
తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) టాలీవుడ్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే లవ్‌టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలతో మెప్పించాడు. అయితే, ఆయన తాజాగా డ్యూడ్(Dude) అనే కొత్త సినిమాతో వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి మరో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కిస్తున్నారు. ప్రేమలు సినిమాతో గుర్తింపు పొందిన మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్‌గా నటిస్తుంది. సంగీతం సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదల కానుంది.