
డ్రాగన్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. మరో హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. ప్రేమలు బ్యూటీ మమితా బైజు ఈ మూవీలో హీరోయిన్‌గా కనిపించనుంది. వీరిద్దరు జంటగా వస్తోన్న యూత్ ఎంటర్‌టైనర్ డ్యూడ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా యూత్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమాకు కీర్తీశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కించారు.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు హీరో ప్రదీప్. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో తన అందానికి సంబంధించిన ఓ సీక్రెట్‌ను పంచుకున్నారు. మొదటిసారి శరత్ కుమార్ సార్‌ను కలిసినప్పుడు మీ వయస్సు ఎంత సార్ అని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. దాదాపు 71 ఏళ్ల వయసులోనూ కేవలం 40 ఏళ్ల యువకుడిలా కనిపించారని అన్నారు. ఆయనతో సార్ అసలు మీరు ఏం తింటారు? ఇంత అందంగా, యంగ్‌గా ఫిజిక్ ఉండడానికి కారణమని ఏంటని అడిగినట్లు తెలిపారు. దీనికి నేను రోజు ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగుతానని శరత్ సార్ నాతో చెప్పారని వెల్లడించారు. బీట్ రూట్ జ్యూస్ తాగితే అందంగా తయారు అవుతారేమో అనుకుని రోజు తాగేవాడినని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆరోగ్యపరంగానే కాకుండా.. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని ప్రదీప్ రంగనాథన్ వెల్లడించారు.
కాగా.. డ్యూడ్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబరు 17న థియేటర్లలో విడుదల కానుంది.