రౌడీ గుండెలపై కాలు పెట్టిన కీర్తి సురేశ్‌.. విజయ్‌ బర్త్‌డే పోస్టర్‌! | Vijay Deverakonda Birthday Special Poster Release From Rowdy Janardhana, Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

రౌడీ గుండెలపై కాలు పెట్టిన కీర్తి సురేశ్‌.. విజయ్‌ బర్త్‌డే పోస్టర్‌!

May 9 2026 1:30 PM | Updated on May 9 2026 1:43 PM

Vijay Deverakonda Birthday : Special Poster Release From Rouedy Janardan

విజయ్‌ దేవరకొండ నటిస్తున్న సినిమాల్లో రౌడీ జనార్దన్‌ కూడా ఒకటి. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కిరణ్‌ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్‌, గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విజయ్‌ బర్త్‌డే సందర్భంగా నేడు(మే 9) మరో కొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. గతంలో రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో సీరియస్‌ లుక్‌లో కనిపించిన విజయ్‌.. కొత్త పోస్టర్‌ లవ్లీగా కనిపించాడు. 

‘ప్రపంచంతో పోరాడతాడు.. ప్రేమకు లొంగిపోతాడు’ అంటూ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. అందులో విజయ్ వర్షంలో తడుస్తూ, చేతిలో తుపాకీ పట్టుకొని కూర్చొని ఉండగా.. అతని గుండెలపై ఒక అమ్మాయి కాలు పెట్టినట్లు ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఇందులో  విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. తొలిసారి తూర్పుగోదావరి యాసలో విజయ్‌ మాట్లాడబోతున్నాడు. 80వ దశకం నేపథ్యంలో కథనం సాగుతుంది. ఈ ఏడాది చివరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement