విడుదలై రెండు వారాలు దాటిపోయినా సరే 'ధురంధర్' జోరు అస్సలు తగ్గట్లేదు. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ దేశవ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రూ.600-700 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా థియేటర్లలోకి వచ్చిన హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీని కూడా వసూళ్లలో ఈ చిత్రం దాటేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?
జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన 'అవతార్' ఫ్రాంచైజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2009లో తొలి పార్ట్ రిలీజైనప్పుడు మూవీ లవర్స్ ఆశ్చర్యపోయారు. మన దేశంలోనూ వేల కోట్ల వసూళ్లు వచ్చాయి. 2022లో రెండు పార్ట్ విడుదలైతే ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే దక్కింది. రూ.400-500 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి. కానీ నిన్న(డిసెంబరు 19) థియేటర్లలోకి మూడో పార్ట్‌కి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు. అదే స్టోరీ అదే విజువల్స్ ఉన్నాయని చూసొచ్చిన ఆడియెన్స్ అనుకుంటున్నారు. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.20 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.
అదే టైంలో 'ధురంధర్'కి నిన్న(డిసెంబరు 19) రూ.22.50 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అంటే రేసులో ఉన్న హాలీవుడ్ మూవీ 'అవతార్ 3'ని కూడా హిందీ మూవీ దాటేసిందనమాట. చూస్తుంటే ఈ వీకెండ్‌లోనూ 'ధురంధర్' హవా కనిపించేలా ఉంది. ఈ మూవీ దెబ్బకు ఇటు తెలుగులో రిలీజైన 'అఖండ 2'పై గట్టిగానే ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే తెలుగు తప్ప మిగతా ఏ భాషలోనూ బాలకృష్ణ చిత్రం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అలా 'ధురంధర్' ఎఫెక్ట్.. తెలుగు, ఇంగ్లీష్ మూవీస్‌పై గట్టిగానే పడినట్లు తెలుస్తోంది.


