బిగ్‌బాస్ హౌస్‌లో ఫైనలిస్టులు ఐదుగురు సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. ఈరోజు వారిని పలకరించేందుకు దాదాపు ఐదారుగురు సెలబ్రిటీలు హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శివాజీ, లయ, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రోహన్ మొదటగా వచ్చారు.
బుల్లితెర యాంకర్స్
తర్వాత రాజాసాబ్ కోసం నిధి అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బుల్లితెరను ఏలుతున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు, క్వీన్ శ్రీముఖి అడుగుపెట్టారు. ఈ మేరకు వరుస ప్రోమోలు వదులుతున్నాడు బిగ్‌బాస్. బీబీ జోడీ రెండో సీజన్ మొదలు కాబోతోంది.. ఈ సీజన్ నుంచి కూడా జంటలు రావాలని కోరుకుంటున్నా అని ప్రదీప్ అనగానే కల్యాణ్.. వస్తాం అన్నా అంటూ సంతోషంగా ఆన్సరిచ్చాడు. ఎలాగో ఈ షోలో పవన్-రీతూ జంటగా కనిపించడం ఫిక్స్!
కల్యాణ్ తలకు కట్టు
మరి తనూజ- కల్యాణ్ కూడా జోడీగా వస్తారా? లేదా? అనేది చూడాలి! ఇక శ్రీముఖి వచ్చినప్పుడు ఇమ్మూ చేసిన కామెడీ అయితే నెక్స్ట్ లెవల్. పుష్ప స్కిట్‌లో భాగంగా కల్యాణ్.. తనూజను గిల్లేశాడు. ఈ ప్రోమోలో కల్యాణ్ తలకు కట్టుతో కనిపించాడు. అయితే అతడికి పెద్ద గాయం ఏమీ అవలేదు. నిధి వచ్చినప్పుడు కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించింది. అప్పుడు కల్యాణ్ తలకు చిన్న దెబ్బ తగలడంతో కట్టు కట్టారు. కాబట్టి అభిమానులు కంగారుపడాల్సిన అవసరం లేదు.


