లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఇటీవలే 'డ్యూడ్' మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీపావళి సందర్భంగా రిలీజైన ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించారు.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. బాగుండు పో.. అంటూ సాగే ఫుల్ వీడియో పాటను విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సాంగ్ యూత్ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ ఎమోషనల్ లవ్ సాంగ్‌కు రాజజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సంజీత్ హెగ్డే, సాయి అభ్యంకర్ ఆలపించారు. ఈ పాటను సాయి అభ్యంకర్ కంపోజ్ చేశారు. కాగా.. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.


