'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది | Dhurandhar 2 Movie Telugu Teaser | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Teaser: ఈసారి తెలుగులోనూ.. సీక్వెల్ టీజర్ రిలీజ్

Feb 3 2026 12:14 PM | Updated on Feb 3 2026 12:40 PM

Dhurandhar 2 Movie Telugu Teaser

గతేడాది డిసెంబరులో రిలీజై సెన్సేషన్ సృష్టించిన హిందీ సినిమా 'ధురంధర్'. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకుడు. ఈ చిత్ర సీక్వెల్.. వచ్చే నెల 19న థియేటర్లలోకి రానుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ విడుదల చేశారు.

(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)

విలన్ రహమాన్ డకాయిట్‌ని హంజా అలీ చంపడంతో తొలి పార్ట్‪‌ని ముగించారు. హంజా అలీ.. లయరీ ప్రాంతానికి డాన్ ఎలా అయ్యాడు? భారత్ వ్యతిరేకంగా పనిచేస్తున్న మిగతా విలన్స్‌ని ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాలతో సీక్వెల్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తొలి పార్ట్ చివరలో వేసిన విజువల్స్ నే ఇప్పుడు టీజర్ గా రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)

Advertisement
 
Advertisement
Advertisement