పుట్టినరోజు ప్రత్యేకం | Vijay Deverakonda Rowdy Janardhana team wishes director Ravi Kiran Kola on his birthday | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు ప్రత్యేకం

Jul 21 2026 12:00 AM | Updated on Jul 21 2026 12:00 AM

Vijay Deverakonda Rowdy Janardhana team wishes director Ravi Kiran Kola on his birthday

విజయ్‌ దేవరకొండ, రవికిరణ్‌ కోలా

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ జనార్థన’. ‘రాజావారు రాణిగారు’ మూవీ ఫేమ్‌ రవికిరణ్‌ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. సోమవారం(జూలై 20న) రవికిరణ్‌ కోలా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ‘రౌడీ జనార్థన’ సెట్స్‌ నుంచి ఆయన వర్కింగ్‌ స్టిల్స్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

‘‘రూరల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంతో భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా ‘రౌడీ జనార్థన’ సినిమా రూపొందుతోంది. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రవికిరణ్‌ ఎంతో ప్యాషనేట్‌గా, కాన్ఫిడెంట్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సిల్వర్‌ స్క్రీన్‌పై చూసేందుకు విజయ్‌ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా  ఈ చిత్రాన్ని డిసెంబరులో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్‌ సి చంద్రన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement