ్ ఇది నీకు సూర్య సర్ ఇస్తున్న గిఫ్ట్ అని అన్నారు. దీంతో నాకు మాట రాలేదు. సూర్య సర్ ఇంటికి వెళ్లి కార్తీ అన్న చేతుల మీదుగా కారు అందుకున్నాను'
'ఇదంతా ఇంకా కలలానే అనిపిస్తుంది. నేను దీన్ని బహుమతిలా చూడటం లేదు. నేను దీన్ని అన్నయ్యలు తమ్ముడికి నెరవేర్చిన కలలా భావిస్తున్నాను. థ్యాంక్స్ సూర్య అన్న, థ్యాంక్స్ కార్తీ బ్రదర్, థ్యాంక్స్ రాజా సర్' అని ప్రేమ్ కుమార్ రాసుకొచ్చాడు. మార్కెట్ లో ప్రస్తుతం ఈ కారు ధర రూ.25 లక్షల వరకు ఉంది. ఇకపోతే ప్రేమ్ కుమార్ ఇప్పుడు '96' సీక్వెల్ స్క్రిప్ట్ రాస్తూ బిజీగా ఉన్నాడు.
(ఇదీ చదవండి: రూ.10 కోట్లు దానం చేసిన హీరో సూర్య)