బిందుమాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం దండోరా. ఈ మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సమాజంలో ప్రజల మధ్య అసమానతలను తెలియజేసే కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా క్రిస్‌మస్ కానుకగా థియేటర్లకు రానుంది.
మూవీ రిలీజ్ దగ్గర పడడంతో దండోరా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దండోరా టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు చైతూ. ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుల వివక్షను తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో 'కల్లు మత్తు కాదు కదా సార్.. రాత్రి తాగింది దిగడానికి.. కులం మత్తు.. అందుకే టైమ్ పట్టింది' అనే డైలాగ్ వింటే కథేంటో అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఈ చిత్రంలో శివాజీ, నందు, రవికృష్ణ, మణిక, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.
Happy to be launching the trailer of #Dhandoraahttps://t.co/sOuUJAUZlq
Rooted, raw and powerful this looks very promising
Wishing the entire team a huge success , looking forward to watching it .
In Cinemas from 25-12-25#DhandoraaOnDec25th@Afilmby_Murali… pic.twitter.com/7zL0X3WBpG— chaitanya akkineni (@chay_akkineni) December 19, 2025


