
ఓటీటీలో మలయాళ సినిమాలకున్న క్రేజే వేరు. అయితే ఈసారి లవ్‌స్టోరీకి బదులుగా ఓ కామెడీ హారర్ మూవీ ఓటీటీ (OTT)లోకి రానుంది. ఆ సినిమాయే సుమతి వలవు (Sumathi Valavu Movie). ఇందులో అర్జున్ అశోకన్, సైజు కురుప్, గోకుల్ సురేశ్, మాళవిక మనోజ్, బాలు వర్గీస్ ప్రధాన పాత్రలు పోషించారు. విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రం దాదాపు రూ.25 కోట్లు రాబట్టింది.
ఓటీటీలో హారర్ మూవీ
తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. సెప్టెంబర్ 26 నుంచి జీ5లో ప్రసారం కానుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సుమతి వలవు అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో హారర్, కామెడీతో పాటు మిస్టరీ, ఎమోషన్స్, థ్రిల్ కూడా ఉందని చిత్రయూనిట్ చెప్తోంది. ఐఎమ్‌డీబీలో ఈ సినిమా 7.7 రేటింగ్ దక్కించుకోవడం విశేషం. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు.
വരുന്നു, "സുമതി വളവ്". സെപ്റ്റംബർ 26 മുതൽ നമ്മുടെ ZEE5 മലയാളത്തിൽ#SumathiValavu Premieres 26th September on ZEE5#ArjunAshokan #SidharthBharathan #GokulSuresh #BaluVarghese #SaijuKurup #BobyKurian #MalavikaManoj #JoohiJu #SijaRoseGeorge #Shivada pic.twitter.com/NGNr99ihOA
— ZEE5 Malayalam (@zee5malayalam) September 18, 2025