ఈ వారం థియేటర్లలోకి 'అవతార్ 3' వచ్చింది. తొలి రెండు భాగాలతో పోలిస్తే ఇదేమంత కొత్తగా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. వీటిలో సంతాన ప్రాప్తిరస్తు, ప్రేమంటే, డొమినిక్ ద లేడీస్ పర్స్, మఫ్టీ పోలీస్, దివ్యదృష్టి చిత్రాలతో పాటు నయనం, ఫార్మా సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి.
(ఇదీ చదవండి: ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ రివ్యూ)
ఇప్పుడు తమిళ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. గత నెల 21న థియేటర్లలో రిలీజై హిట్ అయిన మూవీ 'మిడిల్ క్లాస్'. సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మునిష్ కాంత్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. విజయలక్ష‍్మీ ఇతడి సరసన నటించింది. మిడిల్ క్లాస్ కష్టాలపై దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడీ మూవీ వచ్చే బుధవారం (డిసెంబరు 24) నుంచి జీ5 ఓటీటీలోకి రానుంది.
'మిడిల్ క్లాస్' విషయానికొస్తే.. నిత్యం ఆర్థిక ఇబ్బందులు, నెల తిరిగేసరికి కట్టాల్సిన ఈఎంఐలు, బడ్జెట్ లెక్కలు.. ఇలా సగటు మధ్యతరగతి కష్టాలతో బాధపడే ఓ కుటుంబానికి.. తమ సమస్యలన్నీ ఒకేసారి తీరిపోయే అరుదైన అవకాశం వస్తుంది. మరి అప్పుడు ఆ ఫ్యామిలీ ఏం చేసింది? తర్వాత ఎదురైన పరిణామాలు ఏంటి? అనేదే మిగతా స్టోరీ. కిశోర్ రామలింగం దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ఎమోషనల్ చేస్తుంది. ఇప్పటికైతే తమిళ వెర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుందని చెప్పారు. త్వరలో తెలుగు డబ్బింగ్‌ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది.
(ఇదీ చదవండి: దురంధర్.. బాలీవుడ్‌కి ఓ ప్రమాద హెచ్చరిక!)


