‘లూసియా’ మూవీ ఫేమ్ సతీష్ నినాసం హీరోగా, ‘కాంతార’ మూవీ ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. వినోద్ వి ధోండలే దర్శకత్వంలో వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్ హౌస్ బ్యానర్లపై వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నినాసం నిర్మించారు. పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వినరా మాదేవ...’ అంటూ సాగే తొలి పాటను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ పాటకు శ్రీనివాస్ కాళే సాహిత్యం అందించగా, సతీష్ నినాసం, సాద్విని కొప్ప, సిద్ధు పాడారు. సంతు మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘శివుడి గొప్పదనం నేపథ్యంలో ‘వినరా మాదేవ..’ పాట సాగుతుంది. ఊరంతా కలిసి జరుపుకునే జాతర నేపథ్యంలో వచ్చే ఈ పాటలో లవిత్‌గారు అందించిన విజువల్స్ బాగుంటాయి. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.


