అఖండ 2 ప్రేక్షకులను అలరిస్తుంది: బోయపాటి శ్రీను | Boyapati Srinu Speech About Akhanda 2: Tandavam | Sakshi
Sakshi News home page

అఖండ 2 ప్రేక్షకులను అలరిస్తుంది: బోయపాటి శ్రీను

Nov 28 2025 12:19 AM | Updated on Nov 28 2025 12:19 AM

Boyapati Srinu Speech About Akhanda 2: Tandavam

అమర్, చోనిత, బోయపాటి శ్రీను

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అఖండ 2: తాండవం’. ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా ఇతర ప్రధాన  పాత్రల్లో నటించారు. ఎమ్‌. తేజస్విని సమర్పణలో 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 5న రిలీజ్‌ కానుంది. ‘అఖండ 2’లో బాలకృష్ణ వినియోగించిన వాహనాన్ని లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ–‘‘ఒక పవర్‌ ఉన్న క్యారెక్టర్‌ దిగి వస్తుంటే దానికి తగ్గ ఒక ఆబ్జెక్ట్‌ ఉండాలి. క్యారెక్టర్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో, ఈ వెహికల్‌ కూడా అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది.

ఈ సినిమాలోని యాక్షన్  సన్నివేశాల్లో ఈ వెహికల్‌ని ఎంత అద్భుతంగా చూపించామో థియేటర్స్‌లోనే చూడాలి. ఈ వెహికల్‌ డిజైన్  కోసం అమర్‌ చాలా కష్టపడ్డారు.. అందుకు ఆయన్ను అభినందించాలి. ‘అఖండ 2’ భారతదేశ ఆత్మ. ప్రేక్షకులు, అభిమానులందరూ హ్యాపీగా ఫీల్‌ అయ్యే సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘అఖండ 2’లాంటి సినిమాకి పని చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వెహికల్‌ స్క్రీన్ పై మెస్మరైజ్‌ చేస్తుంది’’ అని చెప్పారు అమర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement