విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా సినిమాకు ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్ ఖరారైంది. ఈ చిత్రంలో కీర్తీసురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 డిసెంబరులో విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ని సోమవారం నిర్వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘రౌడీ జనార్ధన’ కోసం విజయ్‌తో తొలిసారిగా ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడిస్తున్నాం. 1980 దశకం నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉంటుంది.
ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్‌లో విజయ్ కనిపించబోతున్నాడు. తను ఇప్పటి వరకు ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చెప్పారు. ‘‘నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానినే. నేను అభిమానించే కీర్తీ సురేష్, ‘దిల్’ రాజుగార్లతో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్ర కథ ఎంత బాగుందో, ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ మాట్లాడటం కూడా అంతే బాగుందని రాజుగారు అనేవారు’’ అని తెలిపారు రవికిరణ్ కోలా. శిరీష్, ప్రోడక్షన్ డిజైనర్ డినో శంకర్, కెమెరామేన్ ఆనంద్ సి. చంద్రన్ మాట్లాడారు.


