breaking news
dharmendra
-
నటుడు ధర్మేంద్ర సంతాప సభలో కేంద్ర మంత్రులు (ఫోటోలు)
-
ఆ ఇద్దరు హీరోల స్నేహ చిహ్నం ఈ పురాతన బైక్.. స్పెషల్ ఏంటంటే..?
షోలే సినిమాను సినీ అభిమానులు ఎవరూ మర్చిపోలేరు. అలాగే ఆ సినిమాలోని యే దోస్తీ హమ్ నహీ తోడేంగే పాటను కూడా మరిచిపోలేరు. ఆ పాటలో స్నేహితులైన జై–వీరు (అమితాబ్–ధర్మేంద్ర) మోటార్ సైకిల్ బాలీవుడ్లో ఉపయోగించిన అత్యంత ప్రసిద్ధ స్క్రీన్ వస్తువులలో ఒకటిగా నిలుస్తుంది. ఈ పురాతన మోటార్ సైకిల్ 1942 బిఎస్ఎ డబ్ల్యుడబ్ల్యుయ20 సినిమాలోని ప్రసిద్ధ పాట యే దోస్తీ హమ్ నహీ తోడెంగేలో తెరపై కనిపిస్తుంది. «లెజండరీ నటుడు దర్మేంద్ర మృతి తర్వాత ఈ మోటార్ సైకిల్ తిరిగి వెలుగులోకి వచ్చింది.ఒకప్పుడు కర్ణాటకలోని రామనగర కొండల లో ప్రయాణించిన ఈ పాతకాలపు యంత్రం ఇటీవల గోవాలో ముగిసిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఎఫ్ఎఫ్ఐ 2025)లో ప్రదర్శనకు నోచుకుని ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. షోలే(Sholay) 50 సంవత్సరాల వేడుకల్లో భాగంగా, సినీ అభిమానులను తక్షణమే సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్లే‘ వస్తువులను ప్రదర్శించడమే లక్ష్యంగా దీన్ని మరోసారి అందరి ముందుకు తెచ్చినట్టుంది కర్ణాటక ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ ’డిఐపిఆర్) కమిషనర్ ఎడిజిపి హేమంత్ నింబాల్కర్ అంటున్నారు.ఈ చిత్రంలో వినియోగించిన బైక్‌ను బెంగళూరు మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి బెంగళూరు బిజినెస్ కారిడార్ చైర్పర్సన్ ఎల్‌కె అతిక్ దాదాపు మూడు సంవత్సరాల క్రితం స్వంతం చేసుకున్నారని హేమంత్ నింబాల్కర్ వివరించారు. ఈ బిఎస్ఎ మోటార్‌సైకిల్ కర్ణాటకలో కుటుంబానికి చెందిన తాత నుంచి మనవడికి అన్నట్టు వారసత్వంగా చేతులు మారుతోంది.ఈ ప్రఖ్యాత జై–వీరు మోటార్‌సైకిల్‌ను బ్రిటిష్ సంస్థ బర్మింగ్‌హామ్ స్మాల్ ఆర్మ్స్ తయారు చేసింది. ఈ బైక్స్‌ను రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యం కోసం భారీ సంఖ్యలో ఉత్పత్తి చేశారు. సైనిక సేవలో ఇది గంటకు 55–60 కి.మీ. వేగంతో సమర్ధవంతంగా పనిచేసింది. 1942లో, బ్రిటిష్ సైన్యం ఈ మోడల్‌ను దాదాపు 50 నుంచి 60 పౌండ్లకు కొనుగోలు చేసింది, ఇది ఆ సమయంలో మన రూపాయల్లో చెప్పాలంటే దాదాపు రూ.700 నుంచి రూ.800 వరకు ఉండేది.ఇక ఈ చిత్రంలో ఉపయోగించిన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంవైబి 3047 కాగా ఇది ఛాసిస్ నంబర్ ఎం 20 116283 , ఇంజిన్ నంబర్ ఎం 20 4299లను కలిగి ఉంది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే ఇది 12.5 హార్స్‌పవర్‌ను అందించే 500 సిసి సింగిల్–సిలిండర్ సైడ్–వాల్వ్ ఇంజిన్ తో శక్తి నిచ్చింది. ఇది గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకోగలదు, ఈ బైక్ బరువు 170 కిలోగ్రాములు 13–లీటర్ ఇంధన ట్యాంక్‌తో వచ్చింది. దీనిలో ముందు భాగంలో గిర్డర్ ఫోర్కులు వెనుక పెద్ద క్యారియర్ ఉన్నాయి. రెండు చక్రాలకు డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి యుద్ధకాలంలో రబ్బరు కొరత కారణంగా, హ్యాండిల్బార్లు ఫుట్‌రెస్ట్‌లను కాన్వాస్‌లో చుట్టబడిన లోహంతో తయారు చేశారు. -
దీపికా పదుకొణె చెల్లి పెళ్లి.. ఈమె కూడా సినీ ఫ్యామిలీలోకే!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. గతేడాది 'కల్కి 2989' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. గత కొన్నిరోజుల నుంచి ఏదో రకంగా వార్తల్లో ఉంటూ వస్తోంది. ఇప్పుడు కూడా ఈమె కుటుంబం గురించి ఓ రూమర్ వినిపిస్తుంది. దీపిక చెల్లి కూడా సినీ నేపథ్యమున్న కుటుంబంలోకే కోడలిగా వెళ్లనుందని అంటున్నారు. ఈ మేరకు అబ్బాయి ఎవరు అనేది కూడా మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ)ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణెకి ఇద్దరు కుమార్తెలు అందులో దీపిక పెద్దమ్మాయి. చిన్నమ్మాయి అనీషా. నటిగా దీపిక గుర్తింపు తెచ్చుకోగా.. అనీషా మాత్రం ప్రొఫెషనల్ గోల్ఫర్గా పేరు సంపాదించింది. ప్రస్తుతం అక్కకు చెందిన 'లివ్ లవ్ లాఫ్' అనే స్వచ్ఛంద సంస్థకు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తోంది. అనీషా గత కొన్నాళ్ల నుంచి రోహన్ ఆచార్య అనే బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమలో ఉందని, త్వరలో వీళ్ల పెళ్లి జరగనుందనే న్యూస్ ఇప్పుడు వినిపిస్తోంది.రోహన్ విషయానికొస్తే ఇతడి ముత్తాత బిమల్ రాయ్.. గతంలో బాలీవుడ్లో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే రోహన్ సోదరిని.. ధర్మేంద్ర మనవడు (సన్నీ డియోల్ కొడుకు) కరణ్ డియోల్ పెళ్లి చేసుకున్నాడు. అలా రోహన్ కుటుంబానికి సన్నీ డియోల్ కుటుంబానికి బంధుత్వం ఏర్పడింది. ఇప్పుడు దీపిక సోదరి అనీషా.. రోహన్‌ని పెళ్లి చేసుకుంటే.. ఈమె కూడా ధర్మేంద్ర కుటుంబంలో ఒకరు అవుతుంది. అక్కలానే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబంలోకే కోడలిగా వెళ్లినట్లు అవుతుంది. ప్రస్తుతానికి దీని గురించి ఇంకా అధికారికంగా చెప్పనప్పటికీ రాబోయే కొన్ని నెలలో ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'పెద్ది' ఫైట్.. స్టార్ హీరో తండ్రి ఆధ్వర్యంలో!) -
ధర్మేంద్ర మరణం.. తొలిసారి స్పందించిన భార్య హేమమాలిని
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర.. మూడు రోజుల క్రితం కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. కొన్నాళ్ల క్రితమే చనిపోయారనే రూమర్స్ వచ్చాయి. కానీ కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. ఈ సోమవారం ధర్మేంద్ర చనిపోయిన తర్వాత నుంచి అందరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు తొలిసారి భర్త మరణంపై హేమమాలిని స్పందించారు. ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో తన బాధని పంచుకున్నారు.'ధరమ్ జీ. ప్రేమించే భర్త, నా కూతుళ్లకు ఆరాధ్యుడైన తండ్రి, స్నేహితుడు, గైడ్, కవి, ఎప్పుడైనా వెళ్లగలిగే చనువున్న వ్యక్తి. చెప్పాలంటే ఆయనే నా సర్వస్వం. నా మంచి చెడుల్లో తోడున్నారు. నాతో పాటు నా కుటుంబ సభ్యులపై కూడా ఎంతో ప్రేమ చూపించారు. ఓ సెలబ్రిటీగా ప్రతిభ, మానవత్వం, పాపులారిటీ లాంటి వాటితో దిగ్గజాల్లో ఒకరిగా నిలిచారు. ఆయన ఘనతలు చిరస్థాయిగా నిలిచిపోతాయి'(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'నా వ్యక్తిగత నష్టం వర్ణించలేనిది. ఏర్పడిన శూన్యత జీవితాంతం కొనసాగుతుంది. ఇన్నేళ్ల పాటు కలిసున్న తర్వాత ఆయనని గుర్తుపెట్టుకునేందుకు లెక్కలేనన్ని జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి' అని హేమమాలిని రాసుకొచ్చాడు. భర్తని మనసారా గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిపోయారు.ధర్మేంద్రకు హేమామాలిని రెండో భార్య. వీళ్లకు ఈషా డియోల్, అహనా డియోల్ అని కూతుళ్లు ఉన్నారు. అంతకు ముందు ధర్మేంద్రకు పెళ్లి కాగా.. ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్లే సన్నీ డియోల్, బాబీ డియోల్. వీళ్లిద్దరూ తండ్రిలానే హిందీలో నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.(ఇదీ చదవండి: కొడుకు సమక్షంలో సీఎస్కే క్రికెటర్ తో బిగ్‌బాస్ బ్యూటీ మరో పెళ్లి) View this post on Instagram A post shared by Dream Girl Hema Malini (@dreamgirlhemamalini) -
బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర రెస్టారెంట్ ప్రత్యేకతలు తెలుసా..?
బాలీవుడ్ లెజెండ్, 'హీ-మ్యాన్' ధర్మేంద్రకు కేవలం నటనపైనే కాదు, ఆహారం, ఆతిథ్యంపై కూడా మక్కువ ఎక్కువ. ఆయన సినీ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, పంజాబీ కల్చర్ ను ప్రతిబింబించేలా ప్రారంభించిన రెస్టారెంట్ ప్రాజెక్టే ఈ 'గరం ధరం - ధాబా తే ఠేకా'.రెస్టారెంట్ ప్రత్యేకతలు ఇవే.. 'గరం ధరం ధాబా' కేవలం భోజనశాల కాదు, ధర్మేంద్ర అభిమానులకు ఒక ఆలయం లాంటిది. ధర్మేంద్ర వ్యక్తిత్వం, ఆయన నటించిన సినిమా లలోని ముఖ్య ఘట్టాలు, డైలాగ్‌లు ఈ ధాబాలోని ప్రతి గోడపై కనిపిస్తాయి.సందర్శకులను ఆకర్షించే థీమ్..ఈ రెస్టారెంట్ మొత్తం బాలీవుడ్ థీమ్‌తో అలంకరించి ఉంటుంది. ధర్మేంద్ర క్లాసిక్ చిత్రాల పోస్టర్లు, అద్భుతమైన డైలాగ్స్ గోడలపై కనిపిస్తాయి.ఐకానిక్ ఆర్ట్ వర్క్స్.. ధర్మేంద్ర వివిధ రూపాల పోర్ట్రెయిట్లు, గ్రాఫిటీ ఆర్ట్ ఈ స్థలాన్ని నింపుతాయి. 'షోలే' సినిమాలోని ప్రసిద్ధ 'ట్యాంకీ' సీన్, జై-వీరు ప్రయాణించిన ఐకానిక్ కారు మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.'దేశీ' ఇంటీరియర్ తో..ఇటుక గోడలు, రంగుల దీపాలు, పాతకాలపు హెడ్‌లైట్స్, చేతిపంపులు వంటివి ధాబాకు దేశీ రూపాన్ని ఇస్తాయి. హర్యానాలోని ముర్తల్‌లో ప్రారంభించిన మొట్టమొదటి అవుట్లెట్ 1,200 మంది కూర్చునే సామర్థ్యంతో, 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారతదేశంలోనే అతిపెద్ద ధాబాగా ప్రసిద్ధి చెందింది.రుచికరమైన ఆహారం, దేశీ ఫ్లేవర్స్.. ఈ ధాబాలో నార్త్ ఇండియన్, పంజాబీ వంటకాలకు పెద్ద పీట వేస్తారు. రుచిలో రాజీ పడకుండా, ఇంటి భోజనాన్ని తలపించేలా ఇక్కడ వడ్డిస్తారు.మఖానీ పరాఠాలు, దాల్ మఖానీ, గలోటి కబాబ్‌లు, తందూరి పనీర్ టిక్కా, బిర్యానీ, వివిధ రకాల రుచికరమైన కూరలు ఇక్కడ లభిస్తాయి.ప్రత్యేక మెనూ ఏమిటంటే..?మెనూలో కొన్ని వంటకాలకు ఆయన సినిమాల పేర్లు పెట్టి, 'ధరం జీ స్పెషల్' అనే ప్రత్యేక పేజీని కూడా ఉంచారు. క్విర్కీ డ్రింక్స్ 'వీరూ కీ ఘుట్టీ', 'ప్యారే మోహన్ మసాలా నింబు' వంటి మోక్టైల్స్ ను బంటా అంటే దేశీ స్టైల్ సీసాలలో అందిస్తారు. ధాబా ఆవిర్భావం..ధర్మేంద్ర రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టే ముందు చాలా రీసెర్చ్ చేశారు. ఆ తర్వాత ఉమాంగ్ తివారీ, మిక్కీ మెహతా లతో కలిసి భాగస్వామ్యంలో మొదటి రెస్టారెంట్ ను ప్రారంభించారు.మొదటి ఔట్లెట్ ప్రారంభమైందిలా..ఫిబ్రవరి 23, 2018 న హర్యానాలోని ప్రసిద్ధ ఫుడ్ స్టాప్ ముర్తల్‌లో ఈ 'గరం ధరం ధాబా' తన మొదటి బ్రాంచ్ ను ఓపెన్ చేశారు. ముర్తల్ బ్రాంచ్ విజయవంతం అయిన తర్వాత, దీని శాఖలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఘజియాబాద్ అర్థాలా, మోహన్ నగర్), నోయిడా, న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వంటి అనేక ప్రదేశాలలో విస్తరించాయి.'హీ-మ్యాన్' రెస్టారెంట్.. 'గరం ధరం' విజయం తర్వాత, ధర్మేంద్ర కర్నాల్‌లో 'ఫామ్-టు-ఫోర్క్' కాన్సెప్ట్‌తో 'హీ-మ్యాన్' అనే తన రెండవ రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించారు. ఈ 'గరం ధరం ధాబా' ధర్మేంద్ర అభిమానులకు ఆయన గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన దేశీ జీవనశైలి గురించి గుర్తుచేసే ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.- సాక్షి స్పెషల్ -
బాలీవుడ్ హీ మేన్
‘ధరమ్ జీ’ ‘ధరమ్ పాజీ’ ‘వీరూ’ ‘ధరమ్ వీర్’... అంటూ ఇండస్ట్రీ, ప్రేక్షకులూ యాభై ఏళ్లుగా ప్రేమగా పిలుచుకున్న బాలీవుడ్ హీమేన్ ధర్మేంద్ర కన్నుమూశారు. రొమాంటిక్ సినిమాలతో మొదలు యాక్షన్ సినిమాల వరకు అన్నీ చేసి ‘సకల నటనా వల్లభుడు’ అనిపించుకున్న ధర్మేంద్ర మృతితో ఒక శకం ముగిసింది.ధర్మేంద్ర గారూ... దేశానికి అమితాబ్ మంచి హెయిర్ స్టయిల్ ఇచ్చాడు. రాజేష్ ఖన్నా ఫ్యాషనబుల్ కుర్తా ఇచ్చాడు. మిథున్ డిస్కో డాన్స్ ఇచ్చాడు. మీరేం ఇచ్చారు?’ ధర్మేంద్ర ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి సమాధానం ఇచ్చారు. ‘ఆరోగ్యం ఇచ్చాను. నన్ను చూసి దేశంలో ఎందరో యువకులు జిమ్ వైపు నడిచారు. నేను దేశానికి కండ ఇచ్చాను. అంతకు మించింది ఏముంది?’13 ఏళ్ల పిల్లవాడుగా ధర్మేంద్ర ఉన్నప్పుడు లూథియానా మినర్వా థియేటర్లో ‘షహీద్’ అనే సినిమా చూశాడు. అందులో ఒకతను ‘వతన్ కే రాహ్ మే వతన్ కే నౌజవాన్ షహీద్ హో’... అని చేతిలో జెండా పట్టుకుని పాడుతున్నాడు. అతణ్ణి హీరో అంటారని, అతని పేరు దిలీప్ కుమార్ అని ధర్మేంద్రకు తెలియదు. కాని థియేటర్ నుంచి బయటకు వచ్చే సమయానికి ఒకటే నిశ్చయించుకున్నాడు– ‘నేను అతనిలాగే మా ఊరి థియేటర్లో తెర మీద కనిపిస్తా’.అది ఏ సమయమో. ఆ మాటను ఏ నక్షత్రాలు విన్నాయో.ధర్మేంద్ర తండ్రి స్కూల్ టీచర్. పెద్ద కొడుకు ధర్మేంద్ర తన మార్గంలో నడిచి ప్రొఫెసర్ కావాలని ఆయనకు ఉండేది. ధర్మేంద్రకు చదువు వంటబట్టలేదు. పైగా సినిమా పురుగు కుట్టింది. దాంతో క్లాసులో ఏమీ వినలేక, చెప్పలేక తండ్రి చేతిలో రోజూ తిట్లే. ఇంటికి వచ్చి తల్లితో ‘నన్ను స్కూల్‌కు పంపకు. నాన్న నన్ను మిగిలిన పిల్లల కంటే ఎక్కువ తిడుతున్నాడు’ అని ఫిర్యాదు చేసేవాడు. మొత్తానికి మెట్రిక్‌తో చదువు ఆగి, రైల్వే శాఖలో క్లర్క్ ఉద్యోగం దొరికి, 19 ఏళ్లకు పెళ్లి కూడా అయిపోయింది. కాని అతణ్ణి వెండితెర పిలుస్తూ ఉంది. రోజూ అతడి బాధ చూసిన తల్లి ‘నీకు అంతగా నటించాలని ఉంటే ఒక అర్జీ పడేయొచ్చు కదరా’ అంది అమాయకంగా. ఉద్యోగానికి అర్జీగానీ హీరో కావడానికి అర్జీ ఉంటుందా? ఏమో... అర్జీ పెట్టాలేమో అనుకుంటున్న ధర్మేంద్రకు అప్పుడే ‘ఫిల్మ్‌ఫేర్ టాలెంట్ హంట్’ ప్రకటన పేపర్లో కనిపించింది.బిమల్ రాయ్, గురుదత్‌ల పర్యవేక్షణలో కొత్త నటీనటుల అన్వేషణ. అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చి అప్పటికప్పుడు ‘మలేర్కోట్లా’ అనే టౌన్‌కు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు. కారణం ఫొటో స్టూడియో అక్కడే ఉంది. అక్కడ జాన్ మహమ్మద్ అనే ఫొటోగ్రాఫర్‌తో ‘నన్ను దిలీప్‌కుమార్‌లా ఫొటో తియ్యి’ అనంటే అతను అంతకన్నా అందంగా ఫొటో తీశాడు. వెంటనే బొంబాయి నుంచి పిలుపు వచ్చింది. మహా దర్శకులైన బిమల్‌రాయ్, గురుదత్ స్క్రీన్ టెస్ట్ చేశారు. గురుదత్ ఏ సినిమా ఆఫర్ చేయలేదుగానీ బిమల్‌రాయ్ ‘నీకు వేషం ఇస్తున్నా’ అన్నాడు. సినిమా పేరు ‘బందినీ’.సినిమా రంగంలో ఇదిగో అంటే ఆర్నెల్లు. ‘బందినీ’ నిర్మాణం లేటయ్యింది. ఈలోపు ధర్మేంద్రకు పస్తులు మొదలయ్యాయి. బిమల్‌రాయ్ బుక్ చేసిన నటుడు కాబట్టి ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ (1960) అనే సినిమాలో హీరోగా 51 రూపాయల అడ్వాన్సుతో పని దొరికింది. మొదటి సినిమాగా అదే రిలీజైంది. కాని ఫ్లాప్. ఆ కష్టకాలంలో తనలాగే వేషాల కోసం ప్రయత్నిస్తున్న మనోజ్ కుమార్ ఫ్రెండ్ అయ్యాడు. రోజుల తరబడి స్టూడియోల చుట్టూ తిరగడం, భార్యనూ... ఉద్యోగాన్నీ వదిలేసి బొంబాయిలో ఏం చేస్తున్నావ్ అని తండ్రి అక్షింతలతో ఉత్తరాలు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం వేల వేదనలు అనుభవించాడు. అప్పుడు ‘బందినీ’ (1963) విడుదలైంది. కొద్దిగా గుర్తింపు. ‘ఆయి మిలన్ కీ బేలా’ (1963) నెగెటివ్ రోల్. రాజేంద్ర కుమార్ హీరో. కాస్త హిట్ అయ్యింది. ఈ సమయంలోనే అతను మన మహానటి సావిత్రి (Savitri) పక్కన హీరోగా ‘గంగాకీ లహరే’ (1964)లో నటించాడు. ఆ సంగతి సావిత్రికి, ధర్మేంద్రకు తప్ప ప్రేక్షకులకు తెలియదు. అంత ఫ్లాప్ ఆ సినిమా. ధర్మేంద్ర స్ట్రగుల్ కొనసాగింది.సినిమా పరిశ్రమలో ‘గాడ్‌ఫాదర్’ ఉండాలని అంటూ ఉంటారు. ధర్మేంద్రకు ‘గాడ్‌మదర్’ దొరికింది. ఆమె పేరు మీనా కుమారి. మన ‘నాదీ ఆడజన్మే’ సినిమాను హిందీలో ‘మై భీ లడ్కీ హూ’ (1964)గా రీమేక్ చేస్తుంటే మొదటిసారి మీనాకుమారితో నటించాడు ధర్మేంద్ర. మీనాకుమారి అప్పటికే తన వివాహ బంధం నుంచి బయటపడింది. ఆమె మనసు ఒక మంచి మిత్రుడి కోసం చూస్తోంది. ఆ సమయంలో సిగ్గరిగా, స్నేహంగా ఉన్న ధర్మేంద్ర ఆమెకు ఆప్తుడుగా అనిపించాడు. మీనాకుమారి పేరు మీద ఇంకా సినిమాలు ఆడుతున్న రోజులు అవి. అందువల్ల మీనాకుమారి ధర్మేంద్రను చాలా ప్రమోట్ చేసింది. వారిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. పూర్ణిమ (1965), కాజల్ (1965), ఫూల్ ఔర్ పత్థర్ (1966), చందన్ కా పల్నా (1967), ‘బహారోంకి మంజిల్’ (1968)... వీటిలో ఫూల్ ఔర్ పత్థర్ సూపర్‌హిట్. ఆ తర్వాత ధర్మేంద్ర ఆగలేదు. అతణ్ణి పెద్ద హీరో చేసిన మీనాకుమారి అతని జ్ఞాపకాల్లో మిగిలిపోయింది.ఆశాఫరేఖ్, ధర్మేంద్ర జోడి ప్రేక్షకులకు నచ్చింది. ‘ఆయా సావన్ ఝూమ్ కే’... పాట రేడియోలో పెద్ద హిట్. సినిమా కూడా సూపర్‌హిట్. ‘ఆయా సావన్ ఝూమ్ కే’ సినిమాతో ధర్మేంద్ర కెరీర్ పూర్తిగా సెటిల్ అయ్యింది. ఇతను యాక్షన్, సెంటిమెంట్, రొమాంటిక్ సినిమాలు చేయగలడు అని ఇండస్ట్రీకి తెలిసిపోయింది. హీరోయిన్లు మాలాసిన్హా, సైరాబాను, వహీదా రెహమాన్, షర్మిలా టాగోర్ అందరూ ధర్మేంద్ర పక్కన నటించడానికి పోటీలు పడ్డారు. అయితే అతను నటించడానికి పోటీ పడిన హీరోయిన్ ఆ తర్వాతి రోజుల్లో వచ్చింది. హేమమాలిని!ధర్మేంద్రలో ఒక మంచి, సెన్సిబుల్ నటుడు ఉన్నాడు. ఆ సంగతిని హృషికేష్ ముఖర్జీ పసిగట్టాడు. ‘అనుపమ’ (1966), ‘సత్యకామ్’ (1968), ‘చుప్కే చుప్కే’ (1975)... ఇవన్నీ ధర్మేంద్రతో తీశాడు. ధర్మేంద్ర మొత్తం కెరీర్లో అత్యుత్తమ నటన ప్రదర్శించిన సినిమాగా ‘సత్యకామ్’ను విమర్శకులు గుర్తిస్తారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యి ఆ తర్వాత కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ‘చుప్కే చుప్కే’లో ధర్మేంద్ర వేసిన ‘ప్యారేమోహన్’ అనే పాత్రకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ధర్మేంద్ర కామెడీని ప్రేక్షకులు ఈ సినిమాలో ఎంతో ఎంజాయ్ చేశారు. విశేషం ఏమంటే ఇందులో ధర్మేంద్ర బోటనీ ప్రొఫెసర్. సినిమా రిలీజయ్యాక తండ్రికి చూపించి ‘నువ్వు కోరినట్టుగా నేను బోటనీ ప్రొఫెసర్ అయ్యాను చూడు’ అనంటే ఆయన ఎప్పటిలానే ‘ఏడ్చావులే బడుద్దాయి’ అని అని అక్షింతలు వేశాడు.ధర్మేంద్ర హీరో. అతను హీరోగా ఉంటే పక్క పాత్ర ఉంటుంది తప్ప వేరెవరో హీరోగా ఉంటే అతను పక్కపాత్ర కాదు. ‘షోలే’లో హీరో ధర్మేంద్ర. సినిమాలో ప్రాణాలతో మిగిలేది కూడా అతడే. కాని అమితాబ్ కూడా అసాధ్యుడిగా నటించాడు. ధర్మేంద్రకు రాజకీయాలు చేయడం తెలియదు. కొత్త తరం వస్తే అసూయ లేదు. ఒడ్డూ పొడవూ ఉన్న అమితాబ్ తనను దాటేస్తాడనే భయం లేకుండా ‘జయ్’ పాత్రకు అమితాబ్‌ను తీసుకోండని తనే ఒక మాట వేశాడు దర్శకుడికి. ‘షోలే’ (1975) విడుదలయ్యి మరికొన్ని రోజుల్లో 4కెలో రీరిలీజ్ అవనుంది. యాభై ఏళ్లుగా షోలే ఖ్యాతి ధర్మేంద్రను భారత ప్రేక్షకులకు చేరువ చేస్తూనే ఉంది. ప్రతి కొత్తతరం ఈ సినిమా చూసి ధర్మేంద్రకు ఫ్యాన్స్ అయ్యారు. ‘కుత్తే మై తేరా ఖూన్ పీజావూంగా’ డైలాగ్ ధర్మేంద్ర ఒక్కసారి చెప్తే ఆ తర్వాతి తరాలు వందసార్లు చెప్తూనే ఉన్నాయి.1980ల తర్వాత ధర్మేంద్ర మల్టీస్టారర్ సినిమాల్లో హీరోగా క్షణం తీరిక లేకుండా గడిపాడు. అదే సమయంలో తన కుమారుడు సన్ని డియోల్‌ను ‘బేతాబ్’ (1983)లో లాంచ్ చేసి హీరోగా నిలబెట్టాడు. కొడుకుతో ధర్మేంద్ర తీసిన ‘ఘాయల్’ కూడా సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. ఈ కాలంలో హీరోగా ధర్మేంద్ర కొన్ని సినిమాలు చేస్తుంటే హీరోగా సన్నిడియోల్ సినిమాలు చేస్తూ వచ్చాడు. డింపుల్ కపాడియా (Dimple Kapadia) వంటి హీరోయిన్లు ఇద్దరి సరసనా నటించారు. ఆ తర్వాత చిన్న కొడుకు బాబీ డియోల్‌ను ‘బర్సాత్’తో లాంచ్ చేశాడు ధర్మేంద్ర.ధర్మేంద్ర ఎప్పుడూ తన పని గురించి తప్ప ఎత్తులు పైఎత్తులు వేస్తూ కూచోలేదు. పంచాయతీలకు దిగలేదు. అనవసరంగా మీడియా ముందుకు రాలేదు. ఇన్నేళ్లలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా తక్కువ. అవార్డు ఫంక్షన్లకు హాజరవడం, పార్టీలు ఇవన్నీ చాలా పరిమితంగా చేసేవాడు. ధర్మేంద్రకు రైతుగా ఉండడటం ఇష్టం. అందుకే కుమారులిద్దరూ కలిసి లోనావాలా దగ్గర 100 ఎకరాల ఫామ్‌హౌస్ ఏర్పాటు చేశాడు. సినిమాలను పూర్తిగా తగ్గించుకున్నా ఆ ఫామ్‌హౌస్‌లోనే ఎక్కువగా గడిపాడు ధర్మేంద్ర, ‘మీ వయసు ఎంత?’ అని ధర్మేంద్రను అడిగితే ‘అది కెమెరా చెప్తుంది’ అనేవాడు. కెమెరా తన కంటితో ఆయనను ఎప్పుడూ యంగ్‌గా, ఆరోగ్యవంతుడిగా, ధీరుడిగా, హీమాన్గానే చూపిస్తూ వచ్చింది. ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఆయన ఆ రూపంతోనే మిగిలిపోతాడు. ధర్మేంద్ర నటించిన ‘గాడీ బులా రహీహై’ పాటలో ‘గాడీ’ అంటే మృత్యువుకు సంకేతం. ఇన్నాళ్లకు మబ్బుల సెట్టింగ్, మెరుపుల ఆర్క్ లైట్లు ఉన్న చోటుకు తీసుకెళ్లే గాడీ ఎక్కి తరలిపోయాడు ధర్మేంద్ర. గాడీ బులా రహీహై... సీటీ బజా రహీహై.హేమమాలినితో ప్రేమకథహిందీ సినిమాల్లో హేమమాలిని (Hema Malini) రాకను బాంబేలో పెద్ద దుమారంగా మార్చిన వ్యక్తి రాజ్‌కపూర్. హేమమాలిని హిందీలో హీరోయిన్గా నటించిన మొదటి సినిమా ‘సప్నోంకా సౌదాగర్’ (1968)లో రాజ్‌కపూర్ హీరో. ఆ సినిమా పబ్లిసిటీ కోసం ‘డ్రీమ్ గర్ల్ హేమమాలిని’ అంటూ బాంబే అంతా హోర్డింగ్స్ పెట్టించాడు. అలా ఆమె బాలీవుడ్ హీరోల దృష్టిలో పడింది. ఆ వెంటనే ధర్మేంద్రతో ‘తుమ్ హసీ మై జవాన్’ (1969)లో నటించింది. ధర్మేంద్ర అప్పటికే వివాహితుడైనా, నలుగురు పిల్లల తండ్రయినా హేమమాలిని ఆకర్షణలో పడ్డాడు. సౌత్ హీరోయిన్లు హిందీలో ఎప్పుడూ టాప్స్టార్స్గానే ఉన్నారు. వహీదా రహెమాన్, వైజయంతీమాల, రేఖ... ఇప్పుడు హేమమాలిని. ఆమె స్నేహం కోసం అందరూ ఎదురు చూసిన వారే. వీరిలో మనోజ్ కుమార్, జితేంద్ర, సంజీవ్ కుమార్, ధర్మేంద్ర ఉన్నారు. ‘షోలే’ (1975) చేసే సమయానికి ధర్మేంద్ర ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకే ఆమెకు దగ్గరవడానికి ఆమెతో నటించే సీన్లలో రీటేక్‌ల కోసం లైట్బాయ్స్ను ఏదో ఒక తప్పు చేయమని తప్పుకు వంద రూపాయలు ఇచ్చేవాడు– ఆ రోజుల్లో. దాంతో హేమమాలినికి ధర్మేంద్ర అవస్థ తెలిసి వచ్చింది. అయినప్పటికీ ఇంట్లో అనంగీకారం, ధర్మేంద్ర మొదటి పెళ్లి కారణంగా హేమ మనసు ద్వైదీభావంతో ఉండేది. ఆ సమయంలోనే జితేంద్రతో దాదాపుగా ఆమె వివాహం వరకూ వెళ్లడం, మద్రాసుకు అందుకై వాళ్లు చేరుకోగా ధర్మేంద్ర మరో ఫ్లయిట్లో అక్కడకు వెళ్లి ఆమెను ఒప్పించి పెళ్లి కేన్సిల్ చేయడం ఆ రోజుల్లో వార్తగా వచ్చింది. చివరకు ధర్మేంద్ర, హేమమాలిని 1980లో వివాహం చేసుకున్నారు. ఇది పెద్ద వార్త. అయితే ధర్మేంద్ర తన కుటుంబాన్ని హేమమాలిని జీవితంలో జోక్యం చేసుకోకుండా, హేమమాలిని తాను అతని కుటుంబంలో జోక్యానికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నారు. అలాగే ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ (Prakash Kaur) ఎప్పుడూ ఈ విషయమై ఒక్క మాట బయటకు వచ్చి మాట్లాడలేదు. వారి ఇద్దరు కుమార్తెల్లో ఇషా డియోల్ సినిమాల్లో రావడం ధర్మేంద్రకు అంగీకారంగా లేకపోయినా తర్వాత ఆమెతో పాటు కలిసి నటించాడు కూడా. ‘నేను నా కుమార్తెను నటించ వద్దు అన్నాను నిజమే. నన్ను నా తండ్రి నటించ వద్దు అన్నాడు కదా. సినిమా రంగంలో కెరీర్ ఎంపికపై తల్లిదండ్రుల అభిప్రాయం ఉండటం తప్పు కాదు’ అంటాడు ధర్మేంద్ర. అయితే ధర్మేంద్ర కుమారులు సన్ని డియోల్, బాబీ డియోల్ (Bobby Deol) తమ సవతి తల్లి కుమార్తెలతో అంత మంచి అనుబంధంలో ఉన్నట్టుగా ఎప్పుడూ కనిపించలేదు. వారు నలుగురూ కలిసిన సందర్భాలు దాదాపుగా లేనట్టే.నేను వెళ్లే గుడి పేరు ‘జిమ్’ధర్మేంద్ర (Dharmendra) మద్యపాన ప్రియుడు అనేది జగద్విదితం. సాయంత్రం ఏడు తర్వాత హరిహరాదులు ఏకమైనా ఆయన పెగ్ చేతిలోకి తీసుకోకుండా ఉండడు. రాత్రిళ్లు ఎంతసేపు ఎన్ని పెగ్గులు పుచ్చుకున్నా ఉదయం ఐదు గంటలకంతా జిమ్‌లో ఉండటం ఆయనకు అలవాటు. తుఫాను వచ్చినా కూడా ఈ అలవాటు చివరి వరకూ మానలేదు. ‘నేను, నా ఇద్దరు కుమారులు, ఇంటి స్త్రీలు కూడా జిమ్‌కు రోజూ వెళతారు. మా ఇంట్లో ఉండే జిమ్ మాకు గుడితో సమానం’ అంటారు ధర్మేంద్ర. ఆయనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ జాస్తి. లోనావాలాలో ఫామ్‌హౌస్ పెట్టాక అక్కడి నుంచి రోజూ 15 లీటర్ల పాలు రైల్లో ముంబైకి చేరేది ధర్మేంద్ర పరివారం అవసరాలకు. ముంబైలో దొరికే పాలు కల్తీ అవుతాయనే కారణాన. ధర్మేంద్ర టాప్ 10 పాటలు1. యా దిల్ కి సునో దునియా వాలో ∙అనుపమ2. ఆప్ కే హసీన్ రుఖ్మె ఆజ్ నయా నూర్ హై ∙బహారె ఫిర్ భి ఆయేగీ3. బహారోంనె మేరా చమన్ లూట్ కర్ ∙దేవర్4. సాథియా నహీ జానా కె జీనా లగే ∙ఆయా సావన్ ఝూమ్ కే5. ఆజ్ మౌసమ్ బడా బే ఇమాన్ హై ∙లోఫర్6. పల్ పల్ పల్ దిల్ కే పాస్ ∙బ్లాక్ మెయిల్7. కోయి హసీనా జబ్ రూఠ్ జాతీ హై తో ∙షోలే8. ఓ మెరి మెహబూబా ∙ధరమ్ వీర్9. హమ్ బేవఫా హర్గిజ్ న థే ∙షాలిమార్10. జిల్మిల్ సితారోంకా ఆంగన్ హోగా ∙జీవన్ మృత్యుమాఫియాకి ధర్మేంద్ర హడల్1980లలో ప్రతి చిన్నా చితకా హీరోలకు మాఫియా నుంచి కాల్స్ వచ్చేవి. ‘భాయ్ మాట్లాడతాడట’ అనంటే అందరూ ఒణికిపోయేవారు. డబ్బులు కొందరు ఇచ్చేవారు. ఇలాగే ఒకసారి ధర్మేంద్రకు కూడా ఫోన్ వచ్చింంది. ధర్మేంద్ర ఫోన్ అందుకుని ‘మీరు ఎంత మంది ఉంటారు. ఒక పది మంది ఉంటారా? మీకు నేనొక్కణ్ణే చాలు. కాదు కూడదన్నారో ఒక ఫోన్ కొడితే మా పంజాబ్ నుంచి లారీలకు లారీలు కత్తులతో దిగుతారు. రండి చూసుకుందాం’ అన్నాడు. అంతే! మళ్లీ మాఫియా నుంచి ధర్మేంద్రకు ఫోన్ లేదు.నేను వెళ్లే గుడి పేరు ‘జిమ్’ధర్మేంద్ర మద్యపాన ప్రియుడు అనేది జగద్విదితం. సాయంత్రం ఏడు తర్వాత హరిహరాదులు ఏకమైనా ఆయన పెగ్ చేతిలోకి తీసుకోకుండా ఉండడు. రాత్రిళ్లు ఎంతసేపు ఎన్ని పెగ్గులు పుచ్చుకున్నా ఉదయం ఐదు గంటలకంతా జిమ్‌లో ఉండటం ఆయనకు అలవాటు. తుఫాను వచ్చినా కూడా ఈ అలవాటు చివరి వరకూ మానలేదు. ‘నేను, నా ఇద్దరు కుమారులు, ఇంటి స్త్రీలు కూడా జిమ్‌కు రోజూ వెళతారు. మా ఇంట్లో ఉండే జిమ్ మాకు గుడితో సమానం’ అంటారు ధర్మేంద్ర. ఆయనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ జాస్తి. లోనావాలాలో ఫామ్‌హౌస్ పెట్టాక అక్కడి నుంచి రోజూ 15 లీటర్ల పాలు రైల్లో ముంబైకి చేరేది ధర్మేంద్ర పరివారం అవసరాలకు. ముంబైలో దొరికే పాలు కల్తీ అవుతాయనే కారణాన. -
బాలీవుడ్ హీ మ్యాన్ ఇకలేరు
సాక్షి, సినిమా డెస్క్: బాలీవుడ్ హీ మ్యాన్‌గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన దిగ్గజ సీనియర్ నటుడు, లోక్‌సభ మాజీ ఎంపీ ధర్మేంద్ర (89) ఇకలేరు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను గత నెల 31న కుటుంబ సభ్యులు ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొంది, డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం రాత్రి మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు మరోసారి ఆస్పత్రికి తరలించగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.సోమవారం ముంబైలోని విల్లే పార్లీ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ధర్మేంద్ర భౌతికకాయం వద్ద నివాళులర్పించగా పలువురు సంతాపం తెలిపారు. ధర్మేంద్ర గత నెలలో ఆస్పత్రిపాలైనప్పుడు ఆయన మరణించారనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ వార్తలను ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్ అప్పట్లో ఖండించింది. అయితే అలా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ధర్మేంద్ర తుదిశ్వాస విడవడంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్కూలు రోజుల్లోనే నాటకాలు.. ధర్మేంద్ర అసలు పేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ డియోల్. 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లోని ఫాగ్వారాలో జన్మించారు. చదువులో ప్రతిభావంతుడు కానప్పటికీ చిన్నప్పటి నుంచి ధర్మేంద్ర ఎంతో క్రమశిక్షణ కలిగి ఉండేవారు. స్కూలు రోజుల్లోనే ఆయన నాటకాలు వేసేవారు. దీంతో ఆయనకు సినిమాలపై మక్కువ పెరిగింది. అప్పట్లో ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ధర్మేంద్ర విజేతగా నిలిచి ముంబైలో అడుగుపెట్టారు. తన 19వ ఏట సినిమాల్లోకి రాక ముందే 1954లో ప్రకాశ్ కౌర్‌ని మొదటి వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు సంతానం. వారిలో కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, కుమార్తెలు విజిత, అజీత ఉన్నారు. నట ప్రస్థానం అర్జున్ హింగోరాని దర్శకత్వం వహించిన ‘దిల్ బీ తేరా హమ్ బీ తేరే’(1960) సినిమాతో ధర్మేంద్ర బాలీవుడ్లో నటుడిగా అడుగుపెట్టారు. ఈ చిత్రానికిగాను ఆయన తీసుకున్న తొలి పారితోషికం రూ.51. ఆ తర్వాత ‘బాయ్ ఫ్రెండ్, బందినీ, అనుపమ, ఆయా సావన్ జూమ్ కే’వంటి సినిమాలతో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘షోలే, ధర్మవీర్, చుప్కే చుప్కే, మేరా గావ్ మేరా దేశ్, డ్రీమ్ గర్ల్’వంటి చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నారు. రొమాంటిక్ హీరోగా, యాక్షన్ హీరోగానూ ఆయన రాణించారు. ‘ఆయే మిలన్ కీ బేలా’వంటి చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా పోషించారు. 1966లో వచ్చిన ‘ఫూల్ ఔర్ పత్తర్’సినిమా ఆయనకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది.1971లో విడుదలైన ‘మేరా గావ్ మేరా దేశ్’తో యాక్షన్ హీరోగా స్థిరపడ్డ ధర్మేంద్రకు.. ‘ప్యార్ హి ప్యార్, ఆయా సావన్ ఝూమ్ కే, మేరే హమ్దమ్ మేరే దోస్త్’వంటి చిత్రాలు రొమాంటిక్ హీరో ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. ‘రాజా జానీ’(1972), ‘జుగ్ను’(1973) వంటి చిత్రాలు ఆయన్ను యాక్షన్ హీరోగా మరింత నిలబెట్టాయి. ‘షోలే’(1975) చిత్రానికి రూ. 1.5 లక్షల పారితోషికం తీసుకున్నారు. ఆ సినిమా నటీనటుల్లో అత్యధిక పారితోషికం అందుకున్నది ఆయనే కావడం విశేషం. అలాగే అందాల తార హేమమాలినితో కలిసి నటించిన ‘తుమ్ హసీన్ మై జవాన్, షరాఫత్, సీతా ఔర్ గీతా, రాజా జానీ, జుగ్ను, ప్రతిజ్ఞ, షోలే, చరస్, ఆజాద్, దిల్లగి’వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. వెండితెరపై హిట్ పెయిర్‌గా నిలిచిన ధర్మేంద్ర–హేమమాలిని 1980లో వివాహం చేసుకొని రియల్ లైఫ్ జోడీగా మారారు. వారికి ఇషా డియోల్, అహనా డియోల్ సంతానం. ఎన్నో రికార్డులు... ఆరు దశాబ్దాలకుపైగా సినీ కెరీర్లో ధర్మేంద్ర 300కుపైగా సినిమాల్లో నటించారు. బాలీవుడ్లో అత్యధిక హిట్ చిత్రాల్లో నటించిన రికార్డు ఆయన సొంతం. 1973లో ఎనిమిది, 1987లో వరుసగా ఏడు హిట్స్‌తోపాటు అదే ఏడాది తొమ్మిది విజయవంతమైన చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ చరిత్రలో ఇప్పటికీ ఇది ఒక రికార్డుగా ఉంది. కండలు తిరిగిన శరీర సౌష్టవంతో సినిమాల్లో కనిపించిన ధర్మేంద్ర.. అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచారు. శరీర సౌష్టవానికి తోడు యాక్షన్ చిత్రాల్లో పోషించిన పాత్రలు ఆయనకు ‘హీ మ్యాన్’ట్యాగ్‌ని తెచ్చిపెట్టాయి.పోరాట సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించి యాక్షన్ కింగ్ అనే బిరుదు సొంతం చేసుకున్నారు. 1983లో విజేత ఫిలింస్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి బేతాబ్, ఘాయల్, బర్సాత్ తదితర చిత్రాలను నిరి్మంచారు. ముఖ్యంగా తన పెద్ద కుమారుడు సన్నీ డియోల్‌తో తీసిన ‘ఘాయల్’సూపర్‌హిట్‌గా నిలిచింది. తన కుమారులు బాబీ డియోల్, సన్నీ డియోల్‌లతో కలిసి ‘అప్నే, యమ్లా పగ్లా దీవానా’వంటి సినిమాల్లో నటించారు. 2011లో ప్రముఖ రియాలిటీ షో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’మూడవ సిరీస్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.2023లో ధర్మేంద్ర తొలిసారి ‘తాజ్: డివైడెడ్ బై బ్లడ్’అనే టీవీ సీరియల్లో నటించారు. ధర్మేంద్ర నటించిన ఆఖరి చిత్రం ‘ఇక్కీస్’(2025). శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ధర్మేంద్ర రాజకీయాల్లోనూ కొంతకాలం పనిచేశారు. 2004లో రాజస్తాన్‌లోని బికనీర్ లోక్‌సభ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2009లో తన పదవీకాలం ముగిసిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అవార్డులు... కళామతల్లికి చేసిన సేవలకుగాను 2012లో కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్రను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 1997లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆయన్ను వరించింది. 1991లో వచ్చిన ‘ఘాయల్’సినిమాకుగాను ఆయన నిర్మాతగా జాతీయ అవార్డు అందుకున్నారు. 2016లో వరల్డ్ యూనివర్సిటీ ఫోరమ్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 1970లో ప్రపంచంలోని అందగాళ్లలో ఒకడిగా ధర్మేంద్ర నిలిచారు. పలు ప్రముఖ సంస్థలు ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో సత్కరించాయి. -
ధర్మేంద్ర తొలి సినిమా పారితోషికం.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ శకం ముగిసింది. దిగ్గజ నటుడు, 300లకి పైగా చిత్రాల్లో నటించిన తన పేరు చిరస్థాయిగా లిఖించుకున్న ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. చివరిశ్వాస వరకు సినిమాల్లో నటించిన ఆయన.. అనారోగ్యంతో కన్నుమూశారు. ధర్మేంద్ర మృతితో బాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ సినీ లోకానికి తీవ్ర విషాదం మిగిల్చింది. షోలే మూవీతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న ధర్మేంద్ర ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు.ఈ నేపథ్యంలో ధర్మేంద్ర తొలి సినిమా గురించి చర్చ జరుగుతోంది. ఆయన నటించిన మొదటి చిత్రమేది? అప్పట్లో ఎంత పారితోషికం అందుకున్నారని నెటిజన్స్‌తో పాటు అభిమానులు ఆరా తీస్తున్నారు. దీనిపై ఆసక్తకరి విషయం బయటకొచ్చింది. ఆయన 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అర్జున్ హింగోరానీ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌లో బల్రాజ్ సాహ్ని, కుంకుమ్ సినీతారలు కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఆయీ మిలన్ కీ బేలా, ఆయే దిన్ బహార్ కే లాంటి చిత్రాల్లో కనిపించారు. ఫూల్ ఔర్ పత్తర్ అనే మూవీ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. షోలే మూవీతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు.అయితే ఆయన తన తొలి సినిమాకు తీసుకున్న వేతనం(పారితోషికం) కేవలం జీతం రూ.51 లేనని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సల్మాన్ ఖాన్ గేమ్ షో దస్ కా దమ్‌కు హాజరైనప్పుడు ఈ విషయాన్ని పంచుకున్నారు. తన పెద్ద కుమారుడు సన్నీ డియోల్‌తో ఈ షోలో కనిపించారు. ఈ గేమ్ షోలో రూ.లక్ష గెలుచుకున్న తర్వాత.. సల్మాన్ ఖాన్ ఆయన మొదటి రెమ్యునరేషన్ గురించి ప్రశ్న అడిగాడు. నాకు కెరీర్ మొదట్లో రూ.3500 నుంచి రూ.7 వేల వరకు వచ్చేదని అన్నారు. కానీ నా ఫస్ట్ సినిమాకు రూ.5 వేల పారితోషికం ఇస్తారని అనుకున్నానని తెలిపారు. తీరా సంతకం చేసేటప్పుడు చూస్తే కేవలం రూ.51 మాత్రమే ఉందని ధర్మేంద్ర వెల్లడించారు. ఆ డబ్బులతో ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవడానికి మద్యం కొనుగోలు చేశానన్నారు. పోలీసులు పట్టుకుంటే నా కెరీర్ ముగిసిపోతుందని.. మందు తాగేటప్పుడు నా వేలిముద్రలు గ్లాస్‌పై పడకుండా రుమాలు పట్టుకుని తాగానని ధర్మేంద్ర పంచుకున్నారు.కాగా.. ధర్మేంద్ర తన కెరీర్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సీతా ఔర్ గీతా, షోలే, యాదోం కి బారాత్ వంటి చిత్రాల్లో ఆయన నటనను మరోస్థాయికి తీసుకెళ్లాయి. కొద్ది సమయంలోనే అత్యంత ధనిక నటులలో ఒకరిగా మారిపోయారు. 1970ల వరకు తన స్టార్డమ్తో పాటు యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనతో హీ-మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ఐకానిక్ బిరుదును సంపాదించుకున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగిన కెరీర్లో 300 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు. -
70 ఏళ్ల స్నేహం, సరిగ్గా ఆయన పుట్టినరోజు నాడే మాయం
ముంబై: 70 ఏళ్ల అపురూపమైన స్నేహం వారిది. ఇద్దరూ లెజెండ్స్. లెజెండరీ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ (నవంబర్ 24)న 90 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మరికొన్ని మరో లెజెండ్రీ నటుడు ధర్మేంద్ర (డిసెంబర్ 8) కూడా 90 ఏళ్లు నిండుతాయనగా జరుపుకునే వారు. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఇటీవల తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి చేరిన ప్రముఖ బాలీవుడ్ ధర్మేంద్ర ఇక సెలవంటూ ఈ లోకాన్ని వీడారు. అదీ తన ప్రాణ స్నేహితుడు సలీం ఖాన్ బర్త్‌డే రోజు కావడం మరింత విషాదాన్ని కలిగించింది. తనకు షోలే, సీతా ఔర్ గీతా చిత్రాలతో లాంటి సూపర్‌హిట్స్ అందించిన రచయిత సలీం ఖాన్ 90వ పుట్టినరోజున, 89 ఏళ్ల వయసులో మరణించడం యాదృచ్చికమే అయినా బాధాకరమైందని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ధర్మేంద్రకు అంజలి ఘటించారు.అపూర్వ స్నేహితుల పరిచయం1935వ సంవత్సరంలో వీరిద్దరూ రోజుల తేడాతో జన్మించారు. బ్లాక్‌బస్టర్ మూవీ సీతా ఔర్ గీత చిత్రంతో 1972లో సలీం ఖాన్ ,ధర్మేంద్ర తొలిసారి కలిశారు. నిజానికి సలీం-జావేద్ ఇద్దరూ దిగ్గజ రైటర్స్‌గా చలామణి అయ్యారు. ధర్మేంద్ర హీరోగా, నటి హేమ మాలిని టైటిల్ డబుల్ రోల్లో వచ్చిన చిత్రం సీతా ఔర్ గీత భారీ హిట్ అందించింది. ఆ తరువాత ధర్మేంద్ర, సలీం ఖాన్, జావేద్ అక్తర్‌తో కలిసి మరో మూడు చిత్రాలలో పనిచేశారు. వాటిల్లో ఈ ఏడాది ప్రారంభంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఐకానిక్ ‘షోలే’ కూడా ఉంది. మల్టీస్టారర్ యాదోం కి బారాత్ (1973),చాచా భటిజా (1977) ఉన్నాయి. రమేష్ సిప్పీ దర్శకత్వంలో వచ్చిన షోలే కేవలం ధరేంద్ర కరియర్లోనేకాదు, హిందీ సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం నాలుగు సినిమాలకే రచయితగా, నటుడిగా కలిసి పనిచేసినప్పటికీ, వార స్నేహసంబంధం కాలక్రమేణా వ్యక్తిగతంగా వికసించింది. చదవండి: పెళ్లయ్యి ఏడాది కాలేదు, డెంటిస్ట్ అత్మహత్య : మంత్రి సన్నిహితుడు అరెస్ట్ఫిట్నెస్లో ఆయనే స్ఫూర్తి1998లో సలీం ఖాన్ చిన్న కుమారుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో, సల్మాన్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన చిత్రం ప్యార్ కియా తో డర్నా క్యాలో ధర్మేంద్ర తండ్రి పాత్ర పోషించారు. ఈసందర్బంగా సలీంఖాన్ గురించి ధరేంద్రతో తన ఫ్రెండ్షిప్గురించి మాట్లాడారు. తమ అనుబంధం 1958-1959 నాటిదనీ, తమ స్నేహం చాలా గొప్పది, తనకు అన్నయ్య లాంటివాడు అని సలీం ఖాన్ గుర్తు చేసుకున్నారు. ఇటీవల ఖతార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ధర్మేంద్ర పట్ల తన ప్రేమ గురించి మాట్లాడాడు. 90లలో ఆయన ఫిట్నెస్ తనకు స్ఫూర్తి అనీ, ఆయన తన తండ్రిలాంటి వారు అని పేర్కొన్న సంగతి తెలిసిందే. (ముంబై-వారణాశి చిన్నారి ఆరోహి : సెలబ్రిటీలనుంచి నెటిజన్లు దాకా కళ్లు చెమర్చే కథ) -
ధర్మేంద్ర మృతిపై జగన్ దిగ్భ్రాంతి
-
'ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు'.. మెగాస్టార్ చిరంజీవి సంతాపం
బాలీవుడ్ నట దిగ్గజం ధర్మేంద్ర మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ కష్ట సమయంలో నా స్నేహితులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఆయన వారసత్వం లక్షలాది మంది హృదయాలలో సజీవంగా ఉంటుందని మెగాస్టార్ తెలిపారు.చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..' ధర్మజీ కేవలం ఒక దిగ్గజ నటుడు మాత్రమే కాదు.. అద్భుతమైన మనిషి కూడా. నేను ఆయనను కలిసిన ప్రతిసారీ వినయం, ఆప్యాయతను నేర్చుకున్నా. ఆయన మాటలు నా హృదయాన్ని లోతుగా తాకాయి. ఆయనతో నేను పంచుకున్న మధురమైన జ్ఞాపకాలు, వ్యక్తిగత క్షణాలను జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకుంటా. మృతికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నా. ఆయన వారసత్వం లక్షలాది మంది హృదయాలలో సజీవంగా ఉంటుంది. ఓం శాంతి' అంటూ సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు.జూనియర్ ఎన్టీఆర్ సంతాపంధర్మేంద్ర మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ధర్మేంద్ర జీ మరణవార్త విని చాలా బాధపడ్డా.. ఆయన గొప్ప శకాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేము.. భారతీయ సినిమాకు తీసుకొచ్చిన గొప్పతనం ఎప్పటికీ మనతో ఉంటుందని ట్వీట్ చేశారు. ఈ సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నానంటూ పోస్ట్ చేశారు. ధర్మేంద్ర మరణంతో రామ్ చరణ్ మూవీ పెద్ది టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ప్రకటించాల్సిన అనౌన్స్‌మెంట్‌ను వాయిదా వేసింది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఇవ్వాల్సిన అప్డేట్ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు పెద్ది సినిమా నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ట్వీట్ చేసింది. ధర్మేంద్ర మరణం పట్ల సంతాపం తెలిపారు మేకర్స్. Deeply saddened to hear about the passing of Dharmendra ji…An era he defined can never be replaced and the warmth he brought to Indian cinema will stay with us forever.My heartfelt condolences and prayers to the entire family.— Jr NTR (@tarak9999) November 24, 2025 Sri Dharmji was not only a legendary actor but also a remarkable human being. The humility and warmth I experienced every time I met him deeply touched my heart. I will forever cherish the fond memories and personal moments I shared with him.My heartfelt condolences on his… pic.twitter.com/TE4witXItP— Chiranjeevi Konidela (@KChiruTweets) November 24, 2025 We are deeply saddened by the news of Dharmendra ji’s passing.An era he defined can never be replaced.In this moment of grief and as a mark of respect, today’s announcement, scheduled for 4.05 PM, is being held back.Team #Peddi conveys its heartfelt condolences and prayers…— Vriddhi Cinemas (@vriddhicinemas) November 24, 2025 -
వంద ఎకరాల ఫామ్ హౌస్.. లగ్జరీ కార్లు.. ధర్మేంద్ర ఆస్తులివే!
ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) ఇవాళ కన్నుమూశారు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా దశబ్దాలుగా చెరగని ముద్రవేసిన ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర మృతితో బాలీవుడ్‌తో పాటు సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.1935 డిసెంబర్ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ఆయన కేవలం 19 ఏళ్ల వయసులోనే ప్రకాశ్ కౌర్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే అనే మూవీతో తన సినీ ప్రస్థాన ప్రారంభమైంది. ఆ తర్వాత 'షోలే'లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆ సినిమా ఆయన సినీ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు. అంతేకాకుండా రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పని చేశారు.అయితే ఇవాళ ధర్మేంద్ర మరణించడంతో ఆయన ఆస్తులపై చర్చ మొదలైంది. తన కెరీర్లో ఎన్ని ఆస్తులు కూడబెట్టరనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఓవరాల్‌గా చూస్తే ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.335 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం హీరోగానే కాదు.. తన కెరీర్లో హోటల్, అతిథ్యరంగంలో బిజినెస్ చేశారు. 2015లో న్యూఢిల్లీలో తన మొదటి రెస్టారెంట్ గరం ధరం ధాబాను ప్రారంభించారు. ఆ తర్వాత 2022లో, కర్నాల్ హైవేలో హీ మ్యాన్ అనే రెస్టారెంట్ ప్రారంభించారు.లోనావాలాలో 100 ఎకరాల ఫామ్హౌస్పుణె సమీపంలోని లోనావాలాలోని అతని 100 ఎకరాల ఫామ్‌హౌస్ కూడా ఉంది. ఆయన తన కుటుంబంతో ముంబయి నుంచి ఈ ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి వస్తుంటారు. ఈ ఫామ్‌హౌస్‌లో అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ధర్మేంద్ర రూ. 17 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఆయన పేరిట ఉన్నాయి. రూ. 88 లక్షలకు పైగా విలువైన వ్యవసాయ భూమితో పాటు రూ. 52 లక్షల విలువైన వ్యవసాయేతర ప్లాట్స్ ఉన్నాయి. ఫామ్‌హౌస్ సమీపంలోని 12 ఎకరాల స్థలంలో ఓ రిసార్ట్‌ను అభివృద్ధి చేశారు.లగ్జరీ కార్లు..లగ్జరీ కార్లు అంటే ధర్మేంద్రకు చాలా ఇష్టం. ఆయన మొదట వింటేజ్ ఫియట్ అనే కారును కొన్నారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు రేంజ్ రోవర్ ఎవోక్ (రూ. 85.74 లక్షలు), మెర్సిడెస్-బెంజ్ (రూ. 98.11 లక్షలు)ను కొనుగోలు చేశాడు. అంతేకాకుండా 1983లో ధర్మేంద్ర విజేత ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించారు. తన బ్యానర్లోనే కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌లను బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. 1983లో బేతాబ్‌తో సన్నీ, 1995లో బర్సాత్తో బాబీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తన మనవడు కరణ్ డియోల్ పాల్ పాల్ దిల్ కే పాస్ అనే మూవీతో 2019లో అరంగేట్రం చేశాడు. అలా తనతో పాటు భారతీయ సినిమాపై కుటుంబ వారసత్వం శాశ్వతంగా ఉండేలా ప్రోత్సహించారు ధర్మేంద్ర. -
Dharmendra: దిగ్గజ నటుడి మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మృతిపట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రఖ్యాత నటుడు, పార్లమెంటేరియన్ అయిన ధర్మేంద్ర మరణం తనను ఎంతో కలచివేసిందని అన్నారాయన. ‘‘మంచి నటుడుగా, మంచి పార్లమెంటు సభ్యునిగా అయన ఎంతో కీర్తిని పొందారు. ఆయన తన జీవితంలో సరళత, మానవత్వం, ఆప్యాయత, ఉత్సాహం.. విలువలను ప్రతిబింబించారు. అలాంటి వ్యక్తి మృతి బాధ కలిగించింది. ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Deeply saddened to hear about the passing of the legendary Dharmendra ji. As a charismatic film hero and a Parliamentarian, he embodied simplicity, humanity, warmth, and energy.My heartfelt condolences to his family. May God give them strength during this difficult time. Om… pic.twitter.com/W3xMxsZZk8— YS Jagan Mohan Reddy (@ysjagan) November 24, 2025 -
Dharmendra : బాలీవుడ్ దిగ్గజ నటుడు కన్నుమూత
-
డ్రీమ్ గర్ల్నే మెప్పించిన 'ధర్మేంద్ర'.. కెరీర్‌నే మార్చిన సంఘటన ఇదే
బాలీవుడ్లో ఓ శకం ముగిసింది. హీ మ్యాన్ ధర్మేంద్ర (89) తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ఇంట్లోనే కన్నుమూశారు. ఈయన మృతి విషయాన్ని ఇంకా కుటుంబ సభ్యులు బయటపెట్టలేదు కానీ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ క్రమంలోనే సినీ రాజకీయ ప్రముఖులు ఈయన మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఇంతకీ ధర్మేంద్ర ఎవరు? ఆయన జీవితంలోని విశేషాలు ఏంటనేది ఈ స్టోరీలో చూద్దాం.1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరం సింగ్ డియోల్. 1960ల నుండి 1980ల వరకు ఈయన నటించిన చిత్రాలు యాక్షన్, రొమాన్స్, కామెడీకి ఐకాన్‌గా నిలిచాయి. 300కు పైగా మూవీస్ చేసిన ఈయన ఎక్కువగా యాక్షన్ చిత్రాలతోనే మెప్పించారు. దీంతో అభిమానులు కూడా "యాక్షన్ కింగ్", "హీ-మ్యాన్" అని ముద్దుగా పిలుచుకుంటారు. షోలే (1975) చిత్రం ఆయన కెరీర్లో పెద్ద మలుపు. ఆ తర్వాత సీత ఔర్ గీత, చుప్కే చుప్కే, ధరమ్ వీర్ వంటి క్లాసిక్ చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆయన ఎంతమంది దర్శకులతో చేసినా, అన్నీ వేటికవే వైవిధ్యభరితంగా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు.. ధర్మేంద్ర కళ్లు చెదిరే సంపద)బాలీవుడ్‌లలో కండలు తిరిగిన సౌష్టవంతో కనిపించి ఆరోజుల్లోనే ధర్మేంద్ర ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఆరోజుల్లో చాలామంది అమ్మాయిల కలల రాకుమారునిగా నిలిచారు. ఏకంగా అందరి ‘డ్రీమ్ గర్ల్’గా పేరొందిన హేమామాలిని అంతటి అందాలతారను ఆయన తన సొంతం చేసుకున్నారు. ‘మేచో మేన్’గా పేరొందిన తొలినటుడిగా పేరుగాంచిన ధర్మేంద్ర.. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ ప్రస్తుత ట్రెండ్ వరకు తన చిత్రాలకు కలెక్షన్స్ వర్షం కురిసింది. బాలీవుడ్ నుంచి సౌత్ ఇండియా వరకు సుమారు రెండు దశాబ్దాల కాలం పాటు సినిమా పరిశ్రమలో ఎదురులేని మనిషిగా రాణించారు.టాలెంట్‌తో తొలి ఛాన్స్లూధియానా సమీపంలోని లాల్టోన్ కలాన్ అనే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ధర్మేంద్ర తండ్రి ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. దీంతో ఆయన అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. చదువులు పెద్దగా చురుకుగా ఉండేవాడు కాదు. ఏదో రకంగా తన మెట్రిక్యులేషన్ పాసయ్యారు. అయితే, స్కూల్ రోజుల్లోనే స్టేజీలపై నాటకాలు వేయడం ఇష్టం. అప్పట్లో ‘పిలిమ్ ఫేర్’ మేగజైన్ కొత్తవారి టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ పోటీలో ధర్మేంద్ర విజేతగా నిలవడంతో కెరీర్ మలుపు తిప్పింది. ముంబైకి వస్తే సినిమా ఛాన్సులు ఇస్తామని వారు చెప్పడంతో అటువైపు అడుగులు వేశారు. (ఇదీ చదవండి: ధర్మేంద్ర వద్దన్నా హేమమాలిని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?)ముంబై వెళ్లిన ఆయనకు నిరాశే ఎదురైంది. కానీ, పట్టువదలకుండా అక్కడే ఉంటూ తన వేట సాగించారు. సరిగ్గా అలాంటి సమయంలోనే దర్శకుడు అర్జున్ హింగోరానీ కంటికి ధర్మేంద్ర పర్సనాలిటీ చూసి ఫిదా అయిపోయాడు. దీంతో తన సినిమాలో హీరోగా అవకాశం కల్పించారు. అలా తన మొదటి సినిమా ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’లో మెప్పించారు. అందులో బలరాజ్ సహానీ వంటి మేటి నటునితో కలసి ధర్మేంద్ర నటించడం విశేషం. అయితే, అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ మెప్పించలేదు. ఆ తరువాత కొన్ని చిత్రాలలో సైడ్ హీరోగానూ నటించాల్సి వచ్చింది. 1962లో విడుదలైన ‘అన్ పడ్’ చిత్రం సూపర్ హిట అయింది. కానీ, 1966లో వచ్చిన ‘ఫూల్ ఔర్ పత్థర్’ చిత్రం ధర్మేంద్రను స్టార్ హీరోను చేసింది.హేమమాలినితో ప్రేమ.. రెండో పెళ్లి1970 ధర్మేంద్ర, హేమమాలినితో జోడీ మొదలైంది. వారిద్దరి కాంబినేషన్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రాజా-జానీ, సీతా ఔర్ గీతా, షరాఫత్, నయా జమానా, పత్థర్ ఔర్ పాయల్, తుమ్ హసీన్ మై జవాన్, చరస్, దోస్త్, మా, షోలే, ఆజాద్ వంటి సినిమాలు వారిద్దరి కాంబినేషన్లో సంచలనం రేపాయి. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే, అప్పటికే ధర్మేంద్రకు పెళ్లి అయిపోయింది. పిల్లలు కూడా ఉన్నారు. కానీ, హేమ మనసు ఆయనతో కలిసి అడుగులు వేయాలని కోరుకుంది. దీంతో వీరిద్దరూ 1980లో వివాహం చేసుకున్నారు. ఈ జోడికి జన్మించిన వారే ఇషా డియోల్, అహనా డియోల్ . ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్‌కు జన్మించిన వారిలో సన్నీ డియోల్, బాబీ డియోల్ ఉన్నారు. వారిద్దరూ కూడా హీరోలుగా మెప్పించారు. హేమామాలినితో పెళ్లి తర్వాత కూడా తన కుమారులని ఆయన దూరం పెట్టలేదు. నిర్మాతగా వారిద్దరిని హీరోలుగా పరిచయం చేస్తూ చిత్రాలు నిర్మించారు.ధర్మేంద్ర కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. రాజకీయాల్లోనూ సత్తా చాటారు. రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. 2012లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.(ఇదీ చదవండి: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మంద్ర జీవితంలోని స్పెషల్ ఫొటోలు) -
బాలీవుడ్ యాక్షన్ కింగ్ 'ధర్మేంద్ర' కన్నుమూత
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) ఇక లేరు. ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Actor Dharmendra Death) విడిచారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బందిపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ధర్మేంద్ర చికిత్స పొందుతుండగా తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి వద్దే వ్యైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. అయితే, పరిస్థితి విషమించడంతో ధర్మేంద్ర మరణించారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. యాక్షన్ కింగ్‌గా, బాలీవుడ్ హీ మ్యాన్‌గా గుర్తింపు దక్కించుకున్నారు.(ఇదీ చదవండి: ధర్మేంద్ర వద్దన్నా హేమమాలిని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?)1935 డిసెంబర్ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ధర్మేంద్ర-ప్రకాశ్ కౌర్‌కు సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం. ధర్మేంద్ర-హేమామాలిని ఇషా డియోల్, ఆహానా డియోల్ సంతానం. అత్యంత ప్రాచుర్యం పొందిన 'షోలే'లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆ సినిమా ఆయన సినీ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు. రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పని చేశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.ధర్మేంద్ర చనిపోయినట్లు ప్రస్తుతం జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశాన వాటికకు ధర్మేంద్ర భార్య హేమమాలిని, కూతురు ఈషా డియోల్, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వచ్చిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్.. ధర్మేంద్ర మృతి విషయాన్ని ధ్రువీకరించారు. ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు.(ఇదీ చదవండి: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మంద్ర జీవితంలోని స్పెషల్ ఫొటోలు)#HemaMalini reaches the cremation ground after #Dharmendra Ji's demise. #FilmfareLens pic.twitter.com/fGwcgb2CSX— Filmfare (@filmfare) November 24, 2025Daughter #EshaDeol arrives at the Pawan Hans Cremation Centre for #Dharmendra ji’s last rites.#FilmfareLens pic.twitter.com/fpqOIUT2uv— Filmfare (@filmfare) November 24, 2025#WATCH | Maharashtra: Actors Amitabh Bachchan and Abhishek Bachchan arrive at Vile Parle Crematorium in Mumbai. An official statement on veteran actor Dharmendra's health is awaited. pic.twitter.com/JIXuoWvq5L— ANI (@ANI) November 24, 2025 -
మీకు సిగ్గుగా అనిపించడం లేదా: సన్నీ డియోల్
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (Dharmendra) ఆసుపత్రి నుంచి ఇప్పటికే ఇంటికి చేరుకున్నారు. కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన మరణించారంటూ బాలీవుడ్ మీడియాలో మొదట కథనాలు ఇచ్చింది. దీంతో ఆయన అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందారు. అయితే, ధర్మేంద్రకు ఇంటి వద్దే చికిత్స అందించాలని కుటుంబం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆయన్ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే, మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన కుమారుడు సన్నీ డియోల్ ఫైర్ అయ్యారు.ఆసుపత్రి నుంచి ధర్మేంద్ర ఇంటికి చేరుకుంటున్న సమయంలో మీడియా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంది. దీంతో సన్నీ డియోల్ ఫైర్ అయ్యాడు. తమ కుటుంబ గోప్యతకు గౌరవం ఇవ్వాలంటూ మీడియా సంస్థలపై అసహనం వ్యక్తం చేశాడు. 'మీ అందరికీ కూడా ఇంట్లో తల్లిదండ్రులతో పాటు పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి తప్పుడు వార్తలు ఇవ్వడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా..' అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ధర్మేంద్రకు ఆయన నివాసంలోనే వైద్యం అందిస్తున్నారని వైద్యులు తెలిపారు. డిసెంబరు 8న 90వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. -
కదల్లేని స్థితిలో ధర్మేంద్ర.. వీడియో వైరల్
ఒకప్పటి హీరో, బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్ర చనిపోయారని చెప్పి రెండు రోజుల క్రితం వార్తలొచ్చాయి. ఇవి వచ్చిన కాసేపటికే ఈయన భార్య హేమమాలిని, కూతురు ఈషా డియోల్.. వీటిని ఖండించారు. ధరేంద్ర బ్రతికే ఉన్నారని, ఇలాంటి పుకార్లు సృష్టించడం సరికాదని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో క్లారిటీ కూడా ఇచ్చారు.(ఇదీ చదవండి: రజనీకాంత్ 173వ సినిమా.. వారంలోనే తప్పుకొన్న దర్శకుడు)ఇప్పుడు ధర్మేంద్రకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో మంచంపై కదల్లేని స్థితిలో ఆయన కనిపించారు. ఎదురుగా కొడుకు బాబీ డియోల్ బాధపడుతూ కనిపించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి, ఇంటికి వచ్చేసినప్పటికీ ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని ఈ వీడియో చూస్తుంటేనే అర్థమవుతోంది. ఈయన త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు, బాలీవుడ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లీగల్ కామెడీ మూవీ.. అధికారిక ప్రకటన)The Full Video From Dharmendra ji His discharge from the Hospital But health is not Well Please Pray For Dharmendra ji 🙏 #DharmendraDeol #dharmendra pic.twitter.com/D7Z56vrbVo— Jolly Christian (@Jolly7294) November 13, 2025 -
నటుడు ధర్మేంద్ర హెల్త్ అప్డేట్
ప్రముఖ నటుడు ధర్మేంద్ర పూర్తి ఆరోగ్యంతో బుధవావరం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. బ్రీచ్ కాండీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించినట్లు పిటిఐ పేర్కొంది. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని నవంబర్ 10న చికిత్స కోసం ఐసీయూలో చేరారు. అయితే, రొటీన్ చెకప్ కోసమే వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్పారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా అదే సమయంలో విజ్ఞప్తి చేశారు.కానీ , ఆయన మరణించారని మొదట నేషనల్ మీడియాలో వార్తలు రావడంతో అందరిలో ఆందోళన మొదలైంది. దీంతో ఆయన కుమార్తె సోషల్‌మీడియా ద్వారా తన తండ్రి క్షేమంగా ఉన్నారని చెప్పడంతో ఫేక్ వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ధర్మేంద్ర డిశ్చార్జి సమయంలో ఆయన కుమారుడు బాబీ డియోల్ ఉన్నారు. -
100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద
ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ధర్మేంద్ర (89)పై వస్తున్న అనేక ఫేక్ న్యూస్ మధ్య ఆయన కోలుకుంటున్నారనే వార్త ఎంతోమంది అభిమానులకు ఊరట నిచ్చింది. ఫూల్ ఔర్ పత్తర్, మేరా గావ్ మేరా దేశ్, షోలే, ఖామోషి, జానీ గద్దర్, ఇలాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో బాలీవుడ్ ఐకాన్‌గా నిలిచారు. కళా రంగంలో ఆయన చేసిన సేవలకు గాను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డును కూడా పొందారు ధర్మేంద్ర. అయితే తాజాగా ఆయన ఆస్తి ఎంత అనేది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అసలైన హీ-మ్యాన్‌గా పాపులర్ అయిన ధర్మేంద్ర, బాలీవుడ్‌లోని అత్యంత ధనిక స్టార్స్ లో ఒకరు. నటనతోపాటు ఆయన వ్యాపారం రంగంలోకూడా తనదైన ముద్రను వేసుకున్నారు. 2015లో న్యూఢిల్లీలోని గరం ధరం ధాబాతో రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు ధర్మేంద్ర. 2022లో, కర్నాల్ హైవేలో హీ-మ్యాన్ అనే మరో హోటల్‌ను కూడా స్థాపించారట.100 ఎకరాల విశాలమైన ఫామ్హౌస్ధర్మేంద్ర తన కుటుంబంతో ముంబైలో నివసిస్తున్నప్పటికీ, నగరానికి దూరంగా ప్రశాంతతకు మారు పేరైన లోనావాలాలో విశాలమైన 100 ఎకరాల ఫామ్‌హౌస్ ఉంది. ఆధునిక సౌకర్యాలతో ముఖ్యంగా ఆక్వా థెరపీ తీసుకునేందుకు వీలుగా వేడి నీటితో కూడిన స్విమ్మింగ్ పూల్ ఉండే ఇక్కడికి తరచూ వెళుతూ ఉంటారు కూడా. అంతేకాదు ఇక ఒక రిసార్ట్‌ను అభివృద్ధి చేయడం ద్వారా హాస్పిటాలిటీ వ్యాపారంలోకి మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు సమాచారం.పలు నివేదికల ప్రకారం ధర్మేంద్రకు మహారాష్ట్రలో రూ.17 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. రూ.88 లక్షలకు పైగా విలువైన వ్యవసాయ భూమి, రూ.52 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి కూడా ఉన్నాయి. ఒక రెస్టారెంట్ చైన్‌తో భాగస్వామ్యంతో 12 ఎకరాల స్థలంలో 30-కాటేజ్ రిసార్ట్‌ను నిర్మించారుట. ఆరు దశాబ్దాల కెరీర్ మొత్తంలో, 300 కి పైగా చిత్రాలలోనటించిన ఆయన ఆస్తుల విలువ,సుమారు రూ.335– 450 కోట్లు ఉంటుందని అంచనా. అయితే డియోల్ కుటుంబ మొత్తం సంపద 1,000 కోట్లకు మించి ఉంటుందని మరో అంచనా.ఇదీ చదవండి: 20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యంలగ్జరీ కార్లు లగ్జరీ కార్లు అంటే ధర్మేంద్రకు చాలా ఇష్టం. ఆయన దగ్గరున్న అద్భుతమైన కార్ల కలెక్షనే ఇందుకు నిదర్శనమంటారు. వింటేజ్ ఫియట్ కారు విలువ రూ. 85.74 లక్షలు. రూ. 98.11 లక్షల విలువైన రేంజ్ రోవర్ ఎవోక్ మెర్సిడెస్-బెంజ్ SL500 వంటి ఆధునిక లగ్జరీ కార్లతో అతని గ్యారేజ్ నోస్టాల్జియా , ఐశ్వర్యానికి ప్రతిబింబంగా ఉంటుంది. ప్రొడక్షన్ హౌస్నటనతో పాటు, ధర్మేంద్ర నిర్మాతగా కూడా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు.. 1983లో తన నిర్మాణ సంస్థ విజయ్తా ఫిల్మ్స్‌ను ప్రారంభించారు. ఈ బ్యానర్ కింద, అతను తన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌లను బేతాబ్ (1983), బర్సాత్ (1995) సినిమాలతో వరుసగా విజయ వంతమైన అరంగేట్రాలతో బాలీవుడ్‌కు పరిచయం చేశారు. 2019లో తన మనవడు కరణ్ డియోల్‌ను తొలి చిత్రం పాల్ పల్ దిల్ కే పాస్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ధర్మేంద్రకు రెండు పెళ్లిళ్లు. సినీ జీవితంలోకి అడుగుపెట్టకముందే 1954లో ప్రకాష్ కౌర్ పెళ్లాడారు. మొదటి భార్య ద్వారా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. బాలీవుడ్ స్టార్‌హీరోగా మారిన తరువాత ప్రకాష్ కౌర్ నుంచి విడాకులు తీసుకోకుండానే 1980లో డ్రీమ్‌గర్ల్ హేమా మాలినిని వివాహం చేసుకున్నారు. వీరికి ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు. -
నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్
బాలీవుడ్ దిగ్గజ హీరో ధర్మేంద్ర చనిపోయారని ఉదయం నుంచి వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాన్న మరణించలేదని, మీడియాలో వస్తున్నవి అవాస్తవాలని ఈయన కూతురు ఈషా డియోల్ అంటోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో తాజాగానే పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు తికమక పడుతున్నారు.గత కొన్నాళ్లుగా శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈయన.. వెంటిలేటర్‌పై ఉన్నారని సోమవారం సాయంత్రం వార్తలొచ్చాయి. దీంతో స్పందించిన ఆయన టీమ్.. ఏం ఇబ్బంది లేదని, బాగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు (మంగళవారం) ఉదయానికల్లా మొత్తం మీడియాలో ధర్మేంద్ర చనిపోయారని న్యూస్ వచ్చింది. కానీ ఈయన కూతురు ఈషా మాత్రం తండ్రి ప్రస్తుతం కోలుకుంటున్నారని క్లారిటీ ఇచ్చింది.అలానే ధర్మేంద్ర భార్య, నటి హేమమాలిని కూడా చనిపోలేదని క్లారిటీ ఇచ్చారు. 'జరిగిన దాన్ని క్షమించలేం. చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్న వ్యక్తి గురించి అవాస్తవాలు ఎలా ప్రచారం చేస్తారు? ఇది ఆయన్ని అగౌరవపరచడమే. మా కుటుంబానికి గౌరవం ఇవ్వడంతో పాటు కాస్త ప్రైవసీ కూడా ఇవ్వండి' అని హేమమాలిని ట్వీట్ చేశారు.ధరేంద్రకు ఇద్దరు భార్యలు ప్రకాశ్ కౌర్, హేమమాలిని. ప్రకాశ్ కౌర్‌కి పుట్టిన కొడుకు సన్నీ డియోల్, బాబీ డియోల్. హేమామాలినికి ఈషా డియోల్, అహనా డియోల్ అని కూతుళ్లు ఉన్నారు.What is happening is unforgivable! How can responsible channels spread false news about a person who is responding to treatment and is recovering? This is being extremely disrespectful and irresponsible. Please give due respect to the family and its need for privacy.— Hema Malini (@dreamgirlhema) November 11, 2025 -
Dharmendra: బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర జీవితంలో స్పెషల్ (ఫొటోలు)
-
వెంటిలేటర్‌పై సీనియర్ నటుడు ధర్మేంద్ర.. స్పందించిన టీమ్!
బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆరోగ్యం విషమంగా ఉందని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని నెట్టింట వార్తలొచ్చాయి. ఇటీవలే ఆయన ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందని సోషల్ మీడియాలో కథనాలొచ్చాయి. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మేంద్రపై వస్తున్న కథనాలపై ఆయన టీమ్ స్పందించింది.అయితే ధర్మేంద్ర ఆరోగ్యంపై వస్తున్న కథనాలన్నీ అవాస్తమని ఆయన టీమ్ కొట్టిపారేసింది. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని తెలిపింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారన్న వార్తలు నిజం కాదని టీమ్ స్పష్టం చేసింది. ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ కూడా ఆస్పత్రికి వెళ్లి వచ్చారని వెల్లడించింది. అలాంటిది ఏదైనా జరిగి ఉంటే అతని కుటుంబం మొత్తం ఆసుపత్రిలో ఉండేదని పేర్కొంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ తెలిపింది.కాగా.. ధర్మేంద్ర అక్టోబర్ 31న సాధారణ చెకప్ కోసం ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో అతని భార్య హేమ మాలిని కూడా ఆయన బాగానే ఉన్నారని వెల్లడించారు. ఇక సినిమాల విషయానికొస్తే ధర్మేంద్ర చివరిసారిగా 2024లో విడుదలైన తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన నటించిన అగస్త్య నందా ఇక్కిస్ చిత్రం ఉంది ఈ ఏడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. -
ఆసుపత్రిలో నటుడు ధర్మేంద్ర.. తండ్రితో పాటు బాబీ డియోల్
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. అయితే, కేవలం వైద్య పరీక్షల కోసం మాత్రమే ధర్మేంద్ర వెళ్లారని చెబుతున్నారు. సోషల్‌మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని వారు కోరుతున్నారు.ఆసుపత్రిలో ధర్మేంద్రతో పాటు ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్( Bobby Deol) కూడా ఉన్నారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఉండటం వల్ల కొన్ని వైద్య పరీక్షలు చేపిస్తున్నట్లు చెప్పారు. చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని తెలిపారు. కానీ, డిశ్చార్జ్ తేదీపై వారు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర డిసెంబర్లో తన 90వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ధర్మేంద్ర కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిదే. వృత్తిపరంగా, ధర్మేంద్ర చివరిసారిగా 2024లో తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంలో నటులు షాహిద్ కపూర్, కృతి సనన్ నటించారు. -
సల్మాన్ ఒక గూండా, నీచుడు.. ఆ స్టార్ హీరో దర్శకుడిని చితకబాదాడు!
బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ హిందీ చలనచిత్ర పరిశ్రమకు గుడ్‌బై చెప్పేసి సౌత్‌కు షిఫ్ట్ అయిపోయాడు. అనురాగ్ సోదరుడు అభినవ్ కశ్యప్ (Abhinav Kashyap) కూడా దర్శకుడిగా హిందీలో రెండే రెండు సినిమాలు చేసి సైలెంట్ అయిపోయాడు. అవి దబాంగ్, బేషరం. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ మూవీ బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. దీనికి దబాంగ్ 2, 3 అంటూ రెండు సీక్వెల్స్ కూడా వచ్చాయి.ధర్మేంద్రను తీసుకోవాలంటే భయంవాటిలో సల్మాన్ (Salman Khan) హీరోయే కానీ దర్శకుడు మాత్రం మారిపోయాడు. అందుకు గల కారణాన్ని దర్శకుడు అభినవ్ తాజాగా బయటపెట్టాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. దబాంగ్ సినిమా ప్రారంభంలో అంతా బానే ఉంది. అందరం అనుకున్నట్లుగా అనుపమ్ ఖేర్, ఓం పురిని తీసుకున్నాం. కానీ, ధర్మేంద్రను సెలక్ట్ చేసుకోవాలంటే భయమేసింది. అందుకే ఆయనకు బదులుగా వినోద్ ఖన్నాను తీసుకున్నాను.దర్శకుడిని చితకబాదిన హీరోనిజానికి దబాంగ్ మూవీ చేయమని ధర్మేంద్రను కలిశాను. అందుకాయన.. బేటా, ముఖ్యమైన పాత్ర ఉంటేనే ఇవ్వు, లేదంటే వద్దు అని చెప్పాడు. దాంతో నాకు భయమేసింది. ఆయన ఎలాంటి పాత్ర ఆశిస్తున్నాడో అర్థం కాలేదు. ఎందుకంటే ధర్మేంద్రతో అసభ్య సన్నివేశం చిత్రీకరించినందుకుగానూ దర్శకుడు కాంతిషాపై హీరో సన్నీడియోల్ (Sunny Deol) చేయి చేసుకున్నాడని రూమర్లున్నాయి. ఏదైనా తేడా వస్తే గొడవ ఖాయం అని అర్థమై ధర్మేంద్రను పక్కనపెట్టాను. ఇక నేను ఏ నటుడితో మంతనాలు జరిపినా సల్మాన్ సోదరుడు సోహైల్ నా వెంటే వచ్చేవాడు.తండ్రి ధర్మేంద్రతో బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్సల్మాన్ ఓ గూండాతనే అందరి పారితోషికం గురించి చర్చలు జరిపాడు. వాళ్ల సూచనల ప్రకారమే యాక్టర్స్‌ను సెలక్ట్ చేసుకున్నా.. కానీ వారికి వ్యతిరేకంగా సోనూసూద్‌ను సినిమాలో తీసుకున్నా.. సోనూ ఫిజిక్ చూసి సల్మాన్ ఈర్ష్య పడేవాడు. అయినా సరే, వాళ్ల మాటను కాదని సోనూసూద్‌ను ఎంపిక చేసుకున్నాను. దబాంగ్ సినిమా ముందువరకు సల్మాన్ ఏంటో నాకు తెలీదు. కానీ, తర్వాత అర్థమైంది అతడో పెద్ద గూండా అని! అతడికి యాక్టింగ్ అంటే ఆసక్తి లేదు. సెలబ్రిటీ హోదాను మాత్రం ఇష్టపడేవాడు. అతడో నీచుడు, చెడ్డ వ్యక్తి అని అభినవ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు.డైరెక్టర్‌పై సన్నీడియోల్ ఆవేశం.. అసలు కథ2017లో మిడ్డేలో వచ్చిన వార్తా కథనం ప్రకారం.. ధర్మేంద్ర స్టార్డమ్ కోల్పోయిన సమయంలో బీ గ్రేడ్, సీ గ్రేడ్ (తక్కువ బడ్జెట్, తక్కువ క్వాలిటీతో) సినిమాలు చేశారు. అందులో కొన్ని దర్శకనిర్మాత కాంతి షా తెరకెక్కించారు. అందులో ఓ సినిమాలో ధర్మేంద్రకు గుండెపోటు వచ్చినట్లుగా నటించమన్నాడు. కానీ దాన్ని ఎడిటింగ్‌లో పూర్తిగా మార్చేశాడు. బెడ్రూమ్ సన్నివేశాల్లో నటించినట్లుగా అశ్లీలంగా రీఎడిట్ చేశాడు. అశ్లీల సీన్లో ధర్మేంద్ర!మొదటగా ఈ సినిమాను పంజాబ్‌లో రిలీజ్ చేశారు. ఎంతో పేరు ప్రఖ్యాతలున్న ధర్మేంద్ర ముసలితనంలో ఇలా ఓ అమ్మాయితో బెడ్‌పై కనిపించడం చూసి అభిమానులు షాకయ్యారు. దీంతో ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ ఆ దర్శకుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఓ కథ గురించి చర్చించుకుందాం రమ్మని దర్శకుడు కాంతిని ఆఫీస్‌కు పిలిపించాడు. ఆ తర్వాత అతడిని దారుణంగా కొట్టాడు.చదవండి: ఓటీటీలో సూపర్ హిట్ హారర్ సినిమా.. ఎక్కడంటే? -
షోలే... అప్పుడది... తుపాన్ ఇండియా
సినిమా మొత్తం రెండు జతలకు మించి వాడని హీరోలు.. హీరోయిన్ ఏమో టాంగేవాలీ.. ఇంకో హీరోయిన్ వితంతువు.. ముఖ్య క్యారెక్టర్ ఆర్టిస్టుకు రెండు చేతులూ ఉండవు.. విలన్‌కు గట్టిగా చూస్తే 20 మందికి మించి గ్యాంగ్ లేదు.. లొకేషన్ ఉత్త రాళ్లదిబ్బలు.. ఇవాళ్టి పాన్ ఇండియా సినిమాలతో పోల్చి చూస్తే ఈ లక్షణాలతో ఏదైనా సినిమా సూపర్ హిట్ అవుతుందా? అవుతుంది.. అయ్యింది.. అవుతూనే ఉంది.. ‘షోలే’ – ఒక ప్రెజెంట్ కంటిన్యుయెస్ టెన్స్ 50 ఏళ్లుగా ‘షోలే’ లిఖించిన రికార్డులు ఎన్నో. చెప్పిన కొటేషన్లు మరెన్నో. ‘జో డర్ గయా.. సమ్ఝో మర్గయా’.. మరణమే లేని షోలేతో ప్రేక్షకుల వీడని దోస్తీ గురించి ప్రత్యేక కథనం..‘పుష్ప’ సినిమా రెండు పార్ట్‌లుగా వచ్చి కోట్లు సంపాదించింది. ఒక గంధపు చెక్కల స్మగ్లర్ హీరోనా అని ఒకరిద్దరు క్వశ్చన్ చేశారు. కాని సగటు జనం జానేదో అని సూపర్‌హిట్ చేశారు. ఈ సగటు జనం ఇక్కడి వరకూ చేయడానికి చాలా మెట్లు పడ్డాయి. వాటిలో ‘షోలే’ (Sholay Movie) ఒకటి.సలీమ్–జావేద్ హిందీలో యాంగ్రీ యంగ్మేన్ను తెచ్చారు. అంటే స్వాతంత్య్రం వచ్చాక జన్మించి, యుక్త వయసు వచ్చేనాటికి అంటే 1970ల నాటికి దేశ స్థితి చూస్తే ఆకలి, దరిద్రం, నిరుద్యోగం, బ్లాక్ మార్కెట్. రోజులు ఇలా ఉంటే అమ్మాయి వెంట పరిగెత్తి విరహగీతాలు పాడే హీరో చెల్లుబాటు కాడు అని వాళ్లు కోపంగా ఉండే హీరోని తెచ్చారు. ‘జంజీర్’లో అమితాబ్ అలాంటి హీరో. ఇతను ఇన్స్పెక్టర్గా ఉంటూ కూడా తన తల్లితండ్రులను చంపినవాణ్ణి చట్టప్రకారం శిక్షించలేకపోతాడు. యూనిఫామ్‌ను వదిలాకే పగ సాధిస్తాడు. చట్టానికి ఆవల కొన్ని పనులు చేసే హీరోలు అలా పుట్టుకొచ్చారు. ఆ తర్వాత ‘దీవార్’ వచ్చింది. కష్టపడి పని చేసే హీరోకు బదులు అడ్డదారిలో స్మగ్లర్‌గా మారే హీరోగా కనిపిస్తాడు అమితాబ్. సినిమాలో నిజాయతీపరుడైన శశికపూర్ (Shashi Kapoor) ఉన్నా అందలానికి ఎదిగిన అమితాబ్‌ను ఆరాధిస్తాడు ప్రేక్షకుడు. ఈ వరుసలోనే వచ్చింది ‘షోలే’. ఇక్కడ అత్యంత దుర్మార్గుడైన గబ్బర్ సింగ్‌ను సంహరించడానికి ఇద్దరు చిల్లర దొంగలను కాంట్రాక్ట్ మీద పట్టుకొస్తాడు ఊరి పెద్ద ఠాకూర్. చిల్లర దొంగల్లో వీరత్వం ఉండటం, కొంచెం మానవత్వం ఉండటంతో మేలు చేయని పోలీసుల కంటే కొద్దిగా కీడు చేసే చిల్లర దొంగలే నయం అనుకుంటారు రామ్‌గఢ్ వాసులు, తద్వారా ప్రేక్షకులు. ఆ విధంగా సకల సద్గుణ శోభితుడైన హీరోకు నూకలు చెల్లుతూ వచ్చి ‘పుష్ప’ వరకూ అతడు రూపాంతరం చెందాడు.‘షోలే’ కథ అంతా రెండు లైన్లలో చె ప్పొచ్చు. గొప్ప కథలు ఏవంటే కట్టె కొట్టె తెచ్చె అన్నట్టుగా చెప్పగలిగేవే. పోలీస్ ఆఫీసర్ ఠాకూర్ కుటుంబాన్ని గబ్బర్ సింగ్ చంపేశాడు. ఆ ప్రాంతానికి పీడగా మారాడు. వాణ్ణి చంపడానికి ఠాకూర్ ఇద్దరు దొంగలను కిరాయికి తెచ్చాడు. అంతే కథ. ఈ కథను మూడున్నర గంటల పాటు 70 ఎం.ఎం స్క్రీన్ మీద దర్శకుడు, నటీనటులు, రచయితలు, కెమెరామేన్, సంగీత దర్శకుడు ఎలా చూపారనేదే అసలు సంగతి. వాళ్లు ఎలా చూపారంటే అలా మరెవరూ, మరెప్పుడూ చూపలేకపోయారు. అందుకే షోలే అంటే షోలే. ఇలాంటి సినిమాలు సర్పాల తలలపై మణుల వంటివి. రీమేక్‌లని ప్రయత్నిస్తే మణులు రాళ్లయిపోతాయి. లేదా పాము కాటు తప్పదు. అందుకే ‘షోలే’ను మళ్లీ మళ్లీ ముస్తాబు చేసి వదిలారు తప్ప రీమేక్ అంటే జనం తుపాకులు తీశారు.‘షోలే’ యాక్షన్ సినిమా అనుకుంటారు. ఫక్తు కుటుంబ కథా చిత్రం. కుటుంబమే దీనికి ఆధారం. ఠాకూర్ కుటుంబాన్ని గబ్బర్ గాడు కాల్చి చంపాడు. కుటుంబం కోల్పోతే మనిషికి ఉండే బాధతో ప్రేక్షకుడు ఐడెంటిఫై అవుతాడు. ఆ రోజుల్లో మగవారి ఎర్లీ డెత్స్ వల్ల ప్రతి ఇంటా ఒక వితంతువు ఉండేది. జయభాదురి (Jaya Bhaduri) వేసిన రాధ పాత్రను ప్రేక్షకులు పోల్చుకున్నారు. భర్త పోయిన ఎన్నో ఏళ్లకు ఆమె ‘జయ్’ అనే అమితాబ్‌ను చూసి మళ్లీ అతనితో కుటుంబాన్ని నిర్మించుకోవచ్చేమో అని ఆశ పడుతుంది. ఆ ఆశ ప్రేక్షకులకు తెలుసు. ఆమెకో కుటుంబం ఏర్పడాలని వారూ అనుకుంటారు. జరగదు. జయ్ చనిపోతాడు. ప్రేక్షకులు అక్కడా కనెక్ట్ అవుతారు. ఏ తాడూ బొంగరం లేని వీరూ అను ధర్మేంద్ర టాంగేవాలీతో సరసం చేసి సాధించుకుంది మౌసీతో పాటు ఒక కుటుంబాన్నే కదా! ఇక కథలో ఇమామ్ గారి కుటుంబానికి వచ్చిన బాధ ఎవరు మరుస్తారు. చేతికి ఎదిగొచ్చిన కొడుకు పట్నం పోయి సంపాదిస్తాడనుకుంటే తండ్రిని ఏకాకిని చేసి గబ్బర్ చేతుల్లో ప్రాణాలు కోల్పోతాడు. కుటుంబం ఉనికే భారతదేశ సమాజపు ఉనికి. ఇన్ని కుటుంబాల ఉద్వేగాల అల్లిక కాబట్టే ‘షోలే’ ఆడింది. ఆడుకుంది.‘షోలే’ ప్రివ్యూ కోసం థియేటర్లో కూచున్న రాజ్‌కపూర్ (Raj Kapoor) సినిమా మొదలైన పది నిమిషాల్లోనే మొదలయ్యే ట్రైన్ రాబరీ సీక్వెన్స్ చూసి చకితుడయ్యాడు. ‘ఇదేంటి... క్లయిమాక్స్‌ను ముందే పెట్టేశారు’ అన్నాడట పక్కనున్న వారితో. అవును ‘షోలే’ క్లయిమాక్స్ ముందే వచ్చేస్తుంది... అంత భారీగా. ఆ తర్వాత ‘షోలే’ను కేవలం సన్నివేశాల బలం మీద నడుపుతారుగాని యాక్షన్ మీద కాదు. ‘షోలే’ క్లయిమాక్స్ కేవలం ఠాకూర్, గబ్బర్ సింగ్‌ల మీదే! చేతుల్లేని ఠాకూర్ చేతులు తెగ్గొట్టే గబ్బర్‌తో తలపడతాడు. ఇలా స్క్రీన్‌ప్లే రాసిన ‘షోలే’ ఆడిందంటే ఏమిటి మర్మం! అదేమిటో ఎవరూ చెప్పలేరు. చెప్పినా కొంతే. రొంతే. అంతంతే. షోలేకు వ్యాఖ్యానం లేదు.1973లో మొదలెట్టి రెండేళ్ల పాటు తీశారు ‘షోలే’. కార్పెట్లు అమ్మి, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ చేసి సంపాదించిన డబ్బును కొడుక్కు ఇచ్చి సినిమా చేయమన్నాడు నిర్మాత జి.పి.సిప్పీ. కోటి రూపాయల సినిమా! వస్తే చాలా డబ్బులు రావాలి పోతే కోటి అన్నాడు. అందుకు తగ్గ కథ రమేష్ సిప్పీ రాయించుకున్నాడు సలీమ్ జావేద్‌లతో! అతని వేడి చూసి – వాళ్లు కూడా రంగంలో దిగారు. ‘లోహా గరమ్ హై... మార్ దో హథోడా’ (ఇనుము వేడి మీద ఉన్నప్పుడే సమ్మెట పోటు పడాలి) అనుకున్నారు. ఠాకూర్, గబ్బర్ సింగ్‌ల మధ్య ఇద్దరు దొంగలను ప్రవేశపెట్టి కథ అల్లారు. దీనికి ప్రేరణ అకిరా కురసావా ‘సెవన్ సమురాయ్’, మనం తీసిన ‘మేరా గావ్ మేరా దేశ్’... ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. అన్నీ తీసుకుని మనది ఇవ్వడం కూడా విద్యే. ఆ విద్యతో తయారైన ఈ కథకు ద్వారకా దివేచా కెమెరా, రామ్ యెదేకర్ ఆర్ట్ డైరెక్షన్, ఎం.ఎస్.షిండే ఎడిటింగ్, ఆర్.డి.బర్మన్ సంగీతం... గంధపు చేతులకు మల్లెలు చుట్టాయి. మరి రమేష్ సిప్పీ ఇంత మంచి టేకింగ్‌ను ఎలా సాధించాడో అతనికే తెలియాలి. ధర్మేంద్ర, అమితాబ్, అంజాద్ ఖాన్, సంజీవ్ కుమార్, హేమ మాలిని, జయభాదురి... ఎవరికి ఎవరు తక్కువ. సత్తువ చూపడం వారికి మక్కువ.‘షోలే’లో ప్రతి సన్నివేశానికి, ప్రతి ఫ్రేమ్‌కు అభిమానులున్నారు. అందులోని ప్రతి చిన్న పాత్రకూ అభిమానులున్నారు. జైల్లో గూఢచారిగా పని చేసే బార్బర్ హరిరామ్, పిరిమిగా కట్టెలు అమ్మే సూర్మా భూపాలి, నమక్ తినే కాలియా, గబ్బర్‌కు బదులు పలికే సాంబా, హిట్లర్ జైలర్, ఠాకూర్ నమ్మినబంటు రామ్‌లాల్, పిల్లనిచ్చేందుకు ధర్మేంద్ర గుణగణాలు ఆరాతీసే మౌసీ, ‘మెహబూబా’ పాటలో మెరిసిన జలాల్ ఆగా... ప్రతి ఒక్కరూ... సినిమాను ధన్యం చేశారు... ధన్యులయ్యారు. ప్రేమ నాటకం కోసం వాటర్ ట్యాంకర్ ఎక్కిన ధర్మేంద్ర ‘చక్కీ పీసింగ్’ (తిరగలి తిప్పింగ్) అంటాడు. ప్రేక్షకులు నవ్వుతారు. ‘సూసైడ్’ అంటే ఆత్మహత్య అని ధర్మేంద్ర వల్లే జనానికి ఇంగ్లిష్‌లో తెలిసింది.‘షోలే’ తన శబ్దాలతో కూడా మనకు కనెక్ట్ అవుతుంది. రైలు కూతా, గుర్రపు డెక్కల చప్పుడు, జట్కా మువ్వలు, అజాన్, దూది ఏకే కవాను, కమ్మరి మోత... ఇక ఈ సినిమాకు ముందు రివాల్వరు, రైఫిలు పేలితే అలాంటి సౌండ్ వస్తుందని ప్రేక్షకులకు తెలియదు. బ్రిటిష్ స్టంట్‌మెన్ ఈ సినిమాకు స్టంట్ కొరియోగ్రాఫర్లుగా పని చేశారు. ట్రైన్ రాబరీలో ఒక బుల్లెట్ తగిలి గూడ్సు పెట్టెకు అంటించిన సర్కారు కాగితం చిట్లుతుంది. అలాంటి ఒక్క షాటు తర్వాతి కాలంలో తీయలేకపోయారు.‘షోలే’ గొప్పతనం తెల్లార్లు చెప్పుకోవాలి. గబ్బర్ సింగ్ (Gabbar Singh) పేరు వాడుకుని ఒక హిట్ సినిమా తీసుకున్న మనం ‘షోలే’ యాభై ఏళ్ల సందర్భంగా ఉత్సవం తప్పక చేసుకోవాలి. ఈ సినిమాను తిరగేసి గుహనాథన్ కథ చెప్తే బాగుందని రామానాయుడు గారు ‘కక్ష’ తీశారు. ఇందులోని కొన్ని సీన్లు దర్శకేంద్రుడి ‘అడవి రాముడు’కు పనికి వచ్చాయి. ‘షోలే’ ఎందరినో డైరెక్టర్లు అయ్యేలా చేసింది. రైలుతో మొదలయ్యి రైలుతో ముగిసే ఈ సినిమా భారతీయ ప్రేక్షకులతో యాభై ఏళ్ల ప్రయాణం చేసింది. ఇంకో యాభై ఏళ్లు ఇకపై చేస్తుంది.ఏ దోస్తీ హమ్ నహీ తోడెంగే తోడెంగే దమ్ మగర్ తేరా సాథ్ న ఛోడెంగె...న ఛోడెంగె...పంచ్ డైలాగ్స్ ఫలానా దర్శకుడు వచ్చాక, ఫలానా రచయిత వచ్చాక ట్రెండ్‌లోకి వచ్చాయి అని ఎవరైనా అంటే నోటితోనే నవ్వబుద్ధవుతుంది. సకల పంచ్ డైలాగ్‌లకు బాప్ ‘షోలే’. అందులో ప్రతి మాటా ఒక పంచ్ డైలాగే. పైగా అవి నిత్య జీవితంలోకి వచ్చేసిన డైలాగులు. కొటేషన్లు. సూక్తులు.→ ఇజ్జత్ కీ మౌత్ జిల్లత్ కీ జిందగీ సే కయీ అచ్ఛీ హై (పరాభవాలతో బతికే కన్నా పరువుతో చావడం మేలు)→ ముఝేతో సబ్ పోలీస్ వాలోంకీ సూరతే ఏక్ జైసీ లగ్ తీ హై(నాకు అందరు పోలీసోళ్ల ముఖం ఒకలాగే కనిపిస్తుంది)→ తేరా క్యా హోగా కాలియా (నీ గతేంది కాలియా)→ తుమ్హారా నామ్ క్యా హై బసంతి? (నీ పేరేంటి బసంతి)→ దామ్ జో తుమ్ చాహో... ఔర్ కామ్ జో మై చాహూ (సొమ్ము మీరు కోరినంత... పని నేను చెప్పినంత) – కె. -
యాభై ఏళ్ల షోలే
థియేటర్లోని ప్రేక్షకులు సీటు కిందకు తల ఒంచి అటూ ఇటూ వెతికారు... కాయిన్ ఇక్కడెక్కడైనా పడిందా అని. ‘షోలే’ క్లయిమాక్స్‌లో అమితాబ్ మరణించాక అతని చేతిలోని కాయిన్ చూసి ధర్మేంద్ర షాక్ అవుతాడు. ఆ కాయిన్ కు రెండు వైపులా ‘హెడ్స్’ ఉంటుంది. ఇంతకాలం తన ప్రాణమిత్రుడు దొంగటాస్ వేసి మోసం చేశాడని, ఇవాళ అదే టాస్‌తో తనను కాపాడితాను మరణించాడని గ్రహించి, ఆగ్రహంతో కాయిన్ ని విసిరి కొడతాడు. అది గల్గల్మంటూ థియేటర్లోనే ఎక్కడో పడుతుంది. ఒక క్షణం ప్రేక్షకులు దాని కోసం అటూఇటూ వెతుకుతారు. ఎందుకంటే అందాక వారికలాంటి అనుభూతి తెలియదు. స్టీరియోఫోనిక్ వల్ల వచ్చింది. షోలేను షోలే అభిమానులు స్టీరియోఫోనిక్ థియేటర్ వెతుక్కుంటూ నగరాలకు వెళ్లి చూశారు. 70 ఎం.ఎంలో చూశారు. స్కోప్‌లో చూశారు. 35 ఎం.ఎం.లో చూశారు. చిన్న ఊళ్లలో నిడివి కుదించి జయభాదురి ఫ్లాష్‌బ్యాక్ లేని వెర్షన్ రిలీజ్ చేస్తే అదీ చూశారు. దూరదర్శన్ లో చూశారు. కేబుల్ టీవీలో చూశారు. యూ ట్యూబ్‌లో చూశారు. ఓటిటిలో చూశారు. యాభై ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. షోలే అభిమానులది వేరే లెవల్.ఆడే సినిమాలు ఆడదగ్గ రీతిలో తీస్తే ఆడతాయి. సెట్స్ వల్ల, విఎఫ్ఎక్స్ వల్ల, భారీ బడ్జట్ వల్ల, ముహూర్తబలం వల్ల ఆడవు. ఆడదగ్గ రీతిలో కథ అనుకుని ఇవన్నీ కలిపితే ఆడొచ్చు. షోలే సినిమా తొలిషాట్ తీయడం కుదరలేదు. వాన. ముహూర్తం అప్సెట్ అయ్యింది. రెండోరోజు తెల్లచీర కట్టుకుని వితంతువు పాత్రలో ఉన్న జయభాదురి అమితాబ్‌కు ఇనప్పెట్టె తాళాలు ఇవ్వడం ఫస్ట్‌షాట్‌గా తీశారు. దక్షిణాది సినీచరిత్రలో నేటి వరకు వితంతువు పాత్రపై ముహూర్తం షాటు తీసిన దాఖలా లేదు. అలా తీస్తే ఫ్లాప్ అవుతుందా? అలా తీయకపోతే హిట్ ఏమైనా అయ్యిందా? తాము చేసే దుర్మార్గాలకు, దోపిడీలకు దైవబలాన్ని తోడు అడగడం కూడా షోలే తీసేసింది. గబ్బర్ సింగ్ ఒక్కనాడు కూడా కాళీమాత విగ్రహం ఎదుట ప్రమాణం చేసి దోపిడీకి బయలుదేరడు. అప్పటి వరకూ హిందీ సినిమాలలోని బందిపోట్లు అందరూ కాళీమాత బలాన్ని తోడు అడిగేవారే.సమాజం చెడ్డను భరించగలదుగానీ మరీ దారుణమైన చెడ్డను సహించలేదు. ఆ చెడ్డను పరిహరించడానికి మెరుగైన చెడ్డనైనా శరణుజొచ్చడానికి వెనుకాడదు. గబ్బర్ సింగ్ అఘాయిత్యాలు పట్టనలవి కానప్పుడు అంత చెడ్డవాణ్ణి నిర్మూలించడానికి కొంచెం చెడ్డవాళ్లను నియమిస్తారు. వీరు, జయ్ చిల్లర దొంగలే గాని వారిలో బహాదూరి ఉంది. మానవత్వం కూడా ఉంది. ఊరు వారిని ఆదరిస్తుంది. వర్తమానంలో కరడుగట్టిన నేరస్తుల శిక్షకు పోలీసులు ఎన్ కౌంటర్ అనే చెడ్డమార్గం ఎంచుకుంటే ప్రజలు ఆదరించడం ఇలాంటిదే కావచ్చు. వ్యక్తిగత ఆగ్రహాన్ని సామాజికస్థాయికి తీసుకెళ్లమని షోలే చెబుతుంది. గబ్బర్ సింగ్ వల్ల ఠాకూర్ తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయాడు. గబ్బర్‌ని శిక్షించడం వ్యక్తిగతమైన కక్షే... కాని అందులో సామాజిక న్యాయం ఉంది. ఇవాళ సగటు మనిషి తన నెత్తిన పన్నులు పడుతున్నా, తన ప్రమేయం లేకుండా కుల, మత, పార్టీల జంజాటంలో పడుతున్నా, తన సంపాదనను స్కూళ్లు, హాస్పిటళ్లు బట్టలిప్పించి దోచుకుంటున్నా, చిల్లర జీతాలతో సంస్థలు గాడిద చాకిరీ చేయిస్తున్నా, న్యాయం కోసం ఏళ్లకేళ్లు అంగలార్చాల్సి వస్తున్నా కిమ్మనడం లేదు... శాపనార్థాలు పెట్టుకోవడం తప్ప. ఎలుక శాపం పిల్లికి తగలదు. ఠాకూర్‌లా కార్యాచరణకు దిగితే, ఒకరొకరుగా కదిలి ఊరు మొత్తం గబ్బర్ అంతు చూసినట్టు సమస్య అంతు చూడొచ్చు. దురదష్టవశాత్తు జనంలో అది పూర్తిగా పోయింది.షోలేలోని మహిళలు ధీర వనితలు. గబ్బర్ను ధిక్కరించే బసంతి గాని, పరిస్థితులకు చలించక స్థైర్యం చూపే ఠాకూర్ కోడలుగాని ‘ఊ అంటావా మావా... ఉఊ అంటావా’ తరహా కాదు. షోలే కథ ‘రేప్’ సీన్ కు చోటివ్వలేదు. నేడులా బడ్జెట్లో సగాన్ని బకెట్ల బకెట్ల బ్లడ్‌కు కేటాయించే పని లేకుండా రక్తమే చూపలేదు. కొండలు, గుట్టలు, పచ్చదనం ఉన్న బెంగళూరు సమీపంలోని రామ్‌నగర్ అనే చోట షూటింగ్ చేయడం తప్ప షోలే చేసిన సర్కస్ ఏదీ లేదు. షోలే మానవ ఉద్వేగాల మేజిక్. కెమెరా, సంగీతం, మాట, పాత్ర, దర్శకత్వం... వీటిని ఎంత మేలిమి నైపుణ్యంతో వాడి ఈ మేజిక్ చేయవచ్చో చరిత్ర చెప్పుకునేలా చూపింది. 1975 ఆగస్టు 15న షోలే విడుదలైంది. ఈ ఆగస్టు 15కు యాభై ఏళ్లు. ఇప్పటికే దేశంలో చర్చలు, కార్యక్రమాలు, జ్ఞాపకాల రీవిజిట్లు సాగుతున్నాయి. తెలుగు అభిమానులు ఎలాగూ ఉత్సవాలు జరుపుతారు. మన పరిశ్రమ... ముఖ్యంగా సినీ రచయితలు, దర్శకులు షోలేకు ఎటువంటి స్మరణ, సత్కారం చేస్తారో చూడాలి. -
నటుడు ధర్మేంద్ర వాటర్ వర్కౌట్లు చూస్తే మతిపోవాల్సిందే..! ఎలా చేస్తారంటే..
బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర(Dharmendra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీలతో వేలాది అభిమానులను సంపాదించుకున్న నటుడు. ఎనిమిది పదుల వయసులో కూడా అంతే అందంగా మంచి ఫిట్నెస్తో ఉంటారు. అంతేగాదు తరుచుగా తన వర్కౌట్ వీడియోలతో ఆరోగ్య స్పృహను కలుగుజేస్తుంటారు. తాజాగా తన గేమ్-ఛేంజర్ వాటర్ వ్యాయామాలతో వీడియోని షేర్ చేసి..అందర్నీ ఆశ్చర్యపరిచారు. కండరాల కదలికలు కోసం, ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే శారరీక కదలికలకు ఈవ్యాయామాలు మంచి గేమ్ ఛేంజర్ అనిపోస్ట్లో పేర్కొన్నారు 89 ఏళ్ల ధర్మేంద్ర. ఈ నేపథ్యంలో ఆ వ్యాయమాలు ఎలా చేస్తారు..? కలిగే ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.నీటిలో చేసే ఈ సున్నితమైన వాటర్ వ్యాయామాలు శరీరానికి మంచి కదలికలని చెబుతున్నారు నిపుణులు. కాళ్లకు, మొత్తం శరీరానికి మంచిదని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి వ్యాయామాలు తప్పనిసరి అని అన్నారు. ఇలా చల్లటి నీటిలో తేలియాడుతూ చేసే రిలాక్స్డ్ వ్యాయామాలు ఏంటో చూద్దామా..!.వాటర్ వాకింగ్: ఇక్కడ నీటిలో నడవడం బయట భూమిపై నడిచినంత ఈజీగా చేయలేం. కొద్దిమొత్తంలో బలాన్ని ఉపయోగించి నడవాల్సి ఉంటుంది. మన అడుగుపడకుండా చేసే నీటి నిరోధకతతో ఫోర్స్‌గా నడవడం వల్ల మోకాళ్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేగాదు నీటిలోకి దిగి తేలియాడుతూ..స్మిమ్మింగ్‌పూల్ చుట్టూ నడవాలి. దీనివల్ల ఎలాంటి కండర సమస్యలు ఉండవని చెబుతున్నారు నిపుణులు.వాటర్ జాగింగ్: ఇక్కడేంటంటే ఇంకాస్త ముందడుగు వేసి భూమ్మీద చేసినట్లుగా పూల్ చుట్టు జాగింగ్ చేయాలి. దీనివల్ల త్వరితగతిన చెమటలు పట్టేస్తాయి. స్పీడ్‌గా కేలరీలు బర్న్ అవ్వడమే గాక శరీరానికి చక్కని వ్యాయామంలా కూడా ఉంటుంది.ఫ్లట్టర్ కిక్స్: పూల్ సైడ్‌ను పట్టుకుని శరీరాన్ని నిటారుగా ఉంచి.. ఫ్లట్టర్ కిక్ చేయాలి. చల్లటి నీటిలో ఉంటూ కాళ్ళకు తగిన వ్యాయామం అందించే మార్గం. ఇది ఒకరకంగా ఈత కొడుతున్న అనుభూతి కలిగిస్తుంది. .లెగ్ రైజెస్: పూల్ చివరలో నిలబడి కాళ్ళను పక్కకు ఎత్తండి. ఇది హిప్ ఫ్లెక్సర్‌లను బలంగా ఉంచుతుంది. ఇది బాడీకి సూపర్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది.వాటర్ పుష్-అప్లు: పూల్ అంచుపై చేతులను ఉంచి, మోచేతులు వంచి నిలబడండి. ఆ తర్వాత అంచు నుంచి మిమ్మల్ని దూరంగా నెట్టండి, ఆపై నెమ్మదిగా వెనుకకు తగ్గించండి. ఇది అచ్చం పుష్-అప్ చేయడం లాంటిది. అయితే నీటి నిరోధకత పైకి లేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ శరీరాని మంచి కదలికలను అందించడమే గాక కండరాలు స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఉపకరిస్తాయి.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగ నిపుణులు లేదా వైద్యులను సంప్రదించండి. View this post on Instagram A post shared by Dharmendra Deol (@aapkadharam) (చదవండి: ఎంత పనిచేశావ్ నాన్న..! హార్ట్ టచింగ్ వీడియో..) -
హెచ్‌సీయూ భూముల అంశంలో జోక్యం చేసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్‌సీయూ) చెందిన 400 ఎకరాల భూమి విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభు త్వానికి బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీలు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిలో 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులు ఉన్నా యని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఈ మేరకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గొడెం నగేశ్‌ల బృందం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి వినతి పత్రం అందజేసింది. ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన అనంతరం బీజేపీ ఎంపీలు తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు.కాంగ్రెస్ అధిష్టానానికి కప్పం కట్టేందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూములను అమ్ముతోందని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. హెచ్‌సీయూ భూముల విషయంలో ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. భూముల అమ్మకం విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుగానే కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. ట్రిపుల్ఆర్ రాజ్యాంగం అమలవుతోంది: లక్ష్మణ్తెలంగాణలో రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి రాజ్యాంగమే అమలవుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దుయ్యబట్టారు. మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్ లేవనెత్తారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు తీర్చలేకే ప్రభుత్వం భూములను అమ్ముతోందన్నారు. లోక్‌సభలో ధర్మపురి అర్వింద్ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. భూమి వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేసేందుకు చొరవ చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుకుంటాం: భూపేంద్ర యాదవ్ హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి భూములపై నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలకు హామీ ఇచ్చారు. మంగళవారం తెలంగాణ బీజేపీ ఎంపీలు భూపేంద్ర యాదవ్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని ఆ భూములను పరిరక్షించాలని కోరారు. -
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్రకు కోర్టు సమన్లు
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర వల్ల మోసపోయానంటూ ఒక వ్యాపారి చేసిన ఫిర్యాదుతో ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. గరం ధరమ్ ధాబా ఫ్రాంచైజీ కేసుకు సంబంధించి ధర్మేంద్రతో పాటు మరో ఇద్దరికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సమన్లు జారీ చేసింది. ‘గరం ధరమ్ ధాబా’ ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెట్టించి తనను తప్పుదోవ పట్టించారని ఢిల్లీ వ్యాపారవేత్త సుశీల్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) యశ్దీప్ చాహల్ సమన్లు జారీ చేశారు.2018 ఏప్రిల్ నెలలో, ఉత్తరప్రదేశ్‌లోని NH-24/NH-9లో గరం ధరమ్ ధాబా ఫ్రాంచైజీ ఇస్తామని ధర్మేంద్ర తనను సంప్రదించినట్లు సుశీల్ కుమార్ తెలిపారు. ఆయన మాటలు నమ్మి తాను రూ.63లక్షల వరకు పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. ఢిల్లీ, హర్యానా వటి నగరాల్లో ఈ రెస్టారెంట్ బ్రాంచ్‌లు సుమారుగా రూ. 70 నుంచి 80 లక్షల వరకు నెలవారీ టర్నోవర్‌ను ఆర్జిస్తున్నాయని ఆశ చూపించడంతో తాను కూడా ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టడానికి ఆకర్షితుడయ్యానని తెలిపారు. ఆ సమయంలో ఒప్పంద పత్రంపై సంతకాలు కూడా చేశారన్నారు. ఈ ప్రక్రియ ముగుసిన తర్వాత ధర్మేంద్ర నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం తాను మోసపోయానని గ్రహించి కోర్టును ఆశ్రయించినట్లు సుశీల్ పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని ఆయన వాపోయారు.‘గరం ధరమ్ ధాబా’ ఫ్రాంచైజీ కేసులో భాగంగా ధర్మేంద్రతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీ అయ్యాయి. 420, 120B సెక్షన్ల కింద వారికి సమన్లు పంపినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసు 2025 ఫిబ్రవరి 20 విచారణ జరగనుందని కోర్టు వాయిదా వేసింది. -
థియేటర్లలో ఫ్లాప్.. కానీ 25 కోట్ల టికెట్స్ సేల్.. ఆ సినిమా ఏదంటే? (ఫొటోలు)
-
విజయానందంలో సీనియర్ హీరోయిన్.. కాలికి కట్టుతో భర్త!
సీనియర్ నటుడు ధర్మేంద్ర డియోల్ 88 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా కనిపిస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు కబుర్లు చెప్తూ ఉంటాడు. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ సీనియర్ హీరో ఓ వీడియో షేర్ చేశాడు. గాయపడ్డ సింహం.. మళ్లీ బిజీ అయిపోయానంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోలో ఆయన తన ఫామ్ హౌస్‌లో ప్రకృతి నడుమ సేద తీరుతున్నాడు. చెట్టు కింద కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. అందులో అతడి కుడి కాలికి పట్టీ వేసి ఉంది. ఇది చూసిన అభిమానులు ఆయనకు ఏమైందని కంగారుపడుతున్నారు. ఆ గాయం త్వరగా మానుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా ఈయన చివరగా రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని, తేరి బాటీ ఐసా ఉల్జా జియా అనే సినిమాల్లో కనిపించాడు. ఇకపోతే ధర్మేంద్ర రెండో భార్య హేమమాలిని సంతోషంలో మునిగి తేలుతోంది. మధుర నియోజకవర్గం నుంచి ఆమె మూడోసారి ఎంపీగా గెలుపొందింది. దీంతో ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Dharmendra Deol (@aapkadharam) చదవండి: నేను వాడిపడేసిన టిష్యూ ఏరుకుంది: నటి -
రెండో పెళ్లి.. ఇప్పటికీ విడిగానే.. యానివర్సరీ మాత్రం గొప్పగా
ప్రేమ ఎప్పుడు, ఎలా చిగురిస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్కసారి మనసులు కలిశాయంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని దాటి మరీ ఒక్కటయ్యేందుకు రెడీ అయిపోతారు. బాలీవుడ్ సీనియర్ జంట ధర్మేంద్ర- హేమమాలిని విషయంలో ఇదే జరిగింది. ధర్మేంద్రతో ప్రేమలో పడేనాటికే అతడికి ప్రకాశ్ కౌర్ అనే భార్య ఉంది. ఈ జంటకు నలుగురు పిల్లలు సంతానం. రెండో పెళ్లిఈ బంధాన్ని కాపాడుకుంటూనే మోవైపు హేమమాలినిని రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా వీరు 44వ పెళ్లి రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హేమమాలిని భర్తతో కలిసున్న ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ధర్మేంద్ర, హేమమాలిని దండలు మార్చుకున్నారు. భర్త ప్రేమగా ముద్దుపెడుతుంటే సిగ్గుపడిపోయింది హేమ. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.అప్పుడే చిగురించిన ప్రేమహేమమాలిని, ధర్మేంద్ర 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలో తొలిసారి నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లికి రెడీ అయ్యారు. అయితే హేమ తల్లిదండ్రులు ధర్మేంద్రను వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. అయినా వినకుండా 1980లో ఈ జంట పెళ్లి పీటలెక్కింది. వీరికి ఈషా, అహనా అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ధర్మేంద్ర తన మొదటి భార్యతో కలిసి ఒకే ఇంట్లో ఉండగా హేమమాలిని తన పిల్లలతో వేరుగా ఉంటోంది. Photos from today at home pic.twitter.com/JWev1pemnV— Hema Malini (@dreamgirlhema) May 2, 2024More photos for you pic.twitter.com/20naRKL8gA— Hema Malini (@dreamgirlhema) May 2, 2024చదవండి: ప్రియుడితో పెళ్లికి రెడీ.. ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన బ్యూటీ -
ధర్మేంద్ర వద్దన్నా హేమమాలిని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?
బాలీవుడ్ నటి హేమ మాలిని అద్భుతమైన నటిగా రాణించడమే కాదు..రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. ఇప్పుడు ఆమె భారతీయ జనతా పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హేమ మాలిని మూడోసారి యూపీలోని మధుర నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హేమ మాలిని 2014 నుంచి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె.. తన భర్తకు తాను రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదనే విషయాన్ని వెల్లడించారు. హేమ మాలిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడం తన భర్త, నాటి హీరో ధర్మేంద్రకు ఇష్టంలేదంటూనే, మరో హీరో వినోద్ ఖన్నా సూచనలతో రాజకీయాల్లో కాలుమోపానని తెలిపారు. రాజకీయాల్లో నెగ్గుకురావడం చాలా కష్టమని, అందుకే ధర్మేంద్ర తనను రాజకీయాల్లోకి వెళ్లవద్దని సూచించారన్నారు. ధర్మేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారని, అందుకే తనకు అలాంటి సలహా ఇచ్చిరని హేమ మాలిని తెలిపారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ధర్మేంద్ర ఇబ్బంది పడ్డారని తెలిపారు. అయితే తాను తన భర్త ఎదుర్కొన్న పరిస్థితులను సవాల్‌గా స్వీకరించి, రాజకీయాల్లోకి అడుగుపెట్టానని అన్నారు. ధర్మేంద్ర 2004 నుండి 2009 వరకు బికనీర్ నుండి ఎంపీగా ఉన్నారని తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో నాడు నటుడు వినోద్ ఖన్నా తనకు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎన్నికల్లో ఎలా ప్రసంగించాలో వినోద్‌ను చూసి నేర్చుకున్నానని, పబ్లిక్ని ఎలా ఫేస్ చేయాలో కూడా ఆయనే నేర్పించారన్నారు. బీజేపీ నేత వినోద్ ఖన్నా గురుదాస్‌పూర్ నుండి రెండుసార్లు ఎంపీగా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా కూడా వ్యవహరించారు. -
స్వచ్ఛ ఓటర్ల జాబితా ముఖ్యం
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు అనేది అత్యంత కీలకమని, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులు ఆదేశించారు. ఓటర్ల జాబితా తయారీలో 100శాతం స్వచ్చత ఎంత ముఖ్యమో... ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈసీఐ ప్రతినిధుల బృందం సారథి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్)–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై శుక్రవారం విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, అండర్ సెక్రటరీ సంజయ్‌కుమార్‌తోపాటు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్‌కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, స్టేట్ పోలీస్ నోడల్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ తదితరులు హాజరయ్యారు. ధర్మేంద్ర శర్మ మాట్లాడుతూ అర్హత ఉన్నవారందరూ ఓటు నమోదు చేసుకునేలా, ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం ప్రధానమని చెప్పారు. బూత్, నియోజకవర్గ స్థాయిలో గతంలో నమోదైన పోలింగ్ శాతాలను పరిశీలించి... తక్కువగా ఉన్నచోట అందుకు కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పారి్టసిపేషన్ (స్వీప్) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవరోధాలు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందుకు సమగ్ర, పటిష్ట ఎన్నికల నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) అవసరమని, స్వచ్చమైన ఓటర్ల జాబితాతోపాటు సుశిక్షితులైన మానవవనరులు, మెటీరియల్ తదితరాలపై దృష్టిసారించాలన్నారు. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలు ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని, ఈఎస్ఎంఎస్, సువిధ, ఈఎన్‌కోర్, సీ విజిల్, ఈటీపీబీఎంఎస్, ఓటర్ టర్నవుట్, కౌంటింగ్ ఓట్స్ యాప్‌లపై అధికారులు, సిబ్బందికి తప్పనిసరిగా అవగాహన ఉండాలన్నారు. జిల్లాస్థాయిలోనూ సమర్థ మానవ వనరులతో ఐటీ టీమ్స్ ఏర్పాటుచేయాలని సూచించారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాగా, ఓటు హక్కుపై స్ఫూర్తిదాయకమైన ప్రముఖులతో అవగాహన కార్యక్రమాలు, విశ్వసనీయత పెంపొందిస్తూ క్షేత్రస్థాయి తనిఖీల ఆధారంగా ఓటుకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం, మద్యం, డబ్బు తదితరాల అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, ఎన్నికల సమయంలో నమోదైన కేసుల విచారణ, రాజకీయ తటస్థత కలిగిన ఎన్జీవోలు, పౌర సంస్థల భాగస్వామ్యం, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ తదితర శాఖల మధ్య సమన్వయం, ఓటింగ్ శాతం పెంపు కోసం వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు తదితరాలపై ఈసీఐ అధికారులు పలు సూచనలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు ఎస్ఎస్ఆర్–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎస్పీలు శాంతిభద్రతల పరిరక్షణ, గత ఎన్నికల నిర్వహణ సమయంలో ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన కేసుల విచారణ, అక్రమ మద్యం, డబ్బు తరలింపులను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు, చెక్‌పోస్టుల మ్యాపింగ్, సమస్యాత్మక, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్లు తదితరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పారదర్శకంగా ఎస్ఎస్ఆర్–2024: సీఈవో రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్–2023 కింద ఈ ఏడాది జనవరి 5న తుది జాబితా ప్రచురించిన తర్వాత నుంచి దాదాపు 90 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. వీటిలో 89 లక్షల దరఖాస్తుల పరిష్కారం పూర్తయిందన్నారు. మిగిలినవి ఈ నెల 26లోపు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. జిల్లా అధికార యంత్రాంగం ఎస్ఎస్ఆర్–2024, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ప్రతి దశలోనూ సమస్యను గుర్తించడంతోపాటు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జెయింట్ 7-టైర్ కేక్‌తో ధర్మేంద్ర 88వ పుట్టినరోజు వేడుకలు (ఫోటోలు)
-
కేంద్ర గిరిజన వర్సిటీకి నేడు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. విభజన హామీల్లో ఒకటైన ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటును గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతంలోనే యూనివర్సిటీ గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేటు భూమి సేకరించారు. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులకు రూ.29.97 కోట్ల పరిహారం చెల్లించారు. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు ఖర్చు చేశారు. అందించే కోర్సులు ఈ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, బి.కామ్‌లో ఒకేషనల్ తదితర 14 కోర్సులను అందిస్తారు. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఒకేషనల్, జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులను కూడా అందిస్తారు. గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సహిస్తారు. ఇప్పటికే విజయనగరం జిల్లా కొండకరకంలోని ఆంధ్రా యూనివర్సిటీ పాత పీజీ క్యాంపస్ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీ తరగతుల్లో 385 మంది విద్యార్థులున్నారు. -
నిరాశ్రయులకు ఓటు హక్కు కల్పించేలాచర్యలు చేపట్టండి
సాక్షి, విశాఖపట్నం: అర్హత కలిగి ఉండి.. నిరాశ్రయులుగా ఉన్నవారికీ ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్ ఆదేశించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ–2024పై రెండు రోజుల సమీక్ష విశాఖలో గురువారం ముగిసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా అధ్యక్షతన సదస్సు జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ తరఫున డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హృదేశ్కుమార్, సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరేంద్ర ఎన్ బుటాలియా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్‌కుమార్ హాజరయ్యారు. ప్రత్యేక సంక్షిప్త సవరణపై అవగాహన కలెక్టర్లకు ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్)–2024పై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. మానవ వనరుల లభ్యత, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, ఎన్నికల సిబ్బందికి, పోలింగ్ స్టేషన్లకు కనీస సౌకర్యాలు, ఫిర్యాదు నిర్వహణ తదితర అంశాలపై కూడా చర్చించారు. ముగింపు సందర్భంగా సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్ మాట్లాడుతూ అర్హులైన వారందర్నీ ఓటరు జాబితాలో 100 శాతం చేర్పించేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా నిరాశ్రయులపై శ్రద్ధ వహించాలనీ, అట్టడుగు సమాజంలో ఉన్న వారిని, మురికివాడలు, సంచార జాతులు, ఎస్సీ, ఎస్టీ ప్రజలు, గిరిజన తండాల్లో నివాసితులు, పీవీజీటీ పరిధిలో (బలహీన గిరిజన సమూహాలు) ఉన్నవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ విలువైన ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనంతరం ఓటర్ల నమోదుపై వచ్చే ప్రతి ఫిర్యాదుపై శ్రద్ధ వహించాలని సూచించారు. రాజకీయ పార్టీలకు ఓటింగ్, ఎన్నికల గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తూ.. ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా వివరించాలన్నారు. ఈవీఎంలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని స్పష్టం చేశారు. యువ ఓటర్లు, వలస ఓటర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఎస్ఎస్ఆర్–2024 ప్రక్రియ పూర్తయ్యే సమయానికి అర్హులైన ఓటర్లతో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తిస్థాయి పారదర్శకంగా ఉన్న ఓటర్ల జాబితా తయారు చేసేందుకు 26 జిల్లాల కలెక్టర్లు నిరంతరం కృషి చేయాలని ధర్మేంద్రశర్మ, నితీష్ ఆదేశించారు. -
87 ఏళ్ల వయసులో లిప్‌లాక్ సీన్.. అవసరమే అంటున్న నటుడు
నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు.. ఏమని చెప్పగలం? అన్నింటిలోనూ ఒక అడుగు ముందే ఉంటాడు ధర్మేంద్ర. ఆరు దశాబ్ధాలుగా బాలీవుడ్లో తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతున్న ఈయన ఇప్పటివరకు 300కు పైగా చిత్రాలు చేశాడు. ఇప్పటికీ వెండితెరపై తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న ఈయన తాజాగా రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని సినిమాలో నటించాడు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 28న విడుదలైంది. ఈ మూవీలో ధర్మేంద్ర, అలనాటి నటి షబానా అజ్మీ.. లిప్‌లాక్ సీన్లో నటించారు. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు. 87 ఏళ్ల వయసులో ముద్దు సన్నివేశంలో నటించడమేంట్రా బాబూ అని ఆశ్చర్యపోయారు. కొందరైతే ముసలాడికి దసరా పండగలా ఉంది.. అస్సలు బాగోలేదు అని విమర్శించారు. తాజాగా ఈ సన్నివేశంపై ధర్మేంద్ర స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'నేను, షబానా కిస్ సీన్‌తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసినట్లున్నాం. చాలామంది ఈ సీన్ చూసి చప్పట్లు కూడా కొట్టినట్లున్నారు. మా నుంచి జనాలిది అస్సలు ఊహించి ఉండరు కదా! అందుకే దీనికింతలా రెస్పాన్స్ వస్తోంది. నేను ఇంతకుముందు చివరిసారిగా లైఫ్ ఇన్ ఎ మెట్రో అనే సినిమాలో నఫీసా అలీతో ముద్దు సన్నివేశంలో నటించాను. అప్పుడు కూడా జనాలు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో మా ముద్దు సన్నివేశం గురించి డైరెక్టర్ కరణ్ జోహార్ మాకు ముందే చెప్పాడు. అప్పుడు నేనేమీ అంత సర్ప్రైజ్ అవలేదు. ఈ సినిమాకు అది అవసరం అనిపించింది. అందుకే నేను చేస్తానని చెప్పాను. అయినా రొమాన్స్‌కు వయసుతో పనేంటి? వయసు అనేది కేవలం నెంబర్స్ మాత్రమే సూచిస్తాయి. ఏ వయసు వాళ్లైనా ఇద్దరి మధ్య ప్రేమను ముద్దు ద్వారానే బయటపెడతారు. ఈ సీన్లో నటించేటప్పుడు నేను, షబానా ఏమాత్రం ఇబ్బందిగా ఫీలవలేదు' అని చెప్పుకొచ్చాడు ధర్మేంద్ర. చదవండి: ప్రేమకో దండం.. బ్రేకప్ చెప్పిన రీతూ వర్మ ఆ సినిమాకు రూ.250 కోట్లా? దాన్నెవరు చూస్తారు?: కంగనా -
ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమా ఇదే! బాహుబలి, దంగల్ కాదు!
సినిమా అంటే వినోదం. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి కలర్‌ఫుల్ స్క్రీన్స్ వరకు, మూకీ సినిమాల నుంచి టాకీ చిత్రాల దాకా ఎక్కడా ఎంటర్టైన్మెంట్కు ఇసుమంత లోటు కూడా కనిపించదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉంటుంది చిత్రపరిశ్రమ. అటు ప్రేక్షకులు కూడా సినిమాలను ఆస్వాదిస్తారు, అందులో నటించే హీరోహీరోయిన్లను ఆరాధిస్తారు. ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో పాతిక, యాభై, వంద, రెండు వందల రోజులు కూడా ఆడేవి. కానీ ఇప్పుడు.. ఎంత పెద్ద సినిమా అయినా మూడు వారాలకు తట్టాబుట్టా సర్దాల్సిందే! ఇప్పటివరకు తీసిన సినిమాల్లో ఏ చిత్రాన్ని ఎక్కువమంది చూశారో తెలుసా? బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, దంగల్ సినిమాలనుకుంటే పొరపాటే! అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన షోలే. అంజాద్ ఖాన్‌కు ఇది తొలి చిత్రం. ఇందులో ధర్మేంద్ర, హేమమాలిని, జయా బచ్చన్.. ఇలా అగ్రతారలు నటించారు. అప్పట్లో ఈ సినిమాకు టికెట్ల ఊచకోత జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. దర్శకుడు రమేశ్ సిప్పీ తెరకెక్కించిన ఈ ఐకానిక్ చిత్రం 1975లో రిలీజైంది. తొలి షోకే హిట్ టాక్.. ఫలితంగా ఆల్‌టైం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు, అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రికార్డును దశాబ్ద కాలంపాటు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయారు. షోలే తొలిసారి రిలీజైనప్పుడు, అలాగే రీరిలీజ్ అయినప్పుడు మొత్తంగా భారత్‌లో 15-18 కోట్ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇతర దేశాల్లో కూడా షోలేకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇది ఏ రేంజ్లో ఉందంటే ఒక్క రష్యాలోనే 6 కోట్ల టికెట్లు కొనేశారు అక్కడి జనాలు. ఇతర దేశాల్లో తక్కువలో తక్కువ 2 కోట్ల దాకా టికెట్లు అమ్ముడుపోయాయట! అంటే ప్రపంచవ్యాప్తంగా 22 -26 కోట్ల దాకా టికెట్లు అమ్ముడుపోవడంతో భారతీయ సినీచరిత్రలో షోలే రికార్డు సృష్టించింది. అప్పుడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్ల దాకా రాబట్టింది. ఇప్పటి ద్రవ్యోల్బణంతో పోలిస్తే దాని విలువ సుమారు రూ.2800 కోట్ల దాకా ఉంటుంది. టాప్ 10 చిత్రాలు కేవలం భారత్‌లో అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాల జాబితా విషయానికి వస్తే.. షోలే 15 కోట్లతో తొలి స్థానంలో ఉంది. బాహుబలి 2: ది కన్‌క్లూజన్ 12 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొఘల్ ఇ ఆజమ్, మదర్ ఇండియా.. చెరో 10 కోట్లు, హమ్ ఆప్కే హై కోన్..7.4 కోట్లు, ముఖద్దార్ కా సికిందర్.. 6.7 కోట్లు, అమర్ అక్బర్ ఆంటోని.. 6.2 కోట్లు, క్రాంతి.. 6 కోట్లు, బాబీ.. 5.3 కోట్లు, గంగా జమున.. 5.2 కోట్లు, గదర్, కేజీఎఫ్ చాప్టర్ 2, సంఘం.. చెరో 5 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రష్మిక? -
భర్తకు దూరంగా ఉండటంపై మొదటిసారి స్పందించిన హేమమాలిని
బీటౌన్ సీనియర్ నటుడు ధర్మేంద్ర హేమమాలినిని వివాహం చేసుకున్నప్పటికీ, తన మొదటి భార్య నుంచి ధర్మేంద్ర విడాకులు తీసుకోలేదు. దీంతో తన కుమార్తెలు ఈషా, అహ్నాలతో కలిసి ప్రస్తుతం హేమ ఉంటున్నారు. వీరిద్దరి వివాహం 1980లోనే అయింది. కానీ వేర్వేరు ఇళ్లలో ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన భర్త నుంచి వేరుగా ఉండటంపై హేమమాలిని స్పందించారు. (ఇదీ చదవండి: పవన్ 'బ్రో' విషయంలో సీరియస్ అయిన థమన్..!) మొదటి భార్య ప్రకాశ్ కౌర్‌తో ధర్మేంద్ర ఇంటర్వ్యూయర్ ఆమెను ఫెమినిస్ట్ ఐకాన్‌గా పరిగణిస్తూ.. మీరు ఒంటరిగా ఉండేందుకు ఇది కూడా ఒక కారణమనే చెప్పవచ్చా అనే ప్రశ్నకు హేమా ఇలా చెప్పుకొచ్చారు. 'నేను స్త్రీవాదానికి చిహ్నమా..? (నవ్వుతూ). ఎవరూ భర్తకు దూరంగా ఉండాలని కోరుకోరు. జీవితం ఏదిస్తుందో అది జరుగుతుంది. దానిని మనం స్వీకరించాల్సిందే. ప్రతి స్త్రీకి భర్త, పిల్లలు కావాలని కోరుకుంటుంది. కానీ ఎక్కడో ఆ లెక్కలు తప్పుతాయి. లేకపోతే, ఎవరికీ తమ జీవితాన్ని ఇలా గడపాలని అనిపించదు. అని హెమ తెలిపారు. 'బాధపడటం లేదు' 'భర్తకు దూరంగా ఉండటంలో నేను బాధపడటం లేదు. నాతో నేను సంతోషంగా ఉన్నాను. నాకు నా ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను వారిని చాలా బాగా పెంచాను. అయితే, అతను (ధర్మేంద్ర) ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. ప్రతిచోటా. పిల్లలకు తొందరగా పెళ్లి చేయాలి అని భయపడేవాడు. నేను ఇది జరుగుతుంది అనే చెప్పేదానిని. సరైన సమయం వచ్చినప్పుడు, సరైన వ్యక్తి వస్తాడు అని ఆయనకు ధైర్యం చెప్పేదాన్ని. భగవంతుడు, గురువుల ఆశీర్వాదంతో నా పిల్లల ఇద్దరి పెళ్లిల్లు అయిపోయాయి. మేమిద్దరం అనుకున్నది ప్రతిదీ జరిగింది.' అని హేమ అన్నారు. రెండో భార్య హేమమాలిని, పిల్లలతో ధర్మేంద్ర హేమమాలినిని ధర్మేంద్ర మొదటిసారి కలిసినప్పుడు ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. ధర్మేంద్ర, ప్రకాష్ కౌర్‌లకు ఇద్దరు కుమారులు - సన్నీ డియోల్,బాబీ డియోల్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు అజీత, విజేత ఉన్నారు. ఇటీవల, ధరమేంద్ర మనవడు కరణ్ డియోల్ వివాహం జరిగింది. హేమమాలిని కుటుంబం నుంచి ఎవరూ ఆ పెళ్లికి హాజరు కాలేదు. దీంతో భార్య, కుమార్తెల కోసం ఒక భావోద్వేగ పోస్ట్ కూడా ధర్మేంద్ర రాశారు. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: సింగర్) -
భార్య కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్ చేసిన స్టార్ హీరో!
బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని 1970ల్లో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత హేమ ధర్మేంద్రతో కలిసి 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలోమొదటిసారి నటించారు. ఈ సినిమాతోనే హేమమాలిని, ధర్మేంద్ర మధ్య ప్రేమ చిగురించింది. కానీ అప్పటికే ధర్మేంద్రకు పెళ్లై.. పిల్లలు కూడా ఉన్నారు. కానీ ధర్మేంద్ర, హేమ మాలిని 1980లో వివాహం చేసుకున్నారు. (ఇది చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో ముద్దులాట.. తప్పు మీది.. నన్నెందుకు పంపించేశారు?) అయితే ఈ జంటకు మొదట ఈషా డియోల్ జన్మించింది. అయితే పాప పుట్టినప్పుడు జరిగిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. హేమమాలిని డెలివరీ కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్ చేసుకున్నారట. దీనికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. అయితే ఈ విషయాన్ని హేమ మాలిని స్నేహితుల్లొ ఒకరు వివరించారు. హేమ ప్రసవించిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇలా చేశారని చెప్పుకొచ్చారు. ఈషా పుట్టడానికి ధర్మేంద్ర 100 గదుల ఆసుపత్రిని ఎందుకు బుక్ చేయాల్సి వచ్చిందో అప్పుడు చాలామందికి అర్థం కాలేదని వెల్లడించారు. ఓ షోలో పాల్గొన్న హేమమాలినికి ఆమె స్నేహితురాలు నీతూ కోహ్లి ఈ సంఘటనను గురించి అడిగారు. అయితే దీనిపై కొందరు భిన్నంగా స్పందించారు. దీనివల్ల ఇతరులు ఇబ్బందులు పడతారని తెలియదా అని ప్రశ్నించారు. ఇలాంటి పనులు అనవసరమైనవని మండపడుతున్నారు. మరికొందరేమో ఆస్పత్రికి బదులు ఒక ఫ్లోర్ బుక్ చేసుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు. ధర్మేంద్ర, హేమ లవ్ స్టోరీ కాగా.. హేమ ధర్మేంద్ర 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలో మొదటిసారి నటించారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న జంట 1980లో వివాహం చేసుకున్నారు. హేమ తల్లిదండ్రులు ధర్మేంద్రను వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. ఈ జంటకు ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంతకుముందు 1954లో ప్రకాశ్ కౌర్‌ను వివాహం చేసుకోగా.. నలుగురు పిల్లలు జన్మించారు. (ఇది చదవండి: అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్.. నన్ను కూడా గుర్తుపట్టలేదు: యాంకర్) -
ఇంట్లో పెళ్లికి డుమ్మా కొట్టిన భార్యాపిల్లలు.. సోషల్ మీడియాలో నటుడి భావోద్వేగం
బాలీవుడ్ నటదిగ్గజం ధర్మేంద్ర మనవడు కరణ్ డియోల్ ఓ ఇండివాడైన సంగతి తెలిసిందే! దృష ఆచార్యతో అతడు ఏడడుగులు నడిచాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే ఈ పెళ్లికి ధర్మేంద్ర భార్యాకూతురు డుమ్మా కొట్టారు. అదేంటి? కుటుంబంలోని వ్యక్తి పెళ్లికి రాకపోవడం ఏంటనుకుంటున్నారా? అయితే ముందు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలుసుకోవాల్సిందే! మొదటి భార్య ప్రకాశ్ కౌర్‌తో ధర్మేంద్ర మొదటి భార్య.. నలుగురు సంతానం ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు. అతడు 19 ఏళ్ల వయసులోనే ప్రకాశ్ కౌర్‌ను పెళ్లాడాడు. వీరికి సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత, అజీత అని నలుగురు సంతానం. ఇటీవల పెళ్లి చేసుకున్న కరణ్.. సన్నీ డియోల్ తనయుడు! సుమారు 70 ఏళ్లుగా ధర్మేంద్ర- ప్రకాశ్ కౌర్ కలిసి జీవిస్తున్నారు. ఇకపోతే అతడికి పెళ్లైన విషయం తెలిసి కూడా నటి హేమమాలిని ధర్మేంద్రను ప్రేమించి పెళ్లాడింది. ఈ జంటకు ఈషా, అహానా సంతానం. వీరిని సన్నీ డియోల్.. కరణ్ పెళ్లికి రావాలని ఆహ్వానించినప్పటికీ ఈ కుటుంబం మాత్రం వేడుకకు వచ్చేందుకు మొగ్గు చూపలేదు. పెళ్లి పందిట్లో హేమమాలిని, ఆమె కూతుర్లు ఎక్కడా కనిపించనేలేదు. ధర్మేంద్ర పిలవకపోవడంతోనే వాళ్లు రాలేదని ప్రచారం జరిగింది. రెండో భార్య హేమమాలిని, పిల్లలతో ధర్మేంద్ర పిలవనందుకే క్షమాపణలు! ఈ క్రమంలో ధర్మేంద్ర సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యాడు. 'హేమ, నా డార్లింగ్ పిల్లలు ఇషా, అహానా.. అల్లుళ్లు తక్తానీ, వోహ్రా.. మిమ్మల్ని నేను ఎంతగానో గౌరవిస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వయసు పైబడటం, అనారోగ్యం నాకో విషయాన్ని గుర్తు చేశాయి. నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సింది. కానీ..' అంటూ వాక్యాన్ని సగంలోనే ఆపేస్తూ క్షమించండి అన్నట్లుగా చేతులు జోడించిన ఎమోజీని జత చేస్తూ పోస్ట్ పెట్టాడు. View this post on Instagram A post shared by Dharmendra Deol (@aapkadharam) చదవండి: రెండో భర్తకు విడాకులు.. కారణాలు అనవసరం అంటున్న నటి -
హీరోలందరికి ఎఫైర్లున్నాయి.. నా భర్తను మాత్రమే ఎందుకంటారు?
అలనాటి బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు పాత తరంలో చెప్పలేనంత ఫ్యాన్ బేస్ ఉన్న హీరో.. ఇప్పటికీ తను నటించిన షోలే(1975) సినిమా భారతీయ సినీ చరిత్రలో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమా ఏదో ఒక చోట ఆడుతూనే ఉంది. దీంతో నేటి తరం వారికి కూడా ఆయనంటే అభిమానం. (ఇదీ చదవండి: అభిమాని చేసిన పనికి భావోద్వేగానికి గురైన తమన్నా) ప్రముఖ నటి హేమమాలిని ధర్మేంద్ర జీవితంలో అడుగుపెట్టేనాటికే అతడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ హేమమాలినితో అతడు ప్రేమలో పడ్డాడు. అటు ఆమె కూడా ధర్మేంద్రను ఎంతగానో ప్రేమించింది. ఈ ప్రేమకు మొదటి పెళ్లి అడ్డవుతుందని అంతా అనుకున్నారు, కానీ వారు మాత్రం అలాంటి భయాలేమీ పెట్టుకోలేదు. 1980లో హేమమాలినిని రెండో పెళ్లి చేసుకుని తన జీవితంలోకి స్వాగతించాడు. కాగా వారికి 1981లో ఇషా డియోల్, 1985లో అహనా డియోల్ జన్మించారు. తాజాగా ఇదే విషయంపై హేమమాలినిని ధర్మేంద్ర పెళ్లి చేసుకోవడంపై మొదటి భార్య ప్రకాష్ కౌర్ సమర్థించింది. హేమమాలిని కూడా ధర్మేంద్రకు సంబంధించిన ఇతర కుటుంబ సభ్యులతో చాలా మర్యాదగానే ప్రవర్తిస్తుందని ప్రకాష్ కౌర్ చెప్పుకొచ్చింది. గతంలో దర్మేంద్రను 'ఉమెనైజర్' అని పలువురు కామెంట్లు చేశారు.. అదే కామెంట్లను ఇప్పుడు కూడా కొందరు చేస్తూ ఉంటారు. అని ప్రకాష్ కౌర్ ఇలా స్పందించింది. (ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్) 'నా భర్త మాత్రమే ఎందుకు, ఏ మగాడైనా నాకంటే హేమమాలినినే ఇష్టపడతారు. ఇండస్ట్రీలో సగం మంది ఇదే పని చేస్తున్నప్పుడు నా భర్తను ఉమెనైజర్ అని పిలవడానికి ఎవరైనా ఎంత ధైర్యం చేస్తారు? హీరోలందరూ ఎఫైర్లు పెట్టుకుని రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అతను నాకు మంచి భర్త కాకపోవచ్చు, కానీ అతను ఖచ్చితంగా ఉత్తమ తండ్రి. అతని పిల్లలు అతన్ని చాలా ప్రేమిస్తారు. అతను వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.' అని చెప్పింది. ధర్మేంద్ర మొదటి భార్య పిల్లలు బాలీవుడ్లో టాప్ హీరోలైన సన్నీ డియోల్,బాబీ డియోల్ అని తెలిసిందే. కాగా వారికి విజేత,అజీత అనే సోదరీమణుల ఉన్నారు. -
ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తనయుడు, నటుడు కరణ్ డియోల్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రేయసి దృష ఆచార్యతో ఏడడుగులు నడిచాడు. జూన్ 18న ఇరు కుటుంబాలు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి శ్రీకారం చుట్టే వివాహ వేడుక కోసం సుందరంగా ముస్తాబైందీ కొత్త జంట. నూతన వధువు ఎరుపు లెహంగాలో మెరిసిపోగా, వరుడు కరణ్ డియోల్ షేర్వానీ ధరించాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆదివారం రాత్రి సినీప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు. ఇకపోతే కరణ్ డియోల్.. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుక సైతం ఘనంగా జరిగింది. బరాత్ వేడుకలో కరణ్ తండ్రి సన్నీ డియోల్‌తో పాటు బాబీ, అభయ్ డియోల్, తాతయ్య ధర్మేంద్ర కూడా స్టెప్పులేస్తూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: హఠాత్తుగా ఎందుకంత కోపం?: ఆదిపురుష్ రచయిత -
నా భర్తకు మొదటి భార్య ఉందని ఎప్పుడూ టార్చర్ పెట్టలేదు: నటి
ప్రముఖ నటి హేమమాలిని నటుడు ధర్మేంద్ర జీవితంలో అడుగుపెట్టేనాటికే అతడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ హేమమాలినితో అతడు ప్రేమలో పడ్డాడు. అటు ఆమె కూడా ధర్మేంద్రను ఎంతగానో ప్రేమించింది. ఈ ప్రేమకు మొదటి పెళ్లి అడ్డవుతుందని అంతా అనుకున్నారు, కానీ వారు మాత్రం అలాంటి భయాలేమీ పెట్టుకోలేదు. 1980లో హేమమాలినిని రెండో పెళ్లి చేసుకుని తన జీవితంలోకి స్వాగతించాడు. తాజాగా ఓ షోకి హాజరైన ఆమెకు.. ధర్మేంద్ర మొదటి భార్యను చూస్తే అసూయ కలగలేదా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికామె స్పందిస్తూ.. ఏరోజూ నాకు అసూయ పుట్టలేదు. అందుకే నేనిప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాను. లవ్‌లో ఉన్నప్పుడు ప్రేమను పంచాలే తప్ప ఇతరత్రా వాటిని ఆశించకూడదు. నువ్వు ప్రేమించే వ్యక్తి నీకు అంతకన్నా ఎక్కువ ప్రేమను పంచుతున్నప్పుడు ఏదో చిన్నచిన్న విషయాల కోసం అతడిని ఎందుకు టార్చర్ చేస్తాం? తను నన్ను బాగా చూసుకున్నాడు కాబట్టే నేనెప్పుడూ బాధపడలేదు, తనపై కోప్పడలేదు, టార్చర్ పెట్టలేదు. అందుకే ఇప్పటికీ మేము ఒకరికొకరం ప్రేమ ఇచ్చిపుచ్చుకుంటున్నాం. మా మధ్యలోకి దేన్నీ దూరనివ్వం. అతడి సమస్యలు నాకు తెలుసు కాబట్టి కొన్నికొన్ని సందర్భాల్లో నేను సర్దుకుపోతాను. మనం ఏదైనా ఇస్తే దానికి రెట్టింపు మనకు లభిస్తుంది. అది ప్రేమేనని నేను నమ్ముతాను. ఆ ప్రేమకు విలువ ఇవ్వాలన్నది నా అభిప్రాయం' అని చెప్పుకొచ్చింది నటి. కాగా ధర్మేంద్ర- హేమమాలినిలకు 1981లో ఇషా డియోల్, 1985లో అహనా డియోల్ జన్మించారు. చదవండి: త్వరగా ఎదిగేందుకు ఇంజక్షన్స్ తీసుకున్న హన్సిక? -
ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..
హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. అయినప్పటికీ హీరో సిద్ధార్థ్‌తో డేటింగ్ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజులుగా వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరి నుంచి అధికారిక సమాచారం లేదు. చదవండి: ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్ ట్వీట్ రీసెంట్గా యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించడంలో వీరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఇవాళ వాలంటైన్స్ డే సందర్భంగా అదితి సిద్ధార్థ్‌కు షాకిచ్చింది. సిద్ధార్థ్‌కు కాకుండ మరో సీనియర్ హీరోకి ఆమె ప్రపోజ్ చేసింది. వాలంటైన్స్ డే సందర్భంగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌కి బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్రతో పాటు అదితి కూడా ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా అదితి ఆయనకు రెడ్ గులాబి ఇచ్చి సరదగా ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఎయిర్పోర్ట్ వివాదం: విజయ్ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఈ ఫొటోని అదితి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. దీనికి ‘ది మోస్టెస్ట్ హ్యాండ్సమ్’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పోస్ట్‌పై హీరో సిద్ధార్థ్ స్పందించడం విశేషం.పోస్ట్ 2 హార్ట్ ఎమోజీలతో అదితి పోస్ట్‌పై స్పందించాడు. అయితే వాలంటైన్స్ డే రోజున సిద్ధార్థ్‌కు ప్రపోజ్ చేయకపోవడం ఏంటి? అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్‌పై స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. కాగా సిద్ధార్థ్, అదితి రావు హైదరీలు మహాసముద్రం చిత్రంలో ప్రేమికులుగా నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
కాపురాలు కూల్చడం మాకు సరదా కాదు: నటి
పచ్చని కుటుంబం చిన్నాభిన్నం కావడానికి ఆడవాళ్లే కారణం కాదంటోంది సీనియర్ నటి అరుణ ఇరానీ. మగవాళ్లే ఇల్లాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారని, కానీ వారిని పక్కనపెట్టి ఇతర మహిళలనే లోకం తప్పుపడుతోందని చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆడవాళ్లు తమ కాపురాలు కూలిపోవడానికి మరో ఆడదే కారణం అని వారిని తిడుతుంటారు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి.. మిమ్మల్ని సంతోషంగా ఉంచే బాధ్యత మీ భర్తది కానీ వేరేవాళ్లది ఎలా అవుతుంది? ముందు అతడిని అదుపులో పెట్టండి. కేవలం ఒకరి సంసారాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఏ అమ్మాయి వివాహేతర సంబంధానికి పూనుకోదు. ఉదాహరణకు హేమమాలినిని తీసుకోండి. ఆమె ధర్మేంద్ర కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాన్న ఉద్దేశంతో అతడిని పెళ్లి చేసుకుందా? కాదు కదా! ఏదో ఒక కాగితం మీద రాసుకున్నదాన్ని బట్టి అతడు నా భర్త, ఆమె నా భార్య అంటుంటారు, కానీ ఆ పేపర్‌కు పెద్ద విలువేమీ ఉండదు. ప్రేమకు ఉన్న సెక్యూరిటీ పెళ్లికి లేదు. ప్రేమ లేనిచోట పెళ్లి చేసుకున్నా వృధానే.. అయినా ఆల్రెడీ పెళ్లైన మగవారితో మళ్లీ ఏడడుగులు నడవడం అంత సులువైన విషయం కాదు. అర్ధరాత్రి నా బిడ్డకేదైనా అయితే ఆ మనిషికి నేను ఫోన్ చేయలేను. అలాంటి బాధలు పడటం ఎందుకని పిల్లలు వద్దనుకున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా అరుణ ఇరానీ 1990లో ఫిలింమేకర్ కుకు కోహ్లిని పెళ్లాడింది. అప్పటికే అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన నటి, కొడుకుతో కలిసి విదేశాలకు -
'త్వరలో షోలే-2 రాబోతుంది.. సిద్ధంగా ఉండండి'
ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా టి20 సిరీస్‌పై కన్నేసింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా తొలి టి10 ఆడేందుకు రాంచీలో అడుగుపెట్టింది. సీనియర్లు అయిన రోహిత్, కోహ్లి లేకుండానే పాండ్యా కెప్టెన్సీలో మరో టి20 సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్‌లో సెమీస్ వైఫల్యం అనంతరం బీసీసీఐ కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ నుంచి పాండ్యాకు అప్పజెప్పింది. వచ్చే టి20 వరల్డ్‌కప్ వరకు సరికొత్త జట్టును తయారు చేయాలనే లక్ష్యంతో పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వగా.. దానిని అతను సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఐర్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంకలపై టి20 సిరీస్‌లు గెలిచిన పాండ్యా.. తాజాగా మరోసారి రోహిత్ గైర్హాజరీలో కివీస్‌తో టి20 సిరీస్‌కు టీమిండియాను నడిపించనున్నాడు. ఇక శుక్రవారం(జనవరి 27న) రాంచీ వేదికగా కివీస్, భారత్‌ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది. ఇక రాంచీ టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి స్వస్థలమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా బుధవారం రాత్రి టీమిండియా రాంచీలో అడుగుపెట్టింది. మరుసటి రోజే హార్దిక్ పాండ్యా తన అభిమాన ఆటగాడు ధోనితో గడిపేందుకు అతని ఇంటికి వెళ్లాడు. ధోని ఇంట్లో ఉన్న బైక్ గ్యారేజీ సెంటర్లో సరదాగా గడిపాడు. ఈ సందర్భంగా పాండ్యా.. ధోనిని మోటార్‌సైకిల్‌లో సైడ్కార్లో ఎక్కించుకున్న ఫోటోను షేర్ చేశాడు. ''త్వరలో షోలే-2 మీ ముందుకు రాబోతుంది.. సిద్ధంగా ఉండండి'' అంటూ కామెంట్ చేశాడు. షోలే(1975) సినిమా భారతీయ సినీ చరిత్రలో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమా ఏదో ఒక చోట ఆడుతూనే ఉంది. భారతీయ సినిమా గర్వించదగ్గ షోలే సినిమాలో అమితాబ్, ధర్మేంద్రలు ''యే దోస్తీ హమ్ నహీ చోడేంగే..'' పాట సందర్భంగా ఇదే తరహాలో బైక్‌పై వెళ్లడం గుర్తుండే ఉంటుంది. డ్రైవర్ సీటులో ధర్మేంద్ర ఉంటే.. పక్కన సైడ్కార్లో అమితాబ్ కూర్చొని పాట పాడుకుంటూ వెళ్తారు. అచ్చం అదే ఫోటోని రిపీట్ చేసిన పాండ్యా.. మోటార్‌సైకిల్‌ను తాను డ్రైవ్ చేయగా.. పక్కన సైడ్కార్లో ధోని దర్జాగా కూర్చొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Sholay 2 coming soon 😉 pic.twitter.com/WixkPuBHg0 — hardik pandya (@hardikpandya7) January 26, 2023 చదవండి: టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది' విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి! -
షాకింగ్ ఘటన: స్టేజ్‌పై ఉన్నట్టుండి పాడటం ఆపేసిన సింగర్
కొత్త గొంతుకలను వెలుగులోకి తీసుకొచ్చే షో ఇండియన్ ఐడల్. ఈ ప్రఖ్యాత పాటల పోటీల్లో పాల్గొన్న వారు భావి గాయకులుగా మారి సంగీతప్రియుల మది దోచుకుంటున్నారు. మన తెలుగు సినీ గాయకుడు రేవంత్ కూడా ఆ కోవకు చెందిన వాడే. తాజాగా హిందీ ఇండియన్ ఐడల్ 12వ సీజన్ కొనసాగుతోంది. ఈ పోటీల్లో తన పాటలతో మెస్మరైజ్ చేస్తున్న పవన్‌దీప్ రాజన్ అనూహ్యంగా ప్రేక్షకులతో పాటు జడ్జిలను షాక్‌కు గురి చేశాడు. తన్మయత్వంతో పాట పాడుతుండగా అందరూ మరో లోకంలో తేలుతున్న సమయంలో హఠాత్తుగా పవన్‌దీప్ అర్ధాంతరంగా పాట ఆపేసి.. ఇక చాలు అని వెళ్లిపోయాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను సోనీ టీవీ విడుదల చేసింది. పవన్‌దీప్ ‘హోతన్ సే చులో తుమ్’ పాట పాడుతూ అకస్మాత్తుగా ఆపేశాడు. అంతసేపు ఆసక్తిగా వింటున్న జడ్జిలు ఒకప్పటి నటీనటులు ధర్మేంద, అనితా రాజ్ పాట ఆగిపోవడంతో జడ్జిలు, తోటి పోటీదారులు షాకయ్యారు. మైక్ ఆపేసి వెళ్తున్న పవన్‌దీప్‌ను మరో పార్టిస్పెంట్ నిలువరించి పాటను గుర్తు చేసే ప్రయత్నం చేసింది. ప్రేమ్‌గీత్ సినిమాలో ఆ పాటను గజల్ కింగ్ జగ్జీత్ సింగ్ పాడారు. ఆయనను మరిపించేలా పాడుతున్న పవన్‌దీప్ ఇలా చేయడంతో ప్రేక్షకులు కూడా నోరెళ్లబెట్టారు. ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్ దీప్ సీజన్ మొదటి నుంచి ప్రేక్షకులను తన పాటలతో రంజింపజేస్తున్నారు. అతడి మధురమైన గాత్రానికి సోషల్ మీడియా ఫిదా అవుతోంది. ఇండియన్ ఐడల్ 12వ విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచే అవకాశాలు ఉన్నాయి. అలాంటి రాజన్ అకస్మాత్తుగా ఇలా చేయడంతో షోలో అతడిపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న పవన్‌దీప్ గతంలో కరోనా బారినపడ్డాడు. దీంతో పవన్‌దీప్ వర్చువల్‌గా ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొని వార్తల్లో నిలిచాడు. #IdolPawandeep ki iss performance se kya rang layega iss shaam ka mausam? Dekhiye #DharmendraAndAnitaRajSpecial #IndianIdol2020 aaj raat 9:30 baje, sirf Sony par! pic.twitter.com/YxptSJS1QO — sonytv (@SonyTV) July 18, 2021 -
నా భర్తను కలిసి ఏడాది దాటిపోయింది: హేమ మాలిని
‘కలసి ఉంటే కలదు సుఖం’ అంటారు. కానీ ఇదే విషయాన్ని సీనియర్ నటి హేమ మాలిని వేరే విధంగా చెబుతున్నారు. దూరంగా ఉంటే క్షేమంగా ఉంటాం అంటున్నారు. భర్త ధర్మేంద్రను హేమ కలసి ఏడాది పైనే అయింది. ఈ ఇద్దరూ దూరం కావడానికి కారణం కరోనా. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో ఎక్కడివాళ్లు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. ధర్మేంద్ర, హేమ మాలిని విషయంలో ఇదే జరిగింది. నిజానికి గతేడాది లాక్ డౌన్ నుంచే ధర్మేంద్ర ముంబయ్‌కి దూరంగా ఉన్న ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. హేమ ఏమో ముంబయ్‌లో ఉన్నారు. తాజాగా లాక్డౌన్ విధించడంతో ఇద్దరూ ఎక్కడివాళ్లు అక్కడ ఉండిపోయారు. ఈ విషయం గురించి హేమ మాలిని మాట్లాడుతూ –‘‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ భద్రంగా ఉండటం అవసరం. ఇప్పుడు ఒకరినొకరు కలుసుకోవడం కన్నా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఆయన్ను (ధర్మేంద్ర) మేం కలవడంకన్నా ఆయన ఆరోగ్యంగా ఉండటం మాకు ముఖ్యం. వందేళ్ల మానవ చరిత్రలో ఇంత పెద్ద అంటువ్యాధిని మనం ఇప్పుడే ఎదుర్కొంటున్నాం. సమాజాన్ని కాపాడుకోవాలంటే.. మనం ధైర్యంగా నిలబడాలంటే మనిషికీ మనిషికీ దూరం పాటించాల్సిందే. ఈ త్యాగం చేయాలి’’ అన్నారు. ధర్మేంద్ర వయసు దాదాపు 85. హేమకు 70 ఏళ్లు పైనే. ఈ కరోనా టైమ్‌లో వయసు పైబడినవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇంటిపట్టునే ఉండాలి. అందుకే ధర్మేంద్ర–హేమ ఇలా దూరంగా ఉంటున్నారు. ఈ ఇద్దరూ 1980లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటికే ధర్మేంద్రకి పెళ్లయి, ఇద్దరు కుమారులు సన్నీ, బాబీ డియోల్ ఉన్నారు. ధర్మేంద్ర–హేమకు ఇద్దరు కుమార్తెలు ఇషా డియోల్, అహానా డియోల్ ఉన్నారు. -
కోవిడ్ టీకా వేయించుకున్న బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర!
న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంబిస్తొంది. ప్రతిరోజు కేసులు సంఖ్య పెరుగుతునే ఉన్నాయి. దీని వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటికే కేంద్రం వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే దీన్నిచాలా మంది సెలబ్రీటిలు వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. తాజాగా, బాలీవుడ్ హిందీ నటుడు ధర్మేంద్ర కూడా ఆ జాబితాలో చేరిపోయారు. 85 ఏళ్ళవయసులో కొవిడ్19 వ్యాక్సిన్‌ను వేయించుకొని అందరిలోను జోష్‌ను నింపారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే, హేమమాలినీ, జితేంద్ర, కమల్‌హసన్, మోహన్‌లాల్, అక్కినేని నాగార్జునా, రాకేష్ రోషన్, పరేష్‌రావల్ తదితరులు వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్బంగా ధర్మేంద్ర తన ట్విటర్ ఖాతలో వీడియోను పోస్ట్ చేస్తూ..‘ ఇదేదో చూపించాలని కాదూ’ నన్నుచూసి నా అభిమానులు కూడా వ్యాక్సిన్ వేసుకుంటారని అనుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. ‘కర్తే కర్తే..జోష్ ఆగయా..ఔర్ మై నికల్ గయా వ్యాక్సిన్‌లేనే’ ( సోషల్ మీడియా వేదికగా కొవిద్ నిబంధనల పట్ల ట్విట్లు చేశాను..నాకు జోష్ వచ్చింది..వెంటనే వ్యాక్సిన్ తీసుకున్నాను.. అని పోస్ట్ పెట్టారు. నా మిత్రులు, ప్రజలు, అభిమానులంతా విధిగా కరొనా వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని కోరారు. ధర్మేంద్ర బాలీవుడ్లో అనేక హిట్ సినిమాల్లో నటించారు. షోలే, ఫుల్ ఔర్ పత్తర్, కాజల్, దర్మ్ ఔర్ కానున్, భగవత్ ,చరాస్..వంటి అనేక హిట్ సినిమాల్లో నటించారు. ఆయన 2018లో చివరిసారిగా ‘యమ్లా పగ్లా దివానా’లో నటించారు. ఈయన తన కుమారులు సన్నీ, బాబీడియోల్‌లతో కలిసి నటించారు. చదవండి: కరోనా నివారణకు లాక్డౌన్ ఒక్కటే మార్గం’ -
ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమే
పెట్రోల్, డీజిల్‌పై విధించిన పన్నులను తగ్గించాలని అని వర్గాల నుంచి ఒత్తిడి వస్తున్న కారణంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఈ విషయంపై స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమేనని అని అన్నారు. అయితే, ఇంధన ధరలపై విధించిన పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా తగ్గించాల్సిన అవసరం ఉంది అన్నారు. "అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదల కారణంగా భారతదేశం కూడా ఇంధన ధరలను పెంచవలసి వచ్చింది. కానీ, ఇది తాత్కాలికం త్వరలో క్రమంగా ధరలు తగ్గుతాయి" అని కేంద్ర మంత్రి అన్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం కోసం ఇంధనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనాలపై పన్నులను విధిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. పెట్రోలియం ధరపై కేంద్రం మాత్రమే సుంకాలు విధించడం లేదు రాష్ట్రాలు కూడా సుంకాలు విధిస్తున్నాయి కాబట్టి రాష్ట్రాలు, కేంద్రం చర్చించాల్సిన అవసరం ఉంది అన్నారు. కేంద్రం వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకే వెళ్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొంది. చదవండి: దేశంలో ఫస్ట్ ఏసీ రైల్వే టర్మినల్ మారుతి సుజుకి బంపర్ అఫర్ -
మా నాన్నను ధర్మేంద్ర ఏడిపించారు..
‘ఒక విదేశీ షూటింగ్‌కు నాతోపాటు మా నాన్న వచ్చారు. ధర్మేంద్రతో పాటలో యాక్ట్ చేయాలి. నాన్నకు అప్పటికే ధర్మేంద్ర నా వెంట పడటం తెలుసు. అందుకని నాన్న ప్రతిసారి మా కారు ధర్మేంద్ర ఎక్కకుండా అడ్డుకునేవారు. అయినా సరే ధర్మేంద్ర మా కారులోనే వస్తానని అనేవారు. నేను బ్యాక్సీట్లో కూచోగానే మా నాన్న వెంటనే డోర్ తీసుకుని నా పక్కన కూచునేవారు. ధర్మేంద్ర చాలా క్లవర్. ఇంకో డోర్ నుంచి ఆయన ఎక్కి నా పక్కన కూచునేవారు. వాళ్లు ఇలా నా కోసం ప్లాన్లు వేయడం సరదాగా అనిపించేది’ అన్నారు హేమమాలిని. 72 సంవత్సరాల హేమమాలిని నేటికి బాలీవుడ్ ‘డ్రీమ్‌గర్ల్’గా ఉన్నారు. అందుకే మొన్నటి ఆదివారం (మార్చి 7) విమెన్స్ డే సందర్భంగా ఇండియన్ ఐడెల్ ఎపిసోడ్‌ను ఆమె పేరున నిర్వహించారు. హేమమాలిని ఆ ఎపిసోడ్‌కు హాజరయ్యి ఆ సందర్భంగా చాలా విశేషాలు చెప్పారు హేమ మాలిని. అంతేకాదు, అందరినీ ఆశ్చర్యపరుస్తూ డాన్స్ చేశారు. ఆమె స్టెప్పులేసిన పాటల్లో ‘షోలే’లోని ‘జబ్ తక్ హై జాన్’ పాట ఒకటి. ‘షోలే’లో ఈ పాట క్లయిమాక్స్ లో వస్తుంది. గబ్బర్ సింగ్ ముందు మండుటెండలో బండరాళ్ల మీద పగిలిన గాజుపెంకులపై డాన్స్ చేస్తుంది హేమ మాలిని, ధరేంద్రను విడిపించుకోవడానికి. ఆ పాట వెనుక ఉన్న విశేషాలను కూడా ఆమె చెప్పారు– ‘ఆ పాట ఇలా ఉంటుందని దర్శకుడు రమేశ్ సిప్పి చెప్పారు. చేద్దాం... కాని షూటింగ్ నవంబర్, డిసెంబర్లో పెట్టుకోండి. అప్పుడు మైసూరు (షూటింగ్ జరుగుతున్న ప్రాంతం) చల్లగా ఉంటుంది అన్నాను. కాని రమేశ్ సిప్పీ వినలేదు. ఏప్రిల్ నెలఖారున షూటింగ్ పెట్టారు. అంత ఎండ లో రాళ్ల మీద డాన్స్ చేయడం ఎలా అనుకున్నాను. మా అమ్మ పాదాలకు ప్రత్యేకమైన సాక్సులు తయారు చేయించింది. అవి వేసుకుంటే కాళ్లు కాలవు.. సాక్సులు వేసుకున్నట్టు తెలియదు కూడా. వాటిని తొడుక్కుంటుంటే రమేశ్ సిప్పీ దూరం నుంచి చూసి ‘వద్దొద్దు్ద అవి వేయకండి’ అని వార్నింగ్ ఇచ్చారు. సరే... రాళ్ల మీద కాసిన్ని నీళ్లైనా పోయండి చల్లబడతాయి అన్నాను. దానికీ ఒప్పుకోలేదు. చివరకు పాటను అలాగే చేశాను. మొత్తం పాట తీయడానికి పది రోజులు పట్టింది. కాని ఫలితం ఎలా ఉందో మీరే చూశారుగా’ అన్నారామె. ‘జానీ మేరా నామ్ సినిమా సమయానికి నేను ఇంకా ఫీల్డుకి కొత్త. ఆ సినిమాలో వాదా తూ నిభాయా... పాట దేవ్ ఆనంద్ గారితో చేయాలి. రోప్ వేలో ఒక చైర్లో దేవ్ ఆనంద్ కూచుంటే ఆయన వొడిలో నేను కూచోవాలి. సరే.. సినిమాల్లో ఇవన్నీ తప్పవు. నేను దేవ్ గారి వొడిలో కూచున్నాక ప్రతిసారీ కరెంటు పోయేది. నేను అలాగే కూచుని ఉండాల్సి వచ్చేది. ఏమిటా అని చూస్తే తర్వాత తెలిసింది... కావాలనే కరెంట్ తీసేస్తున్నారని. ఇలాంటివి కూడా షూటింగ్లలో జరుగుతుంటాయి’ అన్నారామె. తను ఇంట్లో మూడో సంతానమని, తను గర్భంలో ఉండగానే ఈసారి పుట్టేది ఆడపిల్లే.. దానికి హేమ మాలిని అని పేరు పెట్టాలి అని తన తల్లి అనుకుందని ఆమె చెప్పారు. పుట్టక ముందే పేరు రెడీ చేసుకున్న ఆమె పుట్టాక ఆ పేరును డ్రీమ్ గర్ల్ హేమమాలినిగా నిలబెట్టుకున్నారు. -
ఉత్తరాల ‘లంకె’బిందెలు
ఇంట్లో పెద్దవాళ్లు, ‘అప్పటి రోజులే వేరు. మళ్లీ రావు, బంగారం లాంటి రోజులు’ అని తరచు అంటే వినటం అందరికీ అనుభవమే. నిజమే. ఆ రోజులు అలాంటివే మరి. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆధునిక గ్యాడ్జెట్లు, సకల సదుపాయాలు... జీవితాన్ని సులభం చేసుకునే సాధనాలేవీ లేని రోజులు. ఉత్తరాల ద్వారా మాత్రమే క్షేమసమాచారాలు అందుకున్న రోజులు. ముఖ్యంగా సినీ నటులు అభిమానులు రాసిన ఉత్తరాలకు వారి సంతకం తో ఉన్న ఫొటోలు పోస్టులో పంపిన రోజులు. అటువంటి ఒక చిన్న సంఘటన ఇప్పుడు ట్విటర్లో వైరల్ అవుతోంది. అది చూసిన విదేశీయులు, భారతీయులకు పాత జ్ఞాపకాలంటే అభిమానమే అనుకుంటున్నారు. ఎఎల్‌టి అనే ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ కోఫౌండర్‌గా పని చేస్తున్నారు శామ్‌జావేద్. పదిహేను సంవత్సరాల క్రితం కన్నుమూసిన తన ఆంటీకి సంబంధించిన చిన్న అంశాన్ని ట్విటర్లో ఉంచారు శామ్. ఈ ట్వీట్ వారం రోజులుగా ట్రెండింగ్ అవుతోంది. అసలు కథ... మెహరున్నీసా నజ్మా పదిహేను సంవత్సరాల క్రితం అంటే 2006లో కన్నుమూశాక, ఆవిడకు సంబంధించిన కొన్ని వస్తువులను మేనకోడలు శామ్‌జావేద్ భద్రపరిచారు. ఇటీవలే అక్కడ ఉన్న సామానులను బయటకు తీస్తుంటే అందులో ఒక ఆల్బమ్ కనిపించింది. ఆ ఆల్బమ్ ను చాలా ఆసక్తితో పరిశీలించారు శామ్. అందులో ప్రముఖ సినీతారల స్వదస్తూరితో ఉన్న ఉత్తరాలు శామ్‌ను ఆకర్షించాయి. ఒకసారి తన మేనత్తను జ్ఞాపకం చేసుకున్నారు శామ్. శామ్‌జావేద్ సినిమాలంటే ఇష్టం... నజ్మాకు భారతీయ చిత్రాలంటే ప్రాణం. సినిమాలు చూసి ఊరుకోకుండా, ఆ తారలకు ఉత్తరాలు రాసేవారు. ఇది తల్లికి నచ్చేది కాదు. అయినా నజ్మా ఎవ్వరికీ తెలియకుండా ఉత్తరాలు రాస్తూ. తనకు వచ్చిన సమాధానాలను భద్రంగా ఆల్బమ్‌లో భద్రపరిచారు. ఆల్బమ్ అంతా సినిమా తారలు తమ సంతకాలతో ఆమె ఉత్తరాలకు రాసిన సమాధానాలతో నిండిపోయింది. ఎల్విస్ ప్రెస్లీ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న షమ్మీ కపూర్ ఇంగ్లీషులో, ‘‘మీరు నా అభిమాని అని తెలిసి చాలా సంతోషంగా ఉంది’’ అని ఉత్తరం రాశారు. ధర్మేంద్ర, సునీల్ దత్త్.. చెప్పుకుంటూ పోతే లెక్కలేనంత మంది నజ్మాకు ఉత్తరాలు రాశారు. అప్పట్లో పెద్ద పెద్ద తారలైన కామినీ కౌశల్, సాధన, ఆశాపరేఖ్, సైరాబాను, తబస్సుమ్, సురయ్యా, రాజేంద్రకుమార్, రాజ్‌కుమార్... లెక్కలేనంతమంది. ఇంతమంది నుంచి ఉత్తరాలు అందుకున్న నజ్మా జీవితం చాలా చిత్రంగా అనిపిస్తుంది. నజ్మా 1930 లో ఢిల్లీలో పుట్టారు. తండ్రి పంజాబీ, తల్లిది బర్మా. నజ్మాకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. నజ్మా చిన్నతనంలోనే తండ్రి కన్నుమూయటంతో, మేనత్త ఈ కుటుంబ బాధ్యత తీసుకున్నారు. తమ్ముడు, చెల్లాయి.. పెరిగి పెద్దయ్యాక, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో పై చదువులు చదువుకున్నారు. నజ్మాకు చదువు మీద ఆసక్తి లేదు. సినిమాలంటేనే ఇష్టం. సిలోన్ రేడియోలో పాటలు వినేవారు. తన అభిమాన నటులకి ఉత్తరాలు రాసేవారు. 20 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఇలాగే గడిపారు నజ్మా. ఆ తరవాత వివాహం జరిగింది. అప్పటి నుంచి ఉత్తరాలు రాయటం ఆపేసి ఉంటారంటారు. నజ్మాకి వివాహం జరిగిన ఎనిమిది సంవత్సరాలకే ఆమె భర్త గతించారు. మళ్లీ పెళ్లి చేసుకోలేదు. నజ్మాకు పిల్లలు లేరు. చెల్లెళ్లు, తమ్ముడి పిల్లలతో చాలా చనువుగా ఉండేవారు. తనకు ఇష్టమైన సినిమాలను జీవితాంతం హాయిగా చూశారు నజ్మా. ‘‘మా ఆంటీ చాలా అందంగా ఉండేవారు. సినిమాల మీద, సినీ తారలకు ఉత్తరాలు రాయటం మీద ఆవిడకున్న అభిమానం అప్పట్లో అందరికీ తెలుసు. ఇప్పుడు నా ట్వీట్ చూసి అందరూ మా ఆంటీని ప్రశంసిస్తున్నారు. నా దగ్గర లంకెబిందెల్లాంటి చాలా విలువైన సంపద ఉంది అంటున్నారు’’ అంటూ ట్వీట్ చేశారు శామ్‌జావేద్. పాత బంగారం కోసం... ఇప్పుడు బాలీవుడ్ తారలంతా ఆ ఉత్తరాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రియాంక చోప్రా జొనాస్.. ఈ ఉత్తరాలను ట్వీట్ చేసిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ‘ఇవి చాలా ప్రత్యేకమైన ఉత్తరాలు. అన్ని ఉత్తరాలు నా మనసును హత్తుకున్నాయి. వీటిని షేర్ చేసినందుకు ధన్యవాదాలు’ అన్నారు ప్రియాంక. ఇవి ట్విటర్లో బాగా వైరల్ కావటంతో, నేషనల్ ఫిల్మ్ అర్కైవ్ వారు నజ్మా ఉత్తరాలను సేకరించి భద్రపరచాలనుకుంటున్నారు. సరదా గా దాచుకున్న ఉత్తరాలకు ఇప్పుడు ఇంత గుర్తింపు వస్తుందని ఆ రోజు నజ్మా ఊహించి ఉండరు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఉత్తరాలు ఒకరినొకరు కలిపే ‘లంకె’బిందె ల్లాంటివేనంటూ వీటిని విలువైనవిగా గుర్తిస్తోంది సినీ పరిశ్రమ. సునీల్ దత్త్ ఒకటో రెండో వాక్యాలు కాదు, స్వదస్తూరితో పెద్ద ఉత్తరమే రాశారు. ‘ఆ ఉత్తరం చూస్తుంటే ఆయన బహుశ మా అత్తయ్యను చిన్న అమ్మాయి అనుకుని ఉంటారనిపిస్తుంది. ఆయన ఎంతో జాగ్రత్తగా సిస్టర్ అని సంబోధిస్తూ ఉత్తరం రాశారు. అది కూడా ఒకసారి కాదు, పదేపదే అదే పదం ఉపయోగించారు’’ అంటారు శామ్‌జావేద్. ఒక్క అక్షర దోషం కూడా లేకుండా రాసిన ఉర్దూ ఉత్తరం అది. ధర్మేంద్ర కూడా స్వదస్తూరితో హిందీలో రాశారు. ఆ ఉత్తరం చదివితే, నజ్మా... ధర్మేంద్ర పుట్టినరోజుకి రాసిన ఉత్తరానికి సమాధానమని అర్థం అవుతుంది. ‘‘నా పుట్టినరోజుకి మీరు పంపిన శుభాకాంక్షలు అందుకున్నాను. మీ ఉత్తరం చూసిన నా హృదయం ఎంతో సంతోషంతో నాట్యం చేసింది. నా ఆటోగ్రాఫ్‌తో ఉన్న నా ఫొటో మీకు పంపుతున్నాను, మీకు నా అభినందనలు’’ అంటూ ధర్మేంద్ర జవాబు రాశారు. ఈ సమాధానం చదివిన నజ్మా ఆంటీ మనసు ఎలా ఉండి ఉంటుందో చెప్పక్కర్లేదు’ అంటారు శామ్‌జావేద్. తబస్సుమ్ రాసిన ఉత్తరాలు చూస్తే, వారిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తుంది. -
వీధి వీధినా వాడవాడలా మార్మోగే పాట ఇది!
స్వాతంత్య్ర దినోత్సవం వచ్చినా, గణతంత్ర దినోత్సవం వచ్చినా వీధి వీధినా వాడవాడలా మార్మోగే పాట ఒకటి ఉంది. అదే ‘కర్ చలే హమ్ ఫిదా జాన్ ఒ తన్ సాథియో.. అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో’ పాట. ఇది 1964లో వచ్చిన ‘హకీకత్’ సినిమాలోని పాట. ధర్మేంద్ర, బల్రాజ్ సహానీ ప్రధాన తారాగణం. 1962లో జరిగిన ఇండో–చైనా యుద్ధ నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఆ యుద్ధం మీద వచ్చిన తొలి హిందీ సినిమా కూడా. లడాక్‌లో వొరిజినల్ లొకేషన్స్‌లో చిత్రీకరించారు. చేతన్ ఆనంద్ దర్శకుడు. ఇండో చైనా వార్‌లో మనం ఓడిపోయాం. కాని ‘రెజాంగ్ లా’ అనే చోట 120 సైనికులు ఉన్న మన బృందం చైనా సైనికుల పై పైచేయి సాధించింది. అందులో 114 మంది మనవారు చనిపోయారు. చైనా సైనికులు భారీగా చనిపోయారని అంటారు. మొత్తం మీద ఆ ఒక్క స్థలంలో మనవారు తమ బలిదానంతో భారత భూభాగాన్ని నిలుపుకోవడాన్ని కథగా తీసుకొని దర్శకుడు చేతన్ ఆనంద్ ‘హకీకత్’ తీశాడు. నిజానికి ఇది ప్రభుత్వం చెప్పాలనుకున్న ‘హకీకత్’ (వాస్తవం). చైనా యుద్ధానికి కారణం చైనా తప్పిదమే అనే నెహ్రూ అభిప్రాయానికి ప్రచారం ఇచ్చిన సినిమా ఇది. విశేషం ఏమిటంటే దేశభక్తి కలిగిన ఈ సినిమాలో పని చేసినందుకు వామపక్ష భావజాలం ఉన్న చేతన్ ఆనంద్, కైఫీ ఆజ్మీ, బల్రాజ్ సహానీ రూపాయి డబ్బు కూడా తీసుకోలేదు. దీని క్లయిమాక్స్‌లో గెలిచినా కూడా ప్రాణాలు కోల్పోయిన సైనికుల మృతదేహాల నేపథ్యంలో విషాద భరితంగా ఒక పాట కావాల్సి వచ్చింది. ఆ పాటను విజయ్ ఆనంద్ కైఫీ ఆజ్మీ చేత చేయించాడు. మదన్ మోహన్ దానికి బాణీ కట్టాడు. కర్ చలే హమ్ ఫిదా జాన్ ఒ తన్ సాథియో అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో... అంటే ‘మీ కోసం మా దేహప్రాణాలను బలిదానం చేశాం. దేశాన్ని మీకు అప్పగించి వెళుతున్నాం’ అని తోటి సైనికులకు, దేశప్రజలకు సైనికులు చెబుతున్నట్టుగా ఉండే పాట ఇది. ఐదు నిమిషాలకు పైగా వచ్చే ఈ పాట సినిమా సైనికుల మృతదేహాలను... నిజ సైనికశకటాలను చూపుతూ భావోద్వేగంగా ఉంటుంది. మహమ్మద్ రఫీ పాడిన విధానం శోకాన్ని, గగుర్పాటును, దేశభక్తిని కలిగించేలా ఉంటుంది. అందుకే ఆ పాట వచ్చి దాదాపు 60 ఏళ్లు అవుతున్నా నేటికీ వినపడుతూ ఉంది. అయితే ఈ సినిమా రిలీజుకు ముందే నెహ్రూ మరణించారు. ఈ సినిమాను నెహ్రూకు అంకితం ఇచ్చారు. ఎందరి బలిదానాలో ఈ దేశం మట్టిలో ఉన్నాయి. ఎందరి త్యాగాల ఫలితమో ఇది. అందరూ దీనికోసం ప్రాణాలు వొడ్డారు. ఈ దేశం అందరిది అనే భావనను పునశ్చరణ చేసుకోవాల్సిన సందర్భం ఇది. -
మళ్లీ వస్తున్నాం
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, ఆయన కుమారులు బాబీ డియోల్, సన్నీ డియోల్ కలసి స్క్రీన్ మీద నవ్వులు పండించిన చిత్రం ‘అప్నే’. ధర్మేంద్ర, సన్నీ, బాబీ, కత్రీనా కైఫ్, శిల్పా శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 2007లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ‘అప్నే’కు సీక్వెల్‌గా ‘అప్నే 2’ను తెరకెక్కించే పనిలో ఉన్నట్టు ఆదివారం ప్రకటించారు ధర్మేంద్ర. ‘మీ అందరికీ ‘అప్నే 2’ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ∙సన్నీ డియోల్, ధర్మేంద్ర, బాబీ డియోల్ -
ఆ జంట ప్రేమకథకు తొలి సన్నివేశం
‘ఆమె ఏం ఇష్టపడతారు?’ అడిగాడొక యువనటుడు తన స్నేహితుడిని అక్కడే ఉన్న ఓ సీనియర్ హీరోయిన్ను చూపిస్తూ. ‘ఆమె ఏం ఇష్టపడితే మనకేంగానీ సెట్స్ మీదకు వెళ్లగానే ఆమె కాళ్లకు దండం పెట్టు చాలు’ సలహా ఇచ్చాడు స్నేహితుడు. తర్వాత.. ముంబైలోని చాందీవలీ స్టూడియోస్‌లో ఈ యువనటుడిని ఆ సీనియర్ హీరోయిన్‌కు పరిచయం చేశారు. ఆమె వాత్సల్యంగా అతని భుజం తట్టి ‘ఈ అబ్బాయికి మంచి భవిష్యత్ ఉంది’ అని చెప్పింది. ఇది ఆ జంట ప్రేమకథకు తొలి సన్నివేశం. ఆ సీనియర్ హీరోయిన్.. మీనా కుమారి, ట్రాజెడీ క్వీన్ ఆఫ్ బాలీవుడ్. ఆ యంగ్‌స్టర్.. ధర్మేంద్ర. . ధర్మేంద్రను పిచ్చిగా ప్రేమించింది మీనా కుమారి. చూడగానే అతని భవితను అంచనావేయడమే కాదు సినిమా రంగంలో ధర్మేంద్రను నిలబెట్టేందుకూ ప్రయత్నించింది.. ఎంతోమంది నిర్మాత,దర్శకులకు అతని పేరు సిఫారసు చేసి. ధర్మేంద్ర ఎదురుపడేనాటికే మందు సాహచర్యంలో ఉంది మీనాకుమారి. బేషరతుగా తనకు ప్రేమను పంచే మనసు కోసం తపిస్తోంది. నిజాయితీగా తనను లాలించే తోడు కోసం నిరీక్షిస్తోంది. అప్పుడు ధర్మేంద్ర వచ్చాడు ఆమె పట్ల తన కళ్లల్లో ఆరాధన నింపుకొని. దాన్ని మీనాకుమారి ప్రేమ అనుకుంది. తాను ఎదురుచూస్తున్న వ్యక్తి ధర్మేంద్రే అని స్థిరపరచుకుంది. అతని సాంగత్యంలో ఈ లోకాన్ని మరిచిపోయేది. ఆమెతో ఉన్నంతసేపు అతనూ తన లోకాన్ని పక్కన పెట్టేవాడు. ఆ కాలక్షేపంలో ఆమె అతణ్ణి తన సాంత్వనగా మలచుకునేది. అతను ఆమెనో గురువుగా, గైడ్‌గా భావించేవాడు. తన గురించి అతను ఏమనుకుంటున్నాడోనని ఏనాడూ ఆలోచించలేదు మీనా కుమారి. తాను ఆనందంగా ఉంది చాలు అనే భద్రతను కాపాడుకోసాగిందంతే. ఆమె తన నుంచి ఏం ఆశిస్తోందో అతని మెదడుకి చిక్కినా.. తాను ఎలా ఉండదలుచుకున్నాడో అలాగే ఉన్నాడు. అందుకే కడవరకు కలిసే ఉంటారని నమ్ముకున్న బంధం మూడేళ్లకే ముగిసిపోయింది. మీనా కుమారి మళ్లీ మందు మాయలో పడిపోయింది. ఆ మూడేళ్లలో.. ఈ ఇద్దరి గురించి వచ్చినన్ని వదంతులు బాలీవుడ్లో ఇంకే జంట గురించీ వచ్చి ఉండవు. తర్వాత కాలంలో ఆ రూమర్సే నిజాలుగా, నిజాలు రూమర్స్గా ప్రచారం అయ్యాయి. సత్యాసత్యాలు ఈ ఇద్దరి ఆత్మకథల అచ్చులో కనిపించినప్పటికీ ఆ ప్రేమ కథలో ధర్మేంద్ర విలన్‌గా మిగిలాడు. కాని తన కెరీర్ ప్రారంభంలో మీనా కుమారి అందించిన ప్రోత్సాహాన్ని మాత్రం అతను మరిచిపోలేదు. చాందీవలీ స్టుడియోస్లో ఆమెను కలిసినప్పుడు స్నేహితుడు సూచించినట్టుగా ధర్మేంద్ర ఆమె కాళ్లకు నమస్కరించాడో లేదో కాని మీనా కుమారి చేసిన మేలును తలచుకుంటూనే ఉంటాడు ఇప్పటికీ. ఫ్లాష్‌బ్యాక్ ఆల్కహాల్, డిప్రెషన్‌తోనే మీనా కుమారికి కాలం గడుస్తోంది. అప్పుడు ఆమెకు మళ్లీ చేరువయ్యాడు.. ధర్మేంద్ర కాదు కమల్ ఆమ్రోహి. ఆమె భర్త. దర్శకుడు. ఈ ఇద్దరినీ కలిపింది ప్రసిద్ధ నటుడు అశోక్ కుమార్. తొలిచూపులోనే మీనాను ‘నా అనార్కలి’ అనుకున్నాడు కమల్. తాను తీయబోతున్న సినిమా అది. ఆ ఆఫర్‌కు అంగీకారం తెలిపి మహాబలేశ్వర్ వెళ్తుంటే రోడ్డు ప్రమాదంలో గాయపడింది మీనా కుమారి. దాదాపు మూడు నెలల ఆసుపత్రిలోనే ఉంది. ప్రతి వారాంతాలు ఆమె దగ్గరకు వెళ్లి బాగోగులు చూసుకునేవాడు కమల్. వచ్చినప్పుడల్లా ఆమె మణికట్టు మీద ‘నా అనార్కలి’ అని రాసేవాడట. ఇదీ ఓ విఫల ప్రేమ, పెళ్లి గాథ. వచ్చే వారానికి వాయిదా వేద్దాం. ఒకసారి మీనా కుమారి తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని పిక్నిక్ వెళ్లిందట. అందులో ధర్మేంద్ర కూడా ఉన్నాడు. తిరుగు ప్రయాణంలో పొరపాటున ధర్మేంద్ర మరో కారులో కూర్చున్నాడు. దాంతో ‘నా ధరమ్ ఏడి?ఎక్కడ?’ అంటూ కంగారు పడిందట మీనా కుమారి. ‘ఇంకో కార్లో వస్తున్నాడు’ అని ఆమె అసిస్టెంట్ చెప్పినా వినకుండా తన కారు ఆపేయించి, రోడ్డుకు అడ్డంగా వెళ్లి ‘ధరమ్.. ఎక్కడా?ఎక్కడన్నావ్?’ అంటూ వెనకాల వస్తున్న తన స్నేహితుల కార్లలో ధర్మేంద్రను వెదుక్కోసాగిందట. అంత అబ్సేషన్గా తయారయ్యాడు ధర్మేంద్ర.. మీనా కుమారికి అంటూ ఈ విషయాన్ని ఉటంకించాయట మరుసటిరోజు... పత్రికలన్నీ. ‘కాజల్’ సినిమా సక్సెస్ వేడుక కోసం ఢిల్లీ వెళ్లాడు ధర్మేంద్ర. పార్టీ అయిపోయాక రాత్రి ఫ్లయిట్‌కు మళ్లీ ముంబై చేరుకోవాలి. కాని ఎయిర్పోర్ట్ సిబ్బంది అతణ్ణి ఫ్లయిట్ ఎక్కనివ్వలేదు. మోతాదుకు మించి మద్యం సేవించాడని. ‘నేను వెళ్లాలి... అక్కడ మీనా కుమారి నా కోసం ఎదురుచూస్తోంది.. తన కోసం నేను వెళ్లాలి.. వెళ్లాల్సిందే’ అంటూ చిందులు తొక్కాడట ధర్మేంద్ర. మీనా కుమారి, ధర్మేంద్ర కలిసినటించిన చిత్రాలుకాజల్, పూర్ణిమ, చందన్ కా పల్నా, మై భీ లడ్కీ హూ, బహారోంకీ మంజిల్, ఫూల్ ఔర్ పత్థర్ మొదలైనవి. – ఎస్సార్ -
‘నా మీద నాకే జాలి.. మద్యం అలవాటయ్యింది’
కెరీర్లో చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని.. అప్పుడు తన మీద తనకే జాలి వేసేదన్నారు నటుడు బాబీ డియోల్. ఆ బాధను మర్చిపోవడానికి తాను మద్యానికి అలవాటు పడ్డానని తెలిపారు. ఎంతో ఉన్నతంగా సాగిన ఈ హీరో కెరీర్ కొన్నేళ్ల క్రితం తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యింది. అయితే తాజాగా బాబీ డియోల్ ‘క్లాస్ ఆఫ్ 83’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో బాబీ డియోల్ మాట్లాడుతూ..‘మన మీద మనం జాలి పడుతున్నాం అంటే మన జీవితంలో అదే అత్యంత కఠినమైన దశ. ఇక అప్పుడు ప్రపంచాన్ని శపించడం మొదలుపెడతాం. నా జీవితంలో రెండు మూడేళ్ల పాటు ఇదే జరిగింది. నా మీద నాకే జాలేసేది. ప్రపంచం నాతో పని చేయాలనుకోవడం లేదని భావించాను. దాంతో మద్యానికి దగ్గరయ్యాను. మౌనంగా మారిపోయాను. అయితే ఓ రోజు నా పిల్లలు నా వైపు చూసిన చూపు నాలో మార్పుకు కారణమయ్యింది. నా తప్పేంటో తెలిసి వచ్చింది’ అన్నారు బాబీ డియోల్. ‘ఓ రోజు నా పిల్లలు ‘మా నాన్న ఏంటి రోజంతా ఇంట్లోనే ఉంటాడు.. ఏం పని చేయడు.. తాగుతూనే ఉంటాడన్నట్లు’ చూశారు. ఇదే భావం నా భార్య, తండ్రి కళ్లలో కూడా కనిపించేది. దాంతో నాలో మార్పు మొదలయ్యింది. నేను ఎక్కడ తప్పు చేశానో తెలిసింది. నేనే ముందుకు సాగాలి తప్ప ఎవరి కోసం ఎదురుచూడకూడదు అని అర్థం అయ్యింది. నా ప్రయాణం నేనే చేయ్యాలని తెలిసింది. ఈ ఆలోచన వచ్చాక నేను పని చేయడం మొదలు పెట్టాను. గత రెండు మూడేళ్లుగా నేను చాల బిజీగా ఉన్నాను’ అన్నారు బాబీ డియోల్. అంతేకాక ‘సల్మాన్, షారుక్ ఖాన్ జీవితాల్లో కూడా కష్టాలు ఉంటాయి. కానీ వారు పోరాడుతున్నారు తప్ప వదిలేయలేదు’ అన్నారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ఇన్సైడర్, ఔట్‌సైడర్ చర్చపై స్పందించారు బాబీ డియోల్. (మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు) ‘పరిశ్రమలో ఎవరి నుంచి మనకు మద్దతు లభించదు. నా కుటుంబం పరిశ్రమలో ఉన్నారంటే దానర్థం వారు నాకు మద్దతిచ్చారని కాదు. అదే నిజమయితే ధర్మేంద్ర కొడుకుగా నేను పెద్ద పెద్ద చిత్రాల్లో నటించాలి. కానీ అలా జరగలేదు కదా. ధర్మేంద్ర కొడుకుగా పుట్టడం నా అదృష్టం. కానీ అది ఫస్ట్ సినిమా వరకే పనికొస్తుంది. ఆ తర్వాత నా ప్రతిభ మీదనే నా మనుగడ ఆధారపడి ఉంటుంది’ అన్నారు. ప్రస్తుతం బాబీ డియోల్ షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్లో వస్తోన్న ‘క్లాస్ ఆఫ్ 83’లో నటిస్తున్నారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం విడుదల కానుంది. -
‘కలకాలం మీరు ఇలాగే ఉండాలి.. అమ్మానాన్నా’
‘‘అమ్మా, నాన్నా నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మీరిలాగే కలకాలం కలిసి ఉండాలని.. ప్రేమ, సంతోషం, ఆరోగ్యం మీకు ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను! ప్రేమతో ఇషా, భరత్, రాధ్యా, మియూ’’అంటూ అలనాటి బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమమాలిని, నటుడు ధర్మేంద్రకు వారి తనయ, నటి ఇషా డియోల్ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇషా సోదరి అహానా సైతం హేమ, ధర్మేంద్రలకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో సోషల్ మీడియా వేదికగా వారికి శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు స్పందించిన హేమ మాలిని తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా బాలీవుడ్లో డ్రీమ్‌గర్ల్‌గా ఓ వెలుగు వెలిగిన హేమ మాలినిని పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది హీరోలు ప్రయత్నించి విఫలమయ్యారు. సంజీవ్ కుమార్, జితేంద్ర ఆ జాబితాలో ప్రముఖులు. (మన కథ ముగిసింది: నీతూ కపూర్) ఇక జితేంద్ర హేమ మాలిని ఇంట్లో వాళ్లను ఒప్పించి.. తన ప్రేమను పెళ్లి పీటలదాకా తీసుకువచ్చాడు. మద్రాసులో వివాహం చేసుకోవడానికి తేదీ ఖరారు చేయించాడు. కానీ అప్పటికే హేమతో కలిసి షోలే, సీతా ఔర్ గీతా, దిలాగీ, డ్రీమ్‌గర్ల్ వంటి చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర.. ఆ పెళ్లిని అడ్డుకుని ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. దీంతో 1959లో ధర్మేంద్ర జీవితంలో రెండో భార్యగా హేమమాలిని అడుగుపెట్టారు. ఇద్దరూ వైవాహిక బంధంలో కొనసాగి ఆ తర్వాత దూరం దూరంగా ఉంటున్నా ఎన్నడూ ఒకరినొకరు విమర్శించుకోలేదు. అంతేకాదు ధర్మేంద్ర జీవితంలోకి తాను ప్రవేశించినప్పటికీ ఆయనను ఏనాడు తన కుటుంబం నుంచి వేరు చేయలేదని హేమ మాలిని పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన తనకోసమే పుట్టారని భావిస్తానని.. ఆయనతో జీవితం పంచుకోవడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని భర్తపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇక హేమమాలిని ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.(లాక్‌డౌన్‌తో గెలుద్దాం: హేమ పిలుపు) View this post on Instagram Happy wedding anniversary my darling parents! My mamma & papa I love u both soooooooo much & pray to god to bless you both with infinite years of togetherness ,love , happiness & the best of health !🧿🤗 @dreamgirlhemamalini @aapkadharam Love you , Esha , Bharat,Radhya & Miu ♥️♥️♥️♥️♥️♥️💕 A post shared by Esha Deol (@imeshadeol) on May 1, 2020 at 9:46pm PDT Dharam ji & I thank all those who have wished us on our wedding anniversary today. It is your blessings & good wishes that have always been with us all through these years🙏 pic.twitter.com/tEtO6L4Boj — Hema Malini (@dreamgirlhema) May 2, 2020 -
తాగొచ్చి హేమ మాలిని పెళ్లి ఆపాడు
అలనాటి సూపర్ స్టార్ జితేంద్ర నేడు 78వ వడిలోకి అడుగుపెట్టాడు. అతను తన ప్రేయసి శోభా కపూర్‌ను 1974లో అక్టోబర్18న వివాహం చేసుకున్నాడు. అయితే దీనికన్నా ముందు అలనాటి అందాల తార హేమమాలినిని పెళ్లి చేసుకోబోయాడు. ఈ విషయాన్ని ఆమె జీవిత కథ ఆధారంగా వచ్చిన "హేమ మాలిని: బియాండ్ ద డ్రీమ్‌గర్ల్" పుస్తకం వెల్లడించింది. ఈ పుస్తకం ప్రకారం ఆమె తల్లిదండ్రులకు హేమ, వివాహితుడైన ధర్మేంద్రతో ఉండటం అస్సలు నచ్చేది కాదు. దీంతో ఆమెకు జితేంద్రతో వివాహం జరిపించాలనుకున్నారు. వెంటనే అతని కుటుంబసభ్యులతో మాట్లాడటం, ఇంట్లో వాళ్ల సంతోషం కోసం జితేంద్ర కూడా పెళ్లికి అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ముహూర్తం కూడా ఖరారు చేసుకుని, చెన్నైలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఓ వార్తాపత్రిక ఈ విషయాన్ని చాటింపు చేసి చెప్పింది. దీంతో విషయం తెలుసుకున్న ధర్మేంద్ర్ర, జితేంద్ర ప్రేయసి శోభా(ప్రస్తుతం అతని భార్య)తో కలిసి పెళ్లిని ఆపేందుకు చెన్నైకు పయనమయ్యారు. (ఎంతో నేర్చుకున్నా) మద్యం సేవించిన ధర్మేంద్ర.. హేమ ఇంటికి చేరుకుని ఆమెను ఇంత పెద్ద తప్పు చేయవద్దని కోరుకున్నాడు. మరోవైపు శోభా కూడా జితేంద్రను కలిసి ఆగ్రహం వ్యక్తం చేయగా అతను మాత్రం హేమను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించాడని పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ధర్మేంద్ర మాటలతో కదిలిపోయిన హేమ పెళ్లికి మరింత గడువు కావాలని తన పేరెంట్స్‌ను అభ్యర్థించింది. అలా ఆ పెళ్లి వాయిదా పడింది. కాగా షోలే, సీతా ఔర్ గీతా, దిలాగీ, డ్రీమ్‌గర్ల్ వంటి చిత్రాల్లో హేమతో కలిసి నటించిన ధర్మేంద్ర ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. అనంతరం 1979లో ఆగస్టు 21న హేమను రెండో భార్యగా చేసుకున్నాడు. అయినప్పటికీ వాళ్లిద్దరి సంసార విషయంలో ఎప్పడూ గొడవలు బయటకు రాలేదు. ఇక వీరికి కూతుళ్లు ఈషా, అహాన్ డియోల్ ఉన్న సంగతి తెలిసిందే. ఈషా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం గృహిణిగా ఉండగా.. అహానా క్లాసికల్ డ్యాన్సర్‌గా పలు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇక ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్ సంతానం సన్నీ డియోల్, బాబీ డియోల్ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. -
ఆయనతోనే జీవితం అనుకున్నా.. అందుకే..
న్యూఢిల్లీ : ధర్మేంద్ర జీవితంలోకి తాను ప్రవేశించినప్పటికీ ఆయనను ఏనాడు తన కుటుంబం నుంచి వేరు చేయలేదని అలనాటి డ్రీమ్‌గర్ల్, బీజేపీ ఎంపీ హేమ మాలిని అన్నారు. త్వరలోనే రాజకీయాలకు స్వస్తి పలికి తన కూతుళ్లు, మనవలతో జీవితం గడపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన హేమ మాలిని.. ధర్మేంద్రతో ప్రేమ, పెళ్లి తదితర అంశాల గురించి చెప్పుకొచ్చారు. ‘ ధరమ్ జీని చూసిన నిమిషంలో ఈయన నా మనిషి.. నా కోసమే పుట్టారు అనిపించారు. అందుకే ఆయనతోనే జీవితం గడపాలనుకున్నా. అందుకోసం ఆయనను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నా. అయితే మా పెళ్లి ఎవరినీ బాధించుకూడదనే.. నేనెప్పుడూ ధర్మేంద్రను ఆయన మొటటి భార్య, పిల్లలకు దూరంగా ఉండనివ్వలేదు. వాళ్లు కూడా నేను ఏనాడు వాళ్ల జీవితంలో జోక్యం చేసుకున్నట్లుగా భావించలేదు. ఆయనను వివాహం చేసుకున్నానే తప్ప.. కుటుంబ సభ్యుల నుంచి ఏనాడు వేరుచేయలేదు’ అని పేర్కొన్నారు. ఇక బాలీవుడ్లో డ్రీమ్‌గర్ల్‌గా ఓ వెలుగు వెలిగిన హేమ మాలినిని వివాహం చేసుకోవడానికి చాలామంది హీరోలు ప్రయత్నించారు. వారిలో సంజీవ్ కుమార్ ఒకడు. ఆ తర్వాత జితేంద్ర ఆ ప్రయత్నం చేశాడు. వాళ్లిద్దరు మద్రాసులో వివాహం చేసుకోవడానికి దాదాపు తేదీ ఖరారు చేశారు. అయితే అప్పటికే హేమతో కలిసి షోలే, సీతా ఔర్ గీతా, దిలాగీ, డ్రీమ్‌గర్ల్ వంటి చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ఈ నేపథ్యంలో మద్రాసులో జరుగనున్న పెళ్లిని ఆపించి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. దీంతో 1959లో ధర్మేంద్ర జీవితంలో హేమమాలిని అడుగుపెట్టారు. అయితే... రెండో భార్యగా ఉన్నప్పటికీ వాళ్లిద్దరి సంసార విషయంలో ఎప్పడూ గొడవలు బయటకు రాలేదు. ఇద్దరూ ఆ బంధంలో కొనసాగి ఆ తర్వాత దూరం దూరంగా ఉంటున్నా విమర్శలకు దిగలేదు. వారిరువురూ కలిసి ప్రయివేట్‌గా కనిపించడం కూడా చాలా అరుదు. ఇక వీరికి కూతుళ్లు ఈషా, అహాన్ డియోల్ ఉన్న సంగతి తెలిసిందే. ఈషా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం గృహిణిగా ఉండగా.. అహానా క్లాసికల్ డ్యాన్సర్‌గా పలు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇక ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్ సంతానం సన్నీ డియోల్, బాబీ డియోల్ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. -
డోపింగ్‌తో నిషేధం ఎదుర్కొని...
‘ఆకలిగొన్న సింహంలా ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్నా’... సెమీస్‌లో విజయం తర్వాత అమిత్ పంఘాల్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్య ఇది. ఒక బాక్సర్‌కు ఉండే సహజసిద్ధమైన దూకుడు అతని మాటల్లో కనిపించింది. తన స్వల్ప కెరీర్లోనే అతను ఇదే తరహా దూకుడు ప్రదర్శించి పతకాలు కొల్లగొట్టాడు. అయితే 2012లో అతని కెరీర్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఒక టోర్నీ సమయంలో అనబాలిక్ స్టెరాయిడ్ వాడినందుకు అతనిపై రెండేళ్ల నిషేధం పడింది. చికెన్‌పాక్స్ రావడంతో సరైన సమాచారం లేకుం డా మందులు వాడటమే ఇందుకు కారణమంటూ అతను అప్పీల్ చేశాడు. దాంతో శిక్ష ఏడాది కాలానికి తగ్గినా... అంత తొందరగా ఆ మరక పోలేదు. గత ఏడాది అర్జున అవార్డులకు అతని పేరు నామినేట్ చేసిన సమయంలో కూడా ఇదే వివాదం ముందుకొచ్చి అవార్డును దూరం చేసింది. అయితే నిషేధం తొలగిన అనంతరం పట్టుదలతో శ్రమించిన అమిత్ తన సత్తాను ప్రదర్శిస్తూ సాధించిన విజయాలు మాత్రం ప్రశంసార్హం. హరియాణా రాష్ట్రంలోని రోహ్టక్ సమీపంలోని మాయనా అమిత్ స్వస్థలం. రోహ్టక్ పరిసర గ్రామాల్లో భారీగా డ్రగ్ కేసులు నమోదవుతున్నా... సున్నా క్రైమ్ రేటింగ్ ఉన్న గ్రామం ఇది. తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఆటల్లోనైనా బిజీగా ఉంచాలనేది అక్కడి చాలా మంది తల్లిదండ్రుల ఆలోచన. అన్న ప్రోత్సాహంతో పాఠశాల స్థాయిలోనే బాక్సింగ్ వైపు అడుగులు వేసిన అమిత్ 2009 నుంచి 2016 వరకు సబ్ జూనియర్, జూనియర్ స్థాయిలలో విశేషంగా రాణించి పలు విజయాలు నమోదు చేశాడు. ఆ తర్వాత సీనియర్ స్థాయిలో అతని బాక్సింగ్ కెరీర్ చాలా జోరు గా దూసుకుపోయింది. 2017లో జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి స్వర్ణం గెలుచుకున్న అతను రెండేళ్ల వ్యవధిలో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణానికి చేరువ కావడం విశేషం. 2017 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన అమిత్ ఆ తర్వాత వరుసగా పతకాలు సాధించి తన స్థాయిని పెంచుకున్నాడు. జాట్ల కుటుంబం నుంచి వచ్చిన అమిత్‌కు చాలా మందిలాగే హిందీ అగ్రశ్రేణి హీరో ధర్మేంద్ర కుటుంబం అంటే అమితాభిమానం. గత ఏడాది కామన్వెల్త్లో పతకం నెగ్గిన తర్వాత తన తొలి ట్వీట్లోనే అతను నాన్న, కోచ్‌లను గుర్తు చేసుకుంటూ ధర్మేంద్రను కలవాలని ఉందంటూ రాశాడు. అతని అభిమానానికి స్పందిస్తూ ఆ తర్వాత అమిత్‌కు కలిసే అవకాశం ఇచి్చన ధర్మేంద్ర... అప్పటి నుంచి ప్రతీసారి అతడిని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు కూడా తన వరల్డ్ చాంపియన్‌షిప్ విజయానికి సంబంధించి ట్వీట్లో కూడా ధర్మేంద్ర, సన్నీ డియోల్‌లను అమిత్ ట్యాగ్ చేయడం విశేషం. -
‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’
ప్రముఖ నటి, ఎంపీ హేమామాలిని ‘స్వచ్ఛ్ భారత్’లో భాగంగా చీపురు పట్టి పార్లమెంట్ పరిసరాలను శుభ్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే హేమా మాలిని చేసిన పనికి ప్రశంసలు లభించకపోగా.. విమర్శల పాలవుతోంది. తాజాగా ఇలా విమర్శించే వారి జాబితాలో హేమా మాలిని భర్త ధర్మేంద్ర డియోల్ కూడా చేరారు. హేమా మాలిని చేసిన పని తనకు కూడా అసహజంగా తోచిందన్నారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ధర్మేంద్ర ఇలా బదులిచ్చాడు. హేమా మాలిని నిజ జీవితంలో ఎప్పుడైనా చీపురు పట్టుకున్నారా అని ఓ అభిమాని ట్విటర్లో ధర్మేంద్రను ప్రశ్నించాడు. అందుకు ఆయన బదులిస్తూ.. ‘సినిమాల్లో తప్ప నిజ జీవితంలో తను ఎన్నడు చీపురు పట్టి ఎరగదు’ అన్నాడు. హేమా మాలిని ఆలోచన మంచిదే.. అయితే దాన్ని అమలు చేయడంలో ఆమె విఫలం అయ్యారన్నారు ధర్మేంద్ర. ఆమె ప్రచారం చేయదల్చుకున్న శుభ్రత సందేశాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు ధర్మేంద్ర. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అన్నారు ధర్మేంద్ర. Haan films main , mujhe bhi अनाड़ी लग रहीं थीं . मैं ने मगर बचपन में , अपनी माँ का हमेशा हाथ बटाया है । मैं झाड़ू में माहिर था । I love cleanliness 🍀🍀🍀🍀🍀🍀🍀🍀 — Dharmendra Deol (@aapkadharam) July 14, 2019 -
ఆనందంలో ఈషా డియోల్
బాలీవుడ్ నటి ఈషా డియోల్ రెండో సారి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కాగా, తన కూతురు పేరు మిరయా తక్తానీ అని తెలిపారు. హేమ మాలిని, ధర్మేంద్రల కూతురైన ఈషా.. భరత్ తక్తానీని 2012లో పెళ్లి చేసుకోగా.. అక్టోబర్ 2017 ఈ దంపతులకి రాధ్య జన్మించింది. తాజాగా తనకు రెండోసారి ఆడపిల్ల జన్మించిందని, ఆ సంతోషాన్ని అభిమానులతో కలిసి పంచుకున్నారు. రెండో కాన్పు ద్వారా ఆడబిడ్డ జన్మించిందని ఇషా డియోల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. మీ ప్రేమ, ఆశీర్వాదానికి ధన్యవాదాలు అని ఇషా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పెళ్ళి తర్వాత ఇషా డియోల్ పూర్తిగా సినిమాలకి దూరమయ్యారు. 2002లో కోయి మేరే దిల్ సే పూచ్చే చిత్రంతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈషా డియోల్.. ధూమ్, యువ, నో ఎంట్రీ, ధస్ చిత్రాలతో ఈషా బాగా పాపులర్ అయ్యారు. తనకి మరో కూతురు జన్మించడంతో హేమమాలని దంపతులు సంతోషంగా ఉన్నారని ఈషా పేర్కొన్నారు. -
సునీల్ జాఖడ్ అభ్యర్థని ముందు తెలియదు: ధర్మేంద్ర
గురుదాస్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖఢ్ అని ముందే తెలిస్తే తన కొడుకు సన్నీ దేవల్‌ను ఆయనపై పోటీచేయనిచ్చేవాణ్ని కాదని సన్నీ తండ్రి, ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సునీల్ తండ్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ బలరామ్ జాఖడ్‌పై తనకు ఎనలేని గౌరవం ఉందని ఆయన అన్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి సన్నీని బీజేపీ ఎన్నికల్లో నిలిపింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన మరో బాలీవుడ్ హీరో వినోద్ ఖన్నా మరణించాక జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసిన సునీల్ జాఖడ్ గెలిచారు. ఆయన మళ్లీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీకి దిగారు. ‘‘నేను గురుదాస్‌పూర్ చేరుకున్నాకే సునీల్ పోటీచేస్తున్న విషయం తెలిసింది. ఆయన నాకు కొడుకులాంటి వాడు. అయితే, ఇప్పుడు ప్రచారం కూడా ప్రారంభమయ్యాక పోటీ నుంచి వైదొలగడం కుదరదు,’’ అని 83 ఏళ్ల ధర్మేంద్ర చెప్పారు. సన్నీతో బహిరంగ చర్చకు సునీల్ ఆహ్వానించారన్న విషయం గుర్తుచేయగా, ‘‘సన్నీ ఆయనతో చర్చించలేడు. సునీల్‌కు రాజకీయానుభవం ఉంది. ఆయన తండ్రి రాజకీయవేత్త. మేమేమో సినీరంగం నుంచి వచ్చాం. మేం ఇక్కడకు చర్చించడానికి రాలేదు. ప్రజల సమస్యలు వినడానికి వచ్చాం,’’అని ధర్మేంద్ర వివరించారు. బలరామ్ రాజకీయ పాఠాలు నేర్పారు ‘‘మొదట నాకు ఎమ్మెల్యేకు, ఎంపీకి తేడా తెలియదు. రాజకీయాల్లో మౌలిక పాఠాలు నాకు బలరామ్ జాఖడ్ నేర్పారు. ఆయన రాజస్తాన్ నుంచి మొదట పోటీచేసినప్పుడు నేను ఆయన తరఫున ప్రచారం చేశాను,’’అని ధర్మేంద్ర తెలిపారు. 2004 ఎన్నికల్లో రాజస్తాన్‌లోని చురూ స్థానంలో బలరామ్ జాఖడ్‌పై పోటీచేయాలని బీజేపీ కోరితే అందుకు తాను నిరాకరించానని, చివరికి బికనీర్ నుంచి బీజేపీ తరఫున పోటీకి దిగి గెలిచానని ఆయన గుర్తుచేశారు. ‘‘ఆ ఎన్నికల్లోనే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ భార్య ప్రణీత్ కౌర్‌పై పాటియాలాలో పోటీచేయాలని ఓ దశలో బీజేపీ కోరింది. అందుకు నేను అంగీకరించలేదు. అమరీందర్ తండ్రి పాటియాలా సంస్థానాధీశుడు. మొదట ఆయనే తన రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేశారు. ప్రణీత్ నా సోదరి వంటిది. ఆమెపై పోటీకి అందుకే నిరాకరించాను,’’ అని ఆయన అన్నారు. ‘‘రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని సన్నీకి చెప్పాను. ఎన్నికల్లో పోటీచేయడానికి అప్పటికే ఒప్పుకున్నానని సన్నీ జవాబిచ్చాడు. గురుదాస్‌పూర్ నుంచి పోటీకి సన్నీని ఎవరు ఒప్పించారో నాకు తెలియదు. ఒకసారి దిగాక ఎన్నికల రంగం నుంచి పారిపోయేది లేదు. సినిమా రంగంలో కూడా అగ్రస్థానాలకు చేరుకోవడానికి కొందరు రాజకీయాలు చేస్తారు. కాని, నేనెన్నడూ అక్కడ రాజకీయాలు చేయలేదు.’’ అని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో యూపీలోని మథుర నుంచి తన భార్య, నటి హేమమాలిని మరోసారి పోటీకి దిగడం గురించి ప్రస్తావిస్తూ, తమది రాజకీయ కుటుంబం కాదని ఆయన అన్నారు. -
నాన్నకు హ్యాట్సాఫ్
బాలీవుyŠ సూపర్‌స్టార్ ధర్మేంద్ర అభిమానులకు ఆయన కుమారుడు సన్నీ డియోల్ ఓ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అదేంటంటే... ధర్మేంద్ర జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీని రూపొందించనున్నారు సన్నీ. పంజాబ్ నుంచి ముంబై వచ్చి సినిమాల్లో సూపర్ స్టార్‌గా ధర్మేంద్ర ఎలా ఎదిగారు? అనే విషయాల్ని ఇందులో ప్రస్తావించనున్నారట. అలాగే ధర్మేంద్ర జీవితం ఆధారంగా ఓ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఇందులో నటుడిగా ఆయన చేరుకున్న మైలు రాళ్లు, జ్ఞాపకాలు, ఆశ్చర్యకర సంఘటనలు షేర్ చేసుకుంటారట. ‘‘నాన్నగారి లైఫ్ గురించి తన ప్రతి అభిమానికి తెలియాలి. అందుకే ఈ డాక్యుమెంటరీ. మా టీమ్ అందరితో నాన్నగారు ప్రయాణిస్తారు. తన ప్రతి జ్ఞాపకాలను చూపిస్తారు. వాటిని షూట్ చేస్తాం. నాన్నగారితో పని చేసిన అందర్నీ ఇంటర్వ్యూ చేయనున్నాం. నాన్నగారి సుదీర్ఘ ప్రయాణం గ్రేట్. నాన్నగారికి హ్యాట్సాఫ్’’ అని పేర్కొన్నారు సన్నీ డియోల్. -
బయోపిక్ వద్దు
ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరూ బయోపిక్స్ బాట పట్టారు. ఆడియన్స్ కూడా పాత తరం యాక్టర్స్ మీద బయోపిక్ చూడాలనుకుంటున్నారు. మరి మీ బయోపిక్‌ను మీరు చూడాలనుకుంటున్నారా? అని ధర్మేంద్రని అడగ్గా– ‘‘లేదు లేదు. నాకు బయోపిక్ వద్దు. గట్టిగా మాట్లాడితే నేను ఇప్పటి వరకు నా బయోగ్రఫీనే రాయలేదు. నా తోటి యాక్టర్స్ కొందరు నాలుగైదు పుస్తకాలు రాసేశారు కూడా. ప్రస్తుతం నాకైతే బయోపిక్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పటివరకూ చేసిన జర్నీల తాలూకు ఎక్స్పీరియన్స్ నుంచి ఓ బుక్ రాస్తానేమో. ఎప్పుడైనా పాత ఫొటోలు (స్ట్రగ్లింగ్ యాక్టర్‌గా ఉన్నప్పటివి) చూసుకుంటే ఫొటోలో ఉన్న నన్ను చూసుకుంటూ నేను ‘నువ్వు హీరో అయ్యావు’ అనుకుంటాను’’ అని పేర్కొన్నారు. -
డేట్ మారింది
ఈ ఏడాది ఆగస్టు 15కు బాక్సాఫీస్ వద్ద అక్షయ్‌కుమార్ ‘గోల్డ్’, జాన్ అబ్రహాం ‘సత్యమేవ జయతే’, ధర్మేంద్రల ‘యామ్లా పాగ్లా దీవానా ఫిర్ సే’ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. కానీ ఇప్పుడు ‘యామ్లా పాగ్లా దీవానా..’ చిత్రబృందం తమ నిర్ణయాన్ని మార్చుకుని సినిమాను ఆగస్టు 31కి వాయిదా వేసుకున్నట్లు బీటౌన్ టాక్. ‘గోల్డ్, సత్యమేవ జయతే’ రెండూ దేశభక్తికి సంబంధించిన చిత్రాలే కావడం ఇందుకు కారణమట. నవనీత్‌సింగ్ దర్శకత్వంలో తండ్రీకొడుకులు ధర్మేంద్ర, సన్నీ డియోల్, బాబీ డియోల్ ముఖ్య తారలుగా రూపొందిన ‘యామ్లా పాగ్లా దీవానా ఫిర్ సే’ కామెడీ జానర్ మూవీ. రెండు దేశభక్తి చిత్రాలతో కామెడీ జానర్ మూవీ ఎందుకు? అని విడుదలను వాయిదా వేసుకున్నారట. ఈ ప్రాంచైజీలో వచ్చిన తొలిపార్ట్‌కు సమీర్ కార్నిక్ దర్శకత్వం వహించగా, రెండో పార్ట్‌కు సంగీత్ శివన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. -
జిమ్‌కి వెళ్లేవాణ్నే కాదు
యాక్టర్స్ ఫిట్‌గా ఉండటానికి గంటల తరబడి జిమ్‌లో టైమ్ స్పెండ్ చేస్తుంటారు. కష్టతరమైన వర్కౌట్స్ చేస్తూ ఫిట్‌గా ఉంటుంటారు. కానీ, నా యంగర్ డేస్‌లో ఎప్పుడూ జిమ్‌కి వెళ్లలేదు అంటున్నారు బాలీవుడ్ ‘యాక్షన్ కింగ్’ ధర్మేంద్ర. జిమ్‌కు వెళ్లకుండా కూడా ఫిట్‌గా ఉండగలిగిన సీక్రెట్ షేర్ చేస్తూ –‘‘పొలమే నా జిమ్. నా యంగ్ డేస్‌లో జిమ్‌కు ఎప్పుడూ వెళ్లలేదు. పొలాన్ని దున్నడం, బావిలో నుంచి నీళ్లు తోడటం వంటి పనులు చేస్తుండేవాణì్న. అలాంటి వర్కౌట్సే బెస్ట్ వర్కౌట్స్. మనల్ని ఫిట్‌గా ఉంచుతాయి’’ అని పేర్కొన్నారు ధర్మేంద్ర. -
సవతి కొడుకు గురించి హేమ మాలిని
సాక్షి, సినిమా : బాలీవుడ్ లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలియని వారుండరేమో. మొదటి భార్య ప్రకాశ్ కౌర్ ఉండగానే నటి హేమ మాలినిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే మతం మారి మరి ఆయన హేమను వివాహం చేసుకున్నారంటూ అప్పట్లో ఆయనపై విమర్శలు వెలువెత్తాయి. అదంతా ట్రాష్ అంటూ వాటిని ధర్మేంద్ర ఖండించారు కూడా. ఇదిలా ఉంటే మొదటి భార్య కుమారులైన సన్నీ, బాబీ డియోల్‌లు.. హేమ మాలిని-ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ కనిపించరు. అసలు వీరు కలవటం అనేది కూడా చాలా అరుదనే చెప్పుకోవాలి. కానీ, గ్యాప్ గురించి బాలీవుడ్లో కథలు కథలుగా చెప్పుకుంటుంటారు కూడా. అయితే ఫస్ట్ టైమ్ ధర్మేంద్ర మొదటి భార్య పిల్లల గురించి హేమ మాలిని ఓపెన్ అయ్యారు. వారితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె స్వయంగా చెప్పారు. ప్రముఖ రచయిత రాజ్ కమల్ ముఖర్జీ రచించిన ఆమె ఆత్మకథ హేమా మాలిని : బియాండ్ ది డ్రీమ్ గర్ల్ పుసక్త ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మా మధ్య బంధం ఎంతో అందమైంది. ముఖ్యంగా నాకు ఎప్పుడు ఏం సాయం కావాలన్న ధర్మేంద్రతోపాటు సన్నీ కూడా ముందుంటాడు’’ అని ఆమె చెప్పారు. 2005లో రాజస్థాన్‌లో ఆమెకు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హేమను ముందుగా పరామర్శించటంతోపాటు.. తోడుగా సన్నీ డియోల్ నిలిచాడంట. ఆమె వెంటే ఉండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకున్నాడని ఆమె చెప్పారు. ఇక ఈ పుస్తకావిష్కరణ సభకు సన్నీడియోల్ రాకపోయినప్పటికీ.. రమేష్ సిప్పీ, జూహి చావ్లా,సుభాష్ ఘాయ్, నటి దీపికా పదుకునే, మాలిని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. -
పంట నష్టంతో రైతు ఆత్మహత్య
జూపాడుబంగ్లా: కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం తూడిచెర్ల గ్రామంలో అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన ధర్మేంద్ర నాయుడు (౩౦) గతంలో మినుములు పంట వేస్తే నష్టం వచ్చింది. దాంతో ఈ సారి వరి పంట వేయగా నీళ్లు లేక పంట ఎండి పోయింది. దీంతో ఈసారి కూడా నష్టాలు తప్పవనే దిగులుతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఆస్పత్రి పాలైన సీనియర్ నటుడు
ముంబై: అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో, అబితాబ్ బచ్చన్‌తో కలిసి 'షోలే' లాంటి సూపర్‌హిట్ సినిమాలో నటించిన ధర్మేంద్ర (81) అస్వస్థతకు గురయ్యారు. జీర్ణకోశ (గ్యాస్ట్రోఎంటెరిటిస్) సమస్యతో బాధపడుతున్న ఆయనను వెంటనే ముంబైలోని నానావతికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీజేపీ ఎంపీ హేమామాలిని ధర్మేంద్రకు సతీమణి. 70వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మాస్ హీరోగా ధర్మేంద్ర అలరించాడు. 1975లో వచ్చిన 'షోలే' సినిమాలో ధర్మేంద్ర కెరీర్లో మేలిమలుపుగా నిలిచిపోయింది. ధర్మేంద్ర ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, రెండురోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేస్తామని ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ విశేష్ అగర్వాల్ తెలిపారు. -
నాకు హీరోయిన్గా జయ నటించారు
ముంబై: జయలలిత మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు ధర్మేంద్ర అన్నారు. ఇజ్జత్ సినిమాలో జయలలిత, తాను కలసి నటించామని నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని విన్నానని, కోలుకోవాలని ప్రార్థించానని, ఇంతలోనే ఆమె మరణవార్త తనను కలచివేసిందని చెప్పారు. జయలలిత మృతి పట్ల సంతాపం ప్రకటించారు. జయలలిత, ధర్మేంద్ర కలసి నటించిన ఇజ్జత్ సినిమా 1968లో విడుదలైంది. హిందీలో జయలలిత నటించిన తొలి సినిమా ఇదే. ఈ సినిమాలో ధర్మేంద్ర ప్రియురాలి పాత్రలో ఆమె నటించారు. టీ ప్రకాశ్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. -
ఎంసెట్ లీకేజీలో కొత్త పేరు
► 2005 ఎయిమ్స్ ప్రశ్నపత్రం లీకు వీరుడు ధర్మకూ పాత్ర ► గాలిస్తున్న మూడు ప్రత్యేక బృందాలు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ కుంభకోణంలో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ధర్మ అలియాస్ ధర్మేంద్ర అనే వ్యక్తికి ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ధర్మ గతంలో పలు ప్రశ్నపత్రాల లీకేజీల్లో భాగస్వామిగా ఉన్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా 2005లో ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా ఎంసెట్ లీకేజీలోనూ కీలకపాత్ర పోషించినట్లు సీఐడీకి ఆధారాలు లభ్యమయ్యాయి. కీలక బ్రోకర్లు గుడ్డూ, ఇక్బాల్, రాజగోపాల్‌రెడ్డి, రాజేశ్‌లతో ధర్మ తరచూ ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ధర్మను అదుపులోకి తీసుకుంటే ఎంసెట్ లీకేజీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ధర్మను పట్టుకొనేందుకు మూడు ప్రత్యేక బృందాలు ఢిల్లీ, ముంబై, చండీగఢ్‌లలో గాలిస్తున్నాయి. ముకుల్‌జైన్ అరెస్టు ఇక ఈ కుంభకోణంలో ఢిల్లీకి చెందిన బ్రోకర్ ముకుల్ జైన్‌ను సీఐడీ అరెస్టు చేసింది. అతను సబ్ బ్రోకర్లు చంద్రశేఖర్‌రెడ్డి, రాజేశ్, షకీరాల ద్వారా ఆరుగురు విద్యార్థులకు కోల్‌కతాలో శిక్షణ ఇప్పించినట్లు విచారణలో వెలుగు చూసింది. అయితే కోల్‌కతాలోని ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని మరో బ్రోకర్ మోహిత్ కుమార్ సింగ్ నిర్వహించినట్లు గుర్తించింది. అతడిని కూడా అదుపులోకి తీసుకునేందుకు సీఐడీ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. -
సీనియర్ హీరోలకు మెగాస్టార్ విషెష్
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. సినీ పరిశ్రమలోని తన స్నేహితులు, సీనియర్ హీరోలు ధర్మేంద్ర, శత్రుఘ్న సిన్హాలకు శుభాకాంక్షలు చెప్పారు. ధర్మేంద్ర, సిన్హాలతో అమితాబ్ కలిసున్న ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ 73 ఏళ్ల అమితాబ్ ట్వీట్ చేశారు. అమితాబ్, ధర్మేంద్ర (80) 1975లో బ్లాక్ బస్టర్ సినిమా షోలేలో కలసి నటించారు. ఈ సినిమాల్లో వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటించారు. ఈ సినిమా గురించి అమితాబ్ ప్రస్తావిస్తూ కొన్ని సంఘటనలు ఎప్పటికీ మధురంగా ఉంటాయి అంటూ, షోలేలోని ధర్మేంద్ర స్టిల్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే అమితాబ్, శత్రుఘ్న సిన్హాలు దోస్తానా సినిమాలో నటించారు. -
'హేమ నా ఇంటికి దగ్గరే.. కానీ కలుసుకోలేదు'
ముంబయి: దాదాపు 40 ఏళ్ల తరువాత.. అలనాటి సూపర్ డూపర్ హిట్ బాలీవుడ్ చిత్రం 'షోలే' తారాగణమంతా ఒకే వేదికపై తళుక్కుమన్నారు. వారందరినీ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఏకం చేసింది. హేమమాలిని తొలి సంగీత ఆల్బమ్ 'డ్రీమ్ గర్ల్' ఆవిష్కరణ వారంతా ఒక వేదికపైకి రావడానికి అవకాశం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, చిత్ర దర్శకుడు రమేశ్ సిప్పీ తదితరులు హాజరయ్యారు. '40 ఏళ్ల తరువాత హేమామాలిని మ్యూజిక్ ఆల్బమ్ షోలే చిత్ర సభ్యులను ఒకే చట్రంలోకి తీసుకొచ్చింది' అని అమితాబ్ మంగళవారం తన బ్లాగులో పోస్ట్ చేశారు. 'మా జట్టులోని సంజీవ్ కుమార్, అంజాద్ ఖాన్ మన మధ్యలో లేరు. సమయం ఎవరి కోసం ఆగదు. కానీ ఆ ఎదురుచూపులను గుర్తిస్తుంది. ధర్మేంద్ర, హేమమాలిని మా ఇంటికి దగ్గర్లోనే ఉంటారు. కానీ మేం ఎప్పుడూ కలుసుకోలేదు. ఈ కార్యక్రమంలో ఇలా కలుసుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది' అని అమితాబ్ అన్నారు. ఈ ఆల్బమ్‌లోని 'అజీ సునియే జరా' అనే పాటను సంగీత దర్శకుడు బాబుల్ సుప్రియోతో కలిసి హేమమాలిని పాడింది. ఈ పాటలోని బిగ్ బిసే లేకే పాజి అనే పదాలు అమితాబ్, ధర్మేంద్రలను సూచిస్తాయి. 'కళలు, వినోదాలే నన్ను నడిపిస్తున్నాయి. అవి నాలో కలిసిపోయాయి. గతంలో నా గాన ప్రతిభను పరీక్షించుకోలేదు. ఇప్పుడు వినిపించేందుకు ఆత్రుతతో ఉన్నాను. గతంలోమాదిరిగానే ఈసారీ ఆదరిస్తారని భావిస్తున్నాను' అని హేమమాలిని అన్నారు. 1973లో కిశోర్ కుమార్‌ను చూసి స్ఫూర్తి పొందిన హేమ అప్పటి నుంచి సంగీత ఆల్బమ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
డిసెంబర్ 8న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ధర్మేంద్ర (నటుడు), షర్మిలా ఠాగూర్ (నటి నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యసంబంధ సంఖ్య కావడం వల్ల స్వతస్సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు, జీవితంలో పైకి రావాలనే కోరిక బలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. పెద్దలతో, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి, వాటిని తమ ఉన్నతికి ఉపయోగించుకుంటారు. అవివాహితులకు వివాహం అవుతుంది. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. అధికారుల సహకారంతో, పట్టుదలతో అనుకున్న పనులన్నింటినీ అవలీలగా సాధిస్తారు. ఇల్లు, ఆస్తులు కొనుక్కోవాలనే కోరిక తీరుతుంది. వీరు పుట్టిన తేదీ 8 శనికి సంబంధించిన సంఖ్య కాబట్టి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు ఒక గాడిన పడతాయి. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. సామాజిక పరమైన ఉన్నతి, గుర్తింపు లభిస్తాయి. నష్టాలలో ఉన్న వ్యాపారాలు, పరిశ్రమల వంటివి లాభాల బాట పడతాయి. పాతస్నేహాలు, పాత బంధుత్వాలు తిరిగి కలుస్తాయి. లక్కీ నంబర్స్: 1,3, 5,6,8; లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, శుక్ర, శనివారాలు; లక్కీ కలర్స్: రోజ్, బ్లూ, బ్లాక్, ఎల్లో, సిల్వర్, గోల్డెన్. సూచనలు: రుద్రాభిషేకం చేయించుకోవడం, ఆదిత్య హృదయం పఠించడం, తండ్రిని, తత్సమానులను గౌరవించడం, తోబుట్టువులను ఆదరించడం, వికలాంగులకు సహాయం చేయడం, శనికి తైలాభిషేకం, కాకులకు,శునకాలకు ఆహారం పెట్టడం, మంచిది - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
ధర్మేంద్ర సోదరుడు మృతి
ముంబై : బాలీవుడ్ హీరో అభయ్ డియోల్ తండ్రి, ప్రముఖ నటుడు ధర్మేంద్ర సోదరుడు.. అజిత్ సింగ్ డియోల్ శుక్రవారం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అజిత్ కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం అజిత్ తుది శ్వాస విడిచారు. శనివారం ఉదయం ముంబై నగర శివారులోని పవన్ హన్స్‌లోని అంత్యక్రియలు జరిపినట్లు చెప్పారు. అజిత్ నటుడు, దర్శకుడిగా పలు పంజాబీ, హిందీ చిత్రాలు తీశారు. అలాగే పలు చిత్రాలలో ఆయన నటించారు. -
ది బర్నింగ్ ట్రైన్....
బి.ఆర్.చోప్రా కొడుకు రవిచోప్రా భారీగా తీసిన సినిమా ఇది. ఇంత భారీగా తీయడం వెనుక ‘షోలే’ ఘన విజయం ఉంది. 1975లో విడుదలైన షోలే సృష్టించిన కలెక్షన్లు అసామాన్యమైనవి. దీంతో రవి చోప్రా కూడా చాలా ఖర్చు పెట్టి భారీ హంగామాతో సినిమా తీసి హిట్ కొట్టాలనుకుని ఈ కథ తీశాడు. ఢిల్లీ నుంచి ముంబైకి వెళుతున్న కొత్త రైలు ‘సూపర్ ఎక్స్‌ప్రెస్’ అగ్ని ప్రమాదానికి గురైతే అందరూ కలిసి దానిని ఎలా ఆపారు, ప్రయాణికులను ఎలా రక్షించారు అనేది కథ. ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, జితేంద్ర, పర్విన్బాబీ, హేమమాలిని, నీతూ సింగ్ ఇంత మంది హేమాహేమీలు ఈ సినిమాలో నటించారు. డానీ విలన్. 1980 మార్చిలో విడుదలైంది. ఓపెనింగ్స్ భారీగా వచ్చినా చాలా తొందరగా కలెక్షన్లు పడిపోయాయి. షోలేలో ఉన్న కథ, మానవోద్వేగాలు, విలన్ ఇందులో అంత గట్టిగా లేకపోవడం కథ రైలు వరకే కుదించుకోవడం ప్రేక్షకులకు నచ్చలేదు. కాని టెక్నికల్‌గా సినిమా మంచి ప్రమాణాలు అందుకుంది. ఇందులో రఫీ ఖవాలి (సాహిర్ రచన) ‘పల్ దో పల్ కా సాథ్ హమారా... పల్ దో పల్ కే యారానే హై’ పెద్ద హిట్. ఈ సినిమాకు సంబంధించి ఈ పాటే మిగిలింది. -
'మా అబ్బాయిలతో కలిసి నటించాలని ఉంది'
న్యూఢిల్లీ : తన కుమారులతో కలిసి నటించాలని ఉందని బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర అన్నాడు. మంచి కథ దొరికితే తన కుమారులతో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. సన్నీడియోల్, బాబీడియోల్లు ధర్మేంద్ర మొదటి భార్య సంతానం అన్న విషయం అందరికి విదితమే.గతంలో వీరు ముగ్గురి కలయికలో అప్నే, యమ్లా పగ్లా దీవానా చిత్రాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో మరో మూవీ చేయాలని వెటరన్ నటుడు, షోలే సూపర్ స్టార్ ధర్మేంద్ర ఉవ్విళ్లూరుతున్నాడు. తొలి రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ, యమ్లా పగ్లా దీవానా సీక్వెల్ ఫ్లాప్ అవడంతో మళ్లీ ఈ ముగ్గురి కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. ధరమ్ ఘరమ్ అనే ఓ స్టార్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. సన్నీ, బాబీలతో కలిసి మరోసారి వెండితెరపై కనిపించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. కానీ ఓ మంచి స్క్రిప్ట్ దొరికితే ఈ తండ్రీకొడుకులను మరోసారి సిల్వర్స్ర్ర్కీన్పై అభిమానులను కనువిందు చేస్తామన్నాడు. యాక్టింగ్ కింగ్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ధర్మేంద్ర 1960లలో బాలీవుడ్లో తన ప్రస్థానం ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఎదిగినా తనను తాను ఎప్పుడు ఓ స్టార్ అని భావించనని 'షోలే' సూపర్ స్టార్ మరిన్ని ముచ్చట్లను అభిమానులతో పంచుకున్నాడు. -
ఆడవాళ్లు అలానే బావుంటారట!
ముంబై: 'సెకండ్ హ్యాండ్ హజ్బెండ్' సినిమాతో బాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన హీరో ధర్మేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల అందం గోప్యంగా ఉంటేనే బాగుంటుందట. 'టూ మచ్' ఓపెన్‌గా ఉండడం అనేది కొంతకాలం తర్వాత బోర్ కొడుతుందనీ, రహస్యంగా ఉంటేనే బాగుంటుందన్నారు. చక్కగా బొట్టు పెట్టుకుని, నిండా ముసుగు కప్పుకొని ఉంటే ఆడవాళ్ల అందం మరింత ఇనుమడిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వెనుకటి తరం హీరోయిన్లు పొడుగు జాకెట్లతో పూర్తిగా శరీరాన్ని కవర్ చేసేలా, నిండుగా ఉండేవారని పేర్కొన్నారు. ఇపుడు పరిస్థితులు మారిపోయాయన్నారు. అంతమాత్రాన ప్రస్తుత ట్రెండ్‌ను తాను విమర్శించడం లేదని.. తాను ఎవరినీ తప్పుబట్టడం లేదంటూ సమర్థించుకున్నారు. అయితే ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. జూలై 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తన సినిమా ముచ్చట్లను మీడియాతో పంచుకున్న ధర్మేంద్ర ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వగలాడి భర్తను రెడ్ హ్యాండెడ్‌గా బుక్ చేసే కథాంశంతో రూపొందిన సెకండ్ హ్యాండ్ హజ్బెండ్ మంచి సినిమా అవుతుందన్నారు. అసభ్యతకు తావు లేకుండా సినిమాను నిర్మించామంటూ చెప్పుకొచ్చారు. హిందీలో అనేక యాక్షన్, థ్రిల్లర్ సినిమాల్లో కథానాయకుడిగా నటించిన ధర్మేంద్ర ... అలనాటి హీరోయిన్ హేమమాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. -
ఆయన లాగే... అప్పటి దాకా..!
‘‘అభిమానులు, ఇతర ప్రేక్షకులు, మీడియావాళ్లు నా మీద చూపిన అభిమానానికి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నా ఆరోగ్యం గురించి వాళ్లు పడిన ఆందోళన చూసి, ఉద్వేగానికి గురయ్యా’’ అని అలనాటి హిందీ హీరో ధర్మేంద్ర అన్నారు. ఏంటీ? ధర్మేంద్ర అనగానే ‘షోలో’ గుర్తొస్తోందా? ఆ జ్ఞాపకాలను కాసేపు పక్కనపెట్టి, ఇటీవల ధర్మేంద్ర తాజా ఆరోగ్య పరిస్థితి గురించి చాలామంది కలవరపడ్డారు. కానీ, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదనీ, ‘ఐయామ్ ఫైన్’ అని ధర్మేంద్ర ప్రకటించారు. ‘‘మూడు నెలల క్రితం ఓ చిత్రం షూటింగ్లో షాట్ గ్యాప్‌లో వ్యానిటీ వ్యాన్‌లో రిలాక్స్ కావాలనుకుని, ఎక్కబోయా. స్లిప్ అయ్యి, కిందపడ్డాను. అప్పుడు కుడి భుజం దగ్గర నొప్పిగా అనిపించింది. అది సామాన్యమైన నొప్పి కాదనీ, శస్త్ర చికిత్స అవసరం అనీ తెలుసుకున్నా. కానీ, అప్పుడు కుదరలేదు. ఇక, ఇటీవల బ్లడ్‌లో హెమోగ్లోబిన్ తగ్గడంతో ఆస్పత్రిలో చేరాను. రెండు రోజులు చెకప్స్ జరిగాయి. అనంతరం డిశ్చార్జ్ అయ్యాను. ఇప్పుడు బాగానే ఉన్నాను. పస్తుతం ‘సెకండ్ హ్యాండ్ హజ్బండ్’ అనే చిత్రంలో నటిస్తున్నా. త్వరలో నా పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నా. ఆ తర్వాత వీలు చేసుకుని, కుడి చేతికి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నా’’ అన్నారు. సినిమాల్లోకి రావాలనుకోవడానికి నటుడు దిలీప్ కుమార్ ఆదర్శమనే ధర్మేంద్ర హాలీవుడ్ నటుడు, దర్శక, నిర్మాత క్లింట్ ఈస్ట్‌వుడ్ 105 ఏళ్ల వయసు వరకూ పని చేస్తానని ఓ సందర్భంలో అన్నారనీ, తానూ ఆయనను అనుసరించాలనుకుంటున్నాననీ చెప్పారు. -
ఐదు కోట్లకు తగ్గేది లేదు: సోనమ్ కపూర్
మూవీ బజ్: ‘భాగ్ మిల్కా భాగ్’, ‘రాన్‌ఝానా’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో అభిమానులకు చేరువైన సోనమ్ కపూర్ తన పారితోషికాన్ని అమాంతం ఐదు కోట్లకు పెంచేసింది. ప్రస్తుతం కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన సూరజ్ బర్జాత్యా రూపొందిస్తున్న ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రంలో నటిస్తున్న సోనమ్, సినిమాలకు సంతకం చేయాలంటే ఐదు కోట్లకు తగ్గేది లేదని కరాఖండిగా చెబుతోందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఎవరికైనా కష్టమే తెరపై సన్నిహితంగా కనిపించే శృంగార సన్నివేశాల్లో నటించడం నటీనటులెవరికైనా కష్టమేనని రిచా ఛద్దా చెబుతోంది. నిఖిల్ ద్వివేదీతో కలసి త్వరలోనే విడుదల కానున్న ‘తమాషే’ చిత్రంలో హాట్‌హాట్ సన్నివేశాల్లో నటించిన రిచా, మీడియాతో తన అనుభవాల్ని పంచుకుంది. చుట్టూ జనం ఉండగా, ఫ్రేమ్ తర్వాత ఫ్రేమ్‌గా చిత్రించే ఈ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టమని, అంతకంటే స్టంట్ సన్నివేశాల్లో నటించడమే తేలికని అంటోంది. అత్యుత్తమ ‘తెర’మైత్రి షోలే చిత్రంలో జయ్ (అమితాబ్ బచ్చన్), వీరూ (ధర్మేంద్ర)లదే అత్యుత్తమ తెర మైత్రి అని ఒక తాజా సర్వేలో తేలింది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక మాట్రిమోనియల్ వెబ్సైట్ ఈ సర్వేను నిర్వహించింది. సర్వేలో 4,700 మంది మహిళలు పాల్గొనగా, వారిలో 39.1 శాతం మహిళలు జయ్, వీరూ మైత్రికే ఓటేశారు. ‘కుఛ్ కుఛ్ హోతా హై’లో అంజలి (కాజోల్), రాహుల్ (షారుక్ ఖాన్) మైత్రి 33.8 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. -
ప్రచారంలో హేమామాలినికి పెళ్లి కష్టాలు!
మథుర: బీజేపీ అభ్యర్థి 'డ్రీమ్ గర్ల్' హేమామాలినికి మధుర నియోజకవర్గంలో సానుకూల పవనాలు వీస్తున్నా... గెలుపు కోసం చెమటోడ్చక తప్పడం లేదు. అయితే ఈ నియోజక పరిధిలో ప్రచారంలో దూసుకుపోతున్న హేమామాలినికి విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. ప్రచారంలో భాగంగా ఏ చోటుకెళ్లినా ధర్మేంద్ర ఎప్పుడొస్తున్నారని హేమామాలిని అడుగుతున్నారు. ప్రజల అభ్యర్థన మేరకు ధరమ్ జీని త్వరలోనే ప్రచారంలోకి దించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అయితే ధర్మేంద్ర ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని.. బీఎస్పీ అభ్యర్థి యోగేంద్ర ద్వివేదికి ప్రచారం నిర్వహిస్తున్న రామ్ ధార్ అనే కార్యకర్త అంటున్నారు. ప్రచారంలో ధర్మేంద్ర పాల్గొంటే.. హేమామాలినితో వివాహ సంబంధంపై నిలదీస్తామన్నారు. హేమామాలినితో ఉన్న సంబంధమేమిటనే ప్రశ్నకు ధర్మేంద్ర సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. అందుకే హేమామాలిని ప్రచారంలో ధర్మేంద్ర పాల్గొనడానికి వెనకడుగు వేస్తున్నారని చేస్తున్న ప్రచారాన్ని సినీ దర్శకుడు అనిల్ శర్మ ఖండించారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరికావని.. ధర్మేంద్ర సోమవారం నుంచి ప్రచారంలో పాల్గొంటారని అనిల్ శర్మ తెలిపారు. ఇదిలా ఉండగా తల్లి హేమామాలినికి కూతుళ్లు ఇషా, అహానాలు గ్రామీణ ప్రాంతాల్లో కలుసుకుని తల్లి విజయానికి కృష్టి చేస్తున్నారు. జాట్ కులస్థులు ఎక్కువగా ఉన్న మథుర నియోజకవర్గంలో 'డ్రీమ్ గర్ల్' కు రాష్రీయ లోక్ దళ్ అభ్యర్థి జయంత్ చౌదరీ గట్టిపోటీనిస్తున్నారు. -
సతుల కోసం బాలీవుడ్ పతుల పాట్లు
పలువురు బాలీవుడ్ నటీమణులు ఈసారి ఎన్నికల బరిలో ఉండటంతో వాళ్ల పతులకు ఎన్నికల పాట్లు తప్పడం లేదు. ఇప్పటికే కిరణ్ ఖేర్ తరఫున ఆమె భర్త అనుపమ్ ఖేర్ ప్రచారపర్వంలో తలమునకలుగా ఉన్నారు. చండీగఢ్ నుంచి కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ మీద కిరణ్ ఖేర్ బీజేపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే స్థానం నుంచి మరో బాలీవుడ్ నటి గుల్ పనగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రంగంలో ఉన్నారు. కిరణ్ తరఫున బాలీవుడ్ అగ్రనటుడు అనుపమ్ ఖేర్ కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఇందుకోసం ఆయన దాదాపు నెల రోజుల పాటు తన సినిమా షూటింగులన్నీ రద్దు చేసుకున్నారు కూడా. ఇక మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని మథుర స్థానం నుంచి పోటీ చేస్తున్న అలనాటి కలల సుందరి హేమమాలిని కూడా తన భర్తను ప్రచార బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హేమమాలిని భర్త, ఒకప్పటి టాప్ హీరో ధర్మేంద్ర వచ్చే వారం నుంచి ప్రచారపర్వంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హేమమాలినే ప్రకటించారు. ఇటీవలి కాలంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా హేమమాలినికి మద్దతుగా రావట్లేదంటూ ఇతర పార్టీల నాయకులు విమర్శలు గుప్పించడంతో ఆమె ఒకింత నొచ్చుకున్నారు. పెద్దకూతురు ఈషా డియోల్ ఇప్పటికే ప్రచారంలో అక్కడక్కడ పాల్గొంటుండగా, చిన్నకూతురు అహానా కూడా ప్రచారం చేసింది. ధరమ్జీ మరికొన్ని రోజుల్లో వస్తారని హేమ మాలిని చెప్పారు. అయినా జనం తన కుటుంబం గురించి ఎందుకు అడుగుతారో అర్థం కాదని, తన అల్లుళ్లు, వియ్యపురాళ్లు కూడా ప్రచారానికి వస్తామని చెప్పారని.. అయితే వాళ్లను ఎవరూ గుర్తుపట్టరు కాబట్టి వద్దన్నానని ఆమె అన్నారు. -
అహనా డియోల్ పెళ్లిసందడి
-
సోదరి వివాహానికి బాబీ, సన్నీడియోల్ దూరం!
సోదరి ఇషా డియోల్ పెళ్లికి గైర్హాజరైన సన్నీ, బాబీ డియోల్ లు అహనా పెళ్లికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలనాటి బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, ప్రకాశ్జీల సంతానం సన్నీ, బాబీ డియోల్ కాగా, ధర్మేంద్ర రెండవ భార్య సినీనటి హేమమాలినిలకు ఇషా, అహనా డియోలు ఇద్దరు కూతుళ్లు. ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్న కారణంగా 2012 లో జరిగిన ఇషా డియోల్ వివాహానికి హాజరుకాలేదు. అయితే అహనా పెళ్లికి హాజరుకాకపోవడం వెనుక ఎలాంటి కారణాలు లేవని సన్నిహితులు వెల్లడించారు. ఇషా, అహనా, బాబీ, సన్నీ డియోల మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయన్నారు. అహనా పెళ్లి కార్యక్రమంలో భాగంగా గురువారం జరిగిన మెహందీ వేడుకలో ఇషా డియోల్ జారి కింద పడిపోవడంతో ఆమె భుజానికి స్వల్పంగా గాయమైంది. చేతికి ఉన్న కట్టుతోనే వివాహ వేడుకల్లో ఇషా హడావిడి చేస్తోంది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ వోరా తో అహనా వివాహం ఆదివారం సాయంత్రం ముంబైలోని ఐటీసీ మరాఠాలో జరుగనుంది. ఈ వివాహానికి బాలీవుడ్ కు చెందిన షారుక్ ఖాన్ తోపాటు పలువురు తారలు, రాజకీయ నేతల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, రాజ్ థాకరేలు హాజరుకానున్నారు. -
దిలీప్ కుమార్ పుట్టినరోజు వేడుకలు
-
హాస్టల్ నుంచి ఐదుగురు యువతుల అదృశ్యం
పెనమలూరు, న్యూస్‌లైన్ : పెనమలూరులోని అనాథ బాలికల హాస్టల్ నుంచి ఐదుగురు యువతులు ఆదివారం వేకువజామున అదృశ్యం కావడంతో కలకలం రేగింది. తొలుత పోలీసులు ఈ ఘటనను అత్యంత గోప్యంగా ఉంచి విచారణ చేసినా.. ఆదివారం రాత్రికి యజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీఐ ధర్మేంద్ర తెలిపిన ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పెనమలూరు వంతెన వద్ద నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో నవీన ఫర్ గాళ్స్ హాస్టల్ ఉంది. దీనిలో మొత్తం 19మంది అనాథ యువతులు ఉంటున్నారు. వీరికి నవజీవన్ బాలభవన్ యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. శనివారం రాత్రి ఈ యువతులు భోజనాల అనంతరం నిద్ర పోయారు. వేకువజామున మూడు గంటల ప్రాంతంలో ఎస్.లక్ష్మి, కె.కావ్యలు బాత్రూమ్కు వెళ్లటానికి లేవగా నెట్‌వాచ్‌ఉమెన్ మేరీ తాళాలు తీసింది. బాత్రూమ్కు వెళ్లిన వారు తిరిగి రాగానే మళ్లీ తాళం వేసింది. అప్పటికి అందరూ ఉన్నారు. ఉదయం లేచి చూసేసరికి ఐదుగురు యువతులు అదృశ్యం కావడాన్ని వార్డెన్ గుర్తిం చారు. హాస్టల్లో రెండేళ్లుగా ఉంటున్న పరిటాలకు చెందిన ఎం.రమణ, కృష్ణలంకకు చెందిన ఎస్.లక్ష్మి, విజయవాడ శిఖామణి సెంటర్‌కు చెందిన ఎన్.గాయత్రి, రాజమండ్రికి చెందిన ఎం.సంతోషి, గుడివాడకు చెందిన కావ్య అదృశ్యమైనవారిలో ఉన్నారు. నిద్రలో ఉన్న వాచ్ఉమెన్ వద్ద నుంచి గప్‌చుప్‌గా తాళం తీసుకుని వారు పారిపోయి ఉంటారని వార్డెన్ భావిస్తున్నారు. వీరందరి వయస్సు 18-19 సంవత్సరాలే. వీరు విజయవాడలో చిన్నచిన్న ప్రైవేటు ఉద్యోగాలు, టైలరింగ్ వంటి పనులు చేస్తుంటారు. ఈ యువతుల అదృశ్యం విషయాన్ని హాస్టల్ యాజమాన్యానికి వార్డెన్, వాచ్మెన్ తెలిపారు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. హాస్టల్‌వద్ద భద్రత కరువు యువతులు ఉంటున్న ఈ వసతిగృహం వద్ద కనీస భద్రత కూడా లేదు. ఇక్కడ ఉండే యువతులందరూ పగలు వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ రాత్రివేళ హాస్టల్లో ఉంటున్నారు. ఈ యువతులు ఏం చేస్తారు, ఎక్కడకు వెళతారు తదితర అంశాలను ఆరా తీసేవారే లేరని సేకరించిన వివరాలను బట్టి తెలుస్తోంది. ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదని, రాత్రికి రాత్రే యువతులు అదృశ్యం కావడం దురదృష్టకరమని హాస్టల్వార్డెన్ రమాదేవి అన్నారు.


