'జాతిరత్నాలు' సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో మరో హిట్ అందుకున్నాడు. దీని తర్వాత మరో మూవీ చేసేందుకు చాలా టైమ్ తీసుకున్నాడు. ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు' అనే చిత్రం చేస్తున్నాడు. రాబోయే సంక్రాంతికి దీన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)
ఇప్పటికే దసరా, దీపావళికి ప్రమోషనల్ వీడియోలు వదిలిన నవీన్.. ఇప్పుడు తొలి పాటని రిలీజ్ చేశారు. 'భీమవరం బల్మా' అంటూ సాగే ఈ గీతాన్ని.. భీమవరంలోనే ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్‌లోనే గురువారం సాయంత్రం లాంచ్ చేశారు. పాట కలర్‌ఫుల్‌గా ఉంది. నవీన్-మీనాక్షి కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రానికి మారి దర్శకుడు.
(ఇదీ చదవండి: 'చికిరి చికిరి' పాట లొకేషన్ ఎక్కడో తెలుసా?)


