సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఎక్స్ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటి రాషా తడాని తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, ప్రీ లుక్‌పోస్టర్‌ని ఆవిష్కరించారు మేకర్స్.
‘‘టైమ్‌లెస్ కల్ట్ ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. యాక్షన్, రొమాన్స్ వంటి అంశాలు కూడా ఉంటాయి. తన పాత్ర కోసం జయకృష్ణ ఇంటెన్స్గా సిద్ధం అయ్యారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం మా సినిమాకు మెయిన్ హైలెట్ కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.


