సాక్షి, తాడేపల్లి: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మృతిపట్ల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రఖ్యాత నటుడు, పార్లమెంటేరియన్ అయిన ధర్మేంద్ర మరణం తనను ఎంతో కలచివేసిందని అన్నారాయన.
‘‘మంచి నటుడుగా, మంచి పార్లమెంటు సభ్యునిగా అయన ఎంతో కీర్తిని పొందారు. ఆయన తన జీవితంలో సరళత, మానవత్వం, ఆప్యాయత, ఉత్సాహం.. విలువలను ప్రతిబింబించారు. అలాంటి వ్యక్తి మృతి బాధ కలిగించింది. ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Deeply saddened to hear about the passing of the legendary Dharmendra ji. As a charismatic film hero and a Parliamentarian, he embodied simplicity, humanity, warmth, and energy.
My heartfelt condolences to his family. May God give them strength during this difficult time. Om… pic.twitter.com/W3xMxsZZk8— YS Jagan Mohan Reddy (@ysjagan) November 24, 2025


