పెద్ది మూవీపై చీప్‌ కామెంట్స్.. విశ్వక్ సేన్‌ ఫైర్..! | Tollywood Hero Vishwak Sen Reacts Comments On Peddi Movie | Sakshi
Sakshi News home page

Vishwak Sen: పెద్ది మూవీపై కామెంట్స్.. పరాన్నజీవులంటూ విశ్వక్ సేన్‌ ఆగ్రహం..!

Dec 19 2025 6:53 PM | Updated on Dec 19 2025 9:27 PM

Tollywood Hero Vishwak Sen Reacts Comments On Peddi Movie

సినిమా ఇండస్ట్రీలో కామెంట్స్ చేయడం ప్రతి ఒక్కడికీ అదో ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు పడితే మూవీలపై రివ్యూలు ఇస్తున్నారు. యూట్యూబ్‌ ఛానెల్ ఉన్న ప్రతి ఒక్కరూ తామేదో మేధావుల్లా ఫీలయి సినిమాలపై రివ్యూలు ఇచ్చేస్తున్నారు. సినిమా గురించి ఓనమాలు తెలియనివాళ్లు కూడా ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియాలో మాట్లాడేస్తున్నారు. టాలీవుడ్‌ చిత్రాలపై ఎలా పడితే అలా కామెంట్స్ చేసి చాలామంది తమ పబ్బం గడుపుకుంటున్నారు. అలాంటి యూట్యూబ్ రివ్యూవర్స్‌పై టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్‌ ఫైరయ్యారు. 

తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పెద్ది మూవీని ఉద్దేశించి కొందరు చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మండిపడ్డారు. ఇండస్ట్రీని ప్రయోజనం పొందుతూ కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లను పరాన్నజీవి అని పిలవడం సమంజసం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ ద్వారా తనతో పాటు కుటుంబాన్ని పోషించుకుంటూ.. ఒక సినిమా రిలీజ్‌ కాకముందే నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను చూస్తుంటే తాను తినే పళ్లెంలోనే ఉమ్మేసినట్లు ఉందని విశ్వక్ సేన్‌ ఫైరయ్యారు.

ఈ వీడియో ఓ వ్యక్తి రామ్ చరణ్ పెద్ది సినిమాను ఉద్దేశించి అవహేళన చేస్తూ మాట్లాడారు. పెద్ది మూవీ స్టోరీ మీకు తెలుసా? నాకు తెలుసంటూ దర్శకుడిని కించపరిచేలా కామెంట్స్‌ చేశారు. ఇలాంటి స్టోరీ సినిమాకు చికిరి చికిరీలు అవసరమా? అంటూ ఎగతాళి చేశాడు. ఇది చూసిన విశ్వక్ సేన్‌ తనదైన స్టైల్లో వీరికి ఇచ్చిపడేశాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement