
డ్యూడ్ సినిమాతో తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. ఫస్ట్ డే నాడు లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాల కలెక్షన్స్ కంటే డ్యూడ్ ఎక్కువే కొల్లగొట్టాడు. అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో మితా బైజు, శరత్ కుమార్, రోహిణి,హృదు హరూన్,నేహా శెట్టి తదితరులు నటించారు. ప్రదీప్ గత రెండు చిత్రాలు భారీ విజయం అందుకోవడంతో డ్యూడ్ మూవీకి బాగానే కలిసొచ్చింది.

తొలిరోజే డ్యూడ్ దుమ్ములేపాడు. ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో సత్తా చాటాడు. ప్రదీప్ రంగనాథ్ కెరీర్‌లోనే మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా డ్యూడ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రదీప్ గత చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఫస్ట్ డే రూ. 14 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే, ఆ సినిమా విజయం ఇప్పుడు ప్రదీప్‌కు బాగా కలిసొచ్చింది. ఆపై ఈ మూవీకి మొదటి రోజు కంటే రెండో రోజు బుకింగ్స్ బాగున్నాయని సమాచారం. దీపావళి సెలవు కూడా ఉండటంతో డ్యూడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ మార్క్‌ను చేరుకోవచ్చని తెలుస్తోంది.
సినిమా విడుదల కంటే ముందే సోషల్‌మీడియాలో ఈ మూవీకి బజ్ క్రియేట్ అయింది. ఆపై యూత్‌కు బాగా కనెక్ట్ కావడంతో థియేటర్స్ కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాల్లోనే డ్యూడ్ చిత్రానికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, డ్యూడ్ యూనిట్ నేడు అభిమానులను కలవనుంది. హైదరాబాద్‌లోని మల్లిఖార్జున థయేటర్ వద్దకు సాయంత్రం 6:30 షో టైమ్‌లో రానున్నారు. అక్కడి నుంచి మైత్రీ విమల్ థియేటర్‌కు రాత్రి 10:20గంటల షో టైమ్‌లో చేరుకుంటారు.
The DUDE DIWALI BLAST takes off on a BLOCKBUSTER note at the box office 🎇#Dude collects a gross of 22 CRORES WORLDWIDE on Day 1 ❤🔥
A massive festive weekend loading 💥💥
Book your tickets now and celebrate #DudeDiwali 🔥
🎟️ https://t.co/JVDrRd4PZQ
🎟️… pic.twitter.com/SjFiSw1cuq— Mythri Movie Makers (@MythriOfficial) October 18, 2025