'ప్రేమలో రెండోసారి' త్వరలో ఓటీటీలో విడుదల | Premalo Rendosari Movie OTT Details | Sakshi
Sakshi News home page

'ప్రేమలో రెండోసారి' త్వరలో ఓటీటీలో విడుదల

Nov 27 2025 9:21 PM | Updated on Nov 27 2025 9:21 PM

Premalo Rendosari Movie OTT Details

సిద్ధా క్రియేషన్స్ బ్యానర్‌పై రమణ సాకే, వనితా గౌడ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'ప్రేమలో రెండోసారి'. సాకే రామయ్య సమర్పించిన ఈ చిత్రాన్ని సత్య మార్క దర్శకత్వం వహించారు. నీరజ లక్ష్మి నిర్మించారు. జబర్దస్త్ శ్రీను, బాబీ, దుర్గారావు, ఫణి, సతీష్ సారేపల్లి, చిరంజీవి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ రొమాంటిక్ లవ్ స్టోరీ నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. రెస్పాన్స్ బాగుంది. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. చిన్న సినిమాగా విడుదలైన మా చిత్రానికి రోజూ థియేటర్లు పెరుగుతున్నాయి. అందుకు కారణం పాజిటివ్ టాకే. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తీశాం. త్వరలోనే మా చిత్రం ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు మా టీమ్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement