కొన్నాళ్ల ముందు వరకు మంచు కుటుంబంలో ఎన్ని గొడవలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నదమ్ములు విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకోవడంతో పాటు పోలీస్ కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది. ప్రస్తుతానికి అందరూ సైలెంట్‌గానే ఉన్నారు. అయితే వివాదం నడుస్తున్న టైంలో మోహన్ బాబు కూతురు మంచు లక్ష‍్మీ ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణమేంటి? కుటుంబంలో గొడవలు కారణంగా తను ఎంత బాధపడ్డాననేది ఇప్పుడు లక్ష‍్మీనే స్వయంగా చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కుటుంబ వివాదంపై స్పందించింది.
(ఇదీ చదవండి: కొడుకు సమక్షంలో క్రికెటర్ తో బిగ్‌బాస్ బ్యూటీ మరో పెళ్లి)
'దేవుడు కనిపించి వరం కోరుకోమంటే.. నా కుటుంబం అంతా మళ్లీ కలిసిపోవాలని అడుగుతాను. అన్ని ఫ్యామిలీస్‌లోనూ గొడవలు జరుగుతుంటాయి. కానీ ఎన్ని జరిగినా సరే చివరకు అందరూ ఒక్కటైపోవాలి. భారతీయ కుటుంబాల్లో కొన్నిసార్లు గొడవలైతే.. జీవితాంతం కలవకూడదు అని అనుకుంటారు. కానీ చివరకు మనకు మిగిలేది రక్తసంబంధీకులు మాత్రమే ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి. కుటుంబంతో కలిసి ఉండేందుకు ఎన్ని పోరాటాలైనా చేయాలి. అంతేకాని దూరాన్ని పెంచుకోకూడదు.'
'ముంబైలో నేను ఉంటున్నాను. అయితే ఇక్కడి విషయాలు తెలిసినా బాధపడలేదని కొందరు వార్తలు రాశారు. నేను ఎంత బాధ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. వివాదం గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి ఇష్టమొచ్చినట్లు నా గురించి రాసేశారు. వాటిపై స్పందించాలని అనుకోలేదు. ఇది నా పర్సనల్ మేటర్. ఇలాంటి వివాదాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. అవన్నీ చూసిన తర్వాత షాక్ అయ్యాను. మా ఫ్యామిలీ గురించి నేను ఏమనుకుంటున్నానో, ఎంత బాధపడ్డానో బయటకు చెప్పాల్సిన అవసరం లేదనిపించింది' అని మంచు లక్ష‍్మీ చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ధర్మేంద్ర మరణం.. తొలిసారి స్పందించిన భార్య హేమమాలిని)


