నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ద ప్యారడైజ్'. వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలో రిలీజ్ చేయడమే టార్గెట్‌గా షూటింగ్ చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పుట్టినరోజు సందర్భంగా చిన్నపాటి మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు సడన్‌గా మూవీలో మరో పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి చిన్నపాటి షాకిచ్చారు.
'ద ప్యారడైజ్' మూవీలో నానితో పాటు మోహన్ బాబు నటిస్తున్నారు. హిందీ నటుడు రాఘవ్ జూయెల్ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇది తప్పితే మిగతా నటీనటుల గురించి పెద్దగా తెలీదు. ఇప్పుడు ఈ మూవీలో తెలుగు కమెడియన్ సంపూర్ణేశ్ బాబు కూడా ఉన్నట్లు బయటపెట్టారు. బిర్యానీ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.
సంపూ ఇప్పటివరకు కామెడీ సినిమాల్లో హీరోగా, సహాయ నటుడిగా చేశాడు. మధ్యలో ఓసారి బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాడు. గత కొన్నాళ్ల నుంచి అయితే కొత్త మూవీస్ ఏం చేస్తున్నట్లు లేదు. అలాంటిది ఇప్పుడు 'ప్యారడైజ్'లో మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది. పోస్టర్‌లో రక్తంతో తడిసిన చేయి, భుజంపై గొడ్డలి చూస్తుంటే అసలు ఇది సంపూర్ణేశ్ బాబుయేనా అని సందేహం రాకమానదు.
Meet @sampoornesh as 'BIRYANI' from #TheParadise ❤🔥
Jadal's closest friend and the epitome of loyalty 💥💥
Releasing in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam, Bengali, English, and Spanish.
Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An @anirudhofficial… pic.twitter.com/psohGvSkRm— SLV Cinemas (@SLVCinemasOffl) December 19, 2025


