సల్మాన్‌ ఒక గూండా, నీచుడు.. ఆ స్టార్‌ హీరో దర్శకుడిని చితకబాదాడు! | Filmmaker Abhinav Kashyap Recalled His Traumatic Experience Of Working With Salman Khan | Sakshi
Sakshi News home page

తండ్రితో అశ్లీల సన్నివేశం.. దర్శకుడిని చితకబాదిన బాలీవుడ్‌ హీరో

Sep 18 2025 6:02 PM | Updated on Sep 18 2025 6:40 PM

Filmmaker Abhinav Kashyap Recalled His Traumatic Experience Of Working With Salman Khan

బాలీవుడ్‌ వివాదాస్పద దర్శకుడు, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ హిందీ చలనచిత్ర పరిశ్రమకు గుడ్‌బై చెప్పేసి సౌత్‌కు షిఫ్ట్‌ అయిపోయాడు. అనురాగ్‌ సోదరుడు అభినవ్‌ కశ్యప్‌ (Abhinav Kashyap) కూడా దర్శకుడిగా హిందీలో రెండే రెండు సినిమాలు చేసి సైలెంట్‌ అయిపోయాడు. అవి దబాంగ్‌, బేషరం. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన దబాంగ్‌ మూవీ బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. దీనికి దబాంగ్‌ 2, 3 అంటూ రెండు సీక్వెల్స్‌ కూడా వచ్చాయి.

ధర్మేంద్రను తీసుకోవాలంటే భయం
వాటిలో సల్మాన్‌ (Salman Khan) హీరోయే కానీ దర్శకుడు మాత్రం మారిపోయాడు. అందుకు గల కారణాన్ని దర్శకుడు అభినవ్‌ తాజాగా బయటపెట్టాడు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. దబాంగ్‌ సినిమా ప్రారంభంలో అంతా బానే ఉంది. అందరం అనుకున్నట్లుగా అనుపమ్‌ ఖేర్‌, ఓం పురిని తీసుకున్నాం. కానీ, ధర్మేంద్రను సెలక్ట్‌ చేసుకోవాలంటే భయమేసింది. అందుకే ఆయనకు బదులుగా వినోద్‌ ఖన్నాను తీసుకున్నాను.

దర్శకుడిని చితకబాదిన హీరో
నిజానికి దబాంగ్‌ మూవీ చేయమని ధర్మేంద్రను కలిశాను. అందుకాయన.. బేటా, ముఖ్యమైన పాత్ర ఉంటేనే ఇవ్వు, లేదంటే వద్దు అని చెప్పాడు. దాంతో నాకు భయమేసింది. ఆయన ఎలాంటి పాత్ర ఆశిస్తున్నాడో అర్థం కాలేదు. ఎందుకంటే ధర్మేంద్రతో అసభ్య సన్నివేశం చిత్రీకరించినందుకుగానూ దర్శకుడు కాంతిషాపై హీరో సన్నీడియోల్‌ (Sunny Deol) చేయి చేసుకున్నాడని రూమర్లున్నాయి. ఏదైనా తేడా వస్తే గొడవ ఖాయం అని అర్థమై ధర్మేంద్రను పక్కనపెట్టాను. ఇక నేను ఏ నటుడితో మంతనాలు జరిపినా సల్మాన్‌ సోదరుడు సోహైల్‌ నా వెంటే వచ్చేవాడు.

తండ్రి ధర్మేంద్రతో బాలీవుడ్‌ స్టార్‌ సన్నీడియోల్‌

సల్మాన్‌ ఓ గూండా
తనే అందరి పారితోషికం గురించి చర్చలు జరిపాడు. వాళ్ల సూచనల ప్రకారమే యాక్టర్స్‌ను సెలక్ట్‌ చేసుకున్నా.. కానీ వారికి వ్యతిరేకంగా సోనూసూద్‌ను సినిమాలో తీసుకున్నా.. సోనూ ఫిజిక్‌ చూసి సల్మాన్‌ ఈర్ష్య పడేవాడు. అయినా సరే, వాళ్ల మాటను కాదని సోనూసూద్‌ను ఎంపిక చేసుకున్నాను. దబాంగ్‌ సినిమా ముందువరకు సల్మాన్‌ ఏంటో నాకు తెలీదు. కానీ, తర్వాత అర్థమైంది అతడో పెద్ద గూండా అని! అతడికి యాక్టింగ్‌ అంటే ఆసక్తి లేదు. సెలబ్రిటీ హోదాను మాత్రం ఇష్టపడేవాడు. అతడో నీచుడు, చెడ్డ వ్యక్తి అని అభినవ్‌ కశ్యప్‌ చెప్పుకొచ్చాడు.

డైరెక్టర్‌పై సన్నీడియోల్‌ ఆవేశం.. అసలు కథ
2017లో మిడ్‌డేలో వచ్చిన వార్తా కథనం ప్రకారం.. ధర్మేంద్ర స్టార్‌డమ్‌ కోల్పోయిన సమయంలో బీ గ్రేడ్‌, సీ గ్రేడ్‌ (తక్కువ బడ్జెట్‌, తక్కువ క్వాలిటీతో) సినిమాలు చేశారు. అందులో కొన్ని దర్శకనిర్మాత కాంతి షా తెరకెక్కించారు. అందులో ఓ సినిమాలో ధర్మేంద్రకు గుండెపోటు వచ్చినట్లుగా నటించమన్నాడు. కానీ దాన్ని ఎడిటింగ్‌లో పూర్తిగా మార్చేశాడు. బెడ్‌రూమ్‌ సన్నివేశాల్లో నటించినట్లుగా అశ్లీలంగా రీఎడిట్‌ చేశాడు. 

అశ్లీల సీన్‌లో ధర్మేంద్ర!
మొదటగా ఈ సినిమాను పంజాబ్‌లో రిలీజ్‌ చేశారు. ఎంతో పేరు ప్రఖ్యాతలున్న ధర్మేంద్ర ముసలితనంలో ఇలా ఓ అమ్మాయితో బెడ్‌పై కనిపించడం చూసి అభిమానులు షాకయ్యారు. దీంతో ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్‌ ఆ దర్శకుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఓ కథ గురించి చర్చించుకుందాం రమ్మని దర్శకుడు కాంతిని ఆఫీస్‌కు పిలిపించాడు. ఆ తర్వాత అతడిని దారుణంగా కొట్టాడు.

చదవండి: ఓటీటీలో సూపర్‌ హిట్‌ హారర్‌ సినిమా.. ఎక్కడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement