మలైకా అరోరా.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రత్యేకపాటల్లో తనదైన హుషారైన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారామె. మహేశ్‌బాబు ‘అతిథి’ చిత్రంలో ‘రాత్రైనా నాకు ఓకే..’, పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘కెవ్వు కేక...’పాటలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు మలైకా అరోరా. నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్తో 1998లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు మలైకా. వ్యక్తిగత కారణాల వల్ల 2017లో విడాకులు తీసుకున్నారు. అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉండటం వల్లే అర్బాజ్ ఖాన్‌కి మలైకా విడాకులిచ్చారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత అర్జున్ కపూర్– మలైకా అరోరా కూడా రిలేషన్ షిప్‌కి బ్రేకప్ చెప్పారు. తాజాగా తన విడాకులు, రిలేషన్ షిప్ గురించి మాట్లాడారు మలైకా అరోరా. ‘‘నేను వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత విడిపోయాను. అనంతరం రిలేషన్షిప్‌లో ఉన్నాను. బ్రేకప్ అయ్యింది. అంత మాత్రాన ప్రేమ అనేది తప్పు అని నేను అనుకోవడం లేదు. అవి నా విషయంలో సెట్ కాలేదు అంతే. అయినప్పటికీ ప్రేమ మీద నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. ప్రేమను పంచడం, పొందడం అనేది నాకు చాలా ఇష్టం. అది దక్కాలంటే అదృష్టం ఉండాలి’’ అని పేర్కొన్నారు మలైకా ఆరోరా.


