Rowdy Janardhana Movie
-
రౌడీ గుండెలపై కాలు పెట్టిన కీర్తి సురేశ్.. విజయ్ బర్త్‌డే పోస్టర్!
విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాల్లో రౌడీ జనార్దన్ కూడా ఒకటి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విజయ్ బర్త్‌డే సందర్భంగా నేడు(మే 9) మరో కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్లో సీరియస్ లుక్‌లో కనిపించిన విజయ్.. కొత్త పోస్టర్ లవ్లీగా కనిపించాడు. ‘ప్రపంచంతో పోరాడతాడు.. ప్రేమకు లొంగిపోతాడు’ అంటూ కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. అందులో విజయ్ వర్షంలో తడుస్తూ, చేతిలో తుపాకీ పట్టుకొని కూర్చొని ఉండగా.. అతని గుండెలపై ఒక అమ్మాయి కాలు పెట్టినట్లు ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఇందులో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. తొలిసారి తూర్పుగోదావరి యాసలో విజయ్ మాట్లాడబోతున్నాడు. 80వ దశకం నేపథ్యంలో కథనం సాగుతుంది. ఈ ఏడాది చివరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. “The soul” of ROWDY JANARDHANA. A man who fights the world…but surrenders only to love ❤️Wishing our #RowdyJanardhana @TheDeverakonda a very Happy Birthday 🔥#HBDVijayDeverakonda@keerthyofficial #AnendCChandran @DinoShankar @PraveenRaja_Off @SVC_official @Tseries… pic.twitter.com/8rQYuafGIM— Ravi Kiran Kola (@storytellerkola) May 9, 2026 -
డిసెంబర్ లో రిలీజ్ అయితే..! పాన్ ఇండియా బ్లాక్ బస్టరే
-
బూతుల్ని జనాలకు అలవాటు చేస్తున్నారా?
సినిమా అనేది ఓ మాధ్యమం. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తారా సందేశం ఇస్తారా అనేది హీరోలు, దర్శకనిర్మాతల ఇష్టం. సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు గానీ చెడు మాత్రం చేయకూడదు. కానీ గత కొన్నాళ్ల నుంచి చూసుకుంటే మాత్రం ఈ విషయంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా మాట్లాడుకునే బూతుల్ని పలు సినిమాల్లో యదేచ్ఛగా వాడేస్తున్నారు. మరి వీటిని జనాలకు అలవాటు చేయాలనుకుంటున్నారా? లేదంటే అసలేం చేద్దామనుకుంటున్నారు?(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్‌లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు)తెలుగు సినిమాలు కొన్నాళ్ల ముందు వరకు మరీ అంత కాకపోయినా కాస్త పద్ధతిగా ఉండేవి. ఫ్యామిలీ, కామెడీ స్టోరీలతో తీసిన మూవీస్ ఎప్పటికప్పుడు వస్తుండేవి. ఆడియెన్స్ కూడా చాలావరకు కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లేవారు. కానీ లాక్డౌన్, ఓటీటీల రాకతో ట్రెండ్ మారిపోయింది. నిజంగానే మారిందా లేదంటే దర్శకనిర్మాతలు పరిస్థితులకు తగ్గట్లు మార్చేస్తున్నారా అనేది ఇక్కడ అర్థం కాని విషయం.ఓటీటీ కంటెంట్‌కి సెన్సార్ లాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. కాబట్టి నచ్చిన డైలాగ్స్ నచ్చిన సీన్స్ పెట్టకోవచ్చు. అందుకే 'మీర్జాపుర్' లాంటి సిరీస్‌లు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ సిరీస్ చాలా ఇంటెన్స్ సబ్జెక్ట్‌తో తీశారు. కానీ బూతులు, యాక్షన్ సన్నివేశాలు దారుణంగా ఉంటాయి. ఈ తరహా కంటెంట్ ఇష్టపడేవాళ్లు వీటిని చూశారు. మిగిలిన వాళ్లు లైట్ తీసుకున్నారు. ఓటీటీ కంటెంట్ వేరు సినిమా కంటెంట్ వేరు. కానీ ఈ రెండింటి మధ్య గీత చెరిగిపోతున్నట్లు అనిపిస్తుంది.(ఇదీ చదవండి: హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై)ఎందుకంటే ఈ ఏడాది మార్చిలో నాని 'ద ప్యారడైజ్' సినిమా అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాంటివి చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోయారు. కానీ చివరలో ఉపయోగించిన ఓ బూతు పదం విని షాకయ్యారు. తల్లిని దూషించేలా ఉండే ఆ పదాన్ని సినిమాలో ఏ సందర్భంలో ఉపయోగించారో తెలీదు కానీ ప్రమోషనల్ వీడియోలో పెట్టడం మాత్రం అవసరమా అనే కామెంట్స్ కొన్ని వినిపించాయి. తాజాగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'రౌడీ జనార్థన' టైటిల్ వీడియో లాంచ్ చేశారు. ఇందులోనూ రక్తపాతం, చివరలో బూతుపదాన్ని పెట్టారు.తెలంగాణ కల్చర్ అంటే పలువురు దర్శకులు మందు తాగడాన్ని చూపించినట్లు.. మాస్ సినిమాలనగానే కొందరు డైరెక్టర్స్, బూతుల్ని యదేచ్ఛగా వాడేస్తున్నారు. ఈ రెండు చిత్రాలే కాదు గతంలో ఇదే విజయదేవరకొండ 'అర్జున్ రెడ్డి'లోనూ బూతులు ఉంటాయి. విశ్వక్ సేన్ 'ఫలక్‌నుమా దాస్'లోనూ అలాంటి డైలాగ్స్ వినిపిస్తాయి. ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ దర్శకనిర్మాతలు బూతుల్ని జనాలకు అలవాటు చేసే పనిలో ఉన్నారా అనే సందేహం రావడం గ్యారంటీ!(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మాస్ రౌడీ జనార్ధన
విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా సినిమాకు ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్ ఖరారైంది. ఈ చిత్రంలో కీర్తీసురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 డిసెంబరులో విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ని సోమవారం నిర్వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘రౌడీ జనార్ధన’ కోసం విజయ్‌తో తొలిసారిగా ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడిస్తున్నాం. 1980 దశకం నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉంటుంది.ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్లో విజయ్ కనిపించబోతున్నాడు. తను ఇప్పటి వరకు ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చెప్పారు. ‘‘నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానినే. నేను అభిమానించే కీర్తీ సురేష్, ‘దిల్’ రాజుగార్లతో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్ర కథ ఎంత బాగుందో, ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ మాట్లాడటం కూడా అంతే బాగుందని రాజుగారు అనేవారు’’ అని తెలిపారు రవికిరణ్ కోలా. శిరీష్, ప్రోడక్షన్ డిజైనర్ డినో శంకర్, కెమెరామేన్ ఆనంద్ సి. చంద్రన్ మాట్లాడారు.


