అక్షయ్‌ క్రేజ్‌పై అసూయ? మాధవన్‌ ఆన్సరిదే! | Is R Madhavan Jealousy About Akshaye Khanna gets praise for Dhurandhar? | Sakshi
Sakshi News home page

Dhurandhar: అక్షయ్‌కే ఎక్కువ క్రెడిట్‌.. కుళ్లుకుంటున్న మాధవన్‌?

Dec 20 2025 12:23 PM | Updated on Dec 20 2025 12:52 PM

Is R Madhavan Jealousy About Akshaye Khanna gets praise for Dhurandhar?

యానిమల్‌ సినిమాలో జమల్‌ కదు పాట ఎంత ఫేమస్‌ అయిందో ధురంధర్‌లో అక్షయ్‌ ఖన్నా ఎంట్రీ సాంగ్‌ అంత ఫేమస్‌ అయింది. అతడి స్వాగ్‌, లుక్స్‌, స్టెప్పులు అన్నింటికీ జనం ఫిదా అయ్యారు. అలా అని అదేదో రిహార్సల్స్‌ చేసిన డ్యాన్స్‌ కూడా కాదు. అప్పటికప్పుడు తోచినట్లుగా స్టెప్పేశాడంతే! ఇప్పుడేమో సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా అక్షయ్‌ ఖన్నాయే ట్రెండ్‌ అవుతున్నాడు. సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌, ఆర్‌ మాధవన్‌ వంటి స్టార్స్‌ ఉన్నా సరే అక్షయ్‌నే ఎక్కువ కీర్తిస్తున్నారు.

మాధవన్‌కు కుళ్లు?
ఈ విషయంలో మాధవన్‌ కాస్త అప్‌సెట్‌ అయ్యాడట! ఓపక్క ధురంధర్‌ వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతున్నందుకు ఒకింత సంతోషంగా ఉన్నా.. అక్షయ్‌కే ఎక్కువ క్రెడిట్‌ రావడంతో హర్ట్‌ అయ్యాడంటూ సోషల్‌ మీడియాలో కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా మాధవన్‌ స్పందించాడు. బాలీవుడ్‌ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అక్షయ్‌కు మంచి గుర్తింపు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతే తప్ప బాధెందుకు ఉంటుంది? ఆయన ఎంతో ప్రతిభావంతమైన నటుడు, అలాగే ఎంతో నిరాడంబరంగా ఉంటాడు. తనకు కచ్చితంగా ఈ ప్రశంసలు దక్కి తీరాల్సిందే!

నాకంటే గొప్పవాడు
ఆయన తల్చుకుంటే లక్షల ఇంటర్వ్యూలు ఇవ్వొచ్చు. కానీ తన కొత్తింట్లో తాపీగా కూర్చున్నాడు. విజయాన్ని నిశ్శబ్ధంగానే ఎంజాయ్‌ చేస్తున్నాడు. నేను పెద్దగా జనం అటెన్షన్‌ కోరుకునే వ్యక్తిని కాదు. ఈ విషయంలో అక్షయ్‌ ఖన్నా నాకంటే గొప్పవాడు. ఆయన అసలేదీ పట్టించుకోడు. జయాపజయాలన్నీ కూడా అతడి దృష్టిలో సమానమే అని మాధవన్‌ చెప్పుకొచ్చాడు. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ధురంధర్‌ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.730 కోట్లు వసూలు చేసింది. కేవలం భారత్‌లోనే రూ.483 కోట్లు రాబట్టింది.

చదవండి: బిగ్‌బాస్‌ 9కి ప్రాణం పోసిన రియల్‌ గేమర్‌.. సంజనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement