బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర.. మూడు రోజుల క్రితం కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. కొన్నాళ్ల క్రితమే చనిపోయారనే రూమర్స్ వచ్చాయి. కానీ కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. ఈ సోమవారం ధర్మేంద్ర చనిపోయిన తర్వాత నుంచి అందరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు తొలిసారి భర్త మరణంపై హేమమాలిని స్పందించారు. ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో తన బాధని పంచుకున్నారు.
'ధరమ్ జీ. ప్రేమించే భర్త, నా కూతుళ్లకు ఆరాధ్యుడైన తండ్రి, స్నేహితుడు, గైడ్, కవి, ఎప్పుడైనా వెళ్లగలిగే చనువున్న వ్యక్తి. చెప్పాలంటే ఆయనే నా సర్వస్వం. నా మంచి చెడుల్లో తోడున్నారు. నాతో పాటు నా కుటుంబ సభ్యులపై కూడా ఎంతో ప్రేమ చూపించారు. ఓ సెలబ్రిటీగా ప్రతిభ, మానవత్వం, పాపులారిటీ లాంటి వాటితో దిగ్గజాల్లో ఒకరిగా నిలిచారు. ఆయన ఘనతలు చిరస్థాయిగా నిలిచిపోతాయి'
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
'నా వ్యక్తిగత నష్టం వర్ణించలేనిది. ఏర్పడిన శూన్యత జీవితాంతం కొనసాగుతుంది. ఇన్నేళ్ల పాటు కలిసున్న తర్వాత ఆయనని గుర్తుపెట్టుకునేందుకు లెక్కలేనన్ని జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి' అని హేమమాలిని రాసుకొచ్చాడు. భర్తని మనసారా గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిపోయారు.
ధర్మేంద్రకు హేమామాలిని రెండో భార్య. వీళ్లకు ఈషా డియోల్, అహనా డియోల్ అని కూతుళ్లు ఉన్నారు. అంతకు ముందు ధర్మేంద్రకు పెళ్లి కాగా.. ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్లే సన్నీ డియోల్, బాబీ డియోల్. వీళ్లిద్దరూ తండ్రిలానే హిందీలో నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
(ఇదీ చదవండి: కొడుకు సమక్షంలో సీఎస్కే క్రికెటర్ తో బిగ్‌బాస్ బ్యూటీ మరో పెళ్లి)


