నాకేదైనా జరిగితే అందుకు వారే బాధ్యులు: కీర్తి భట్‌ | Bigg Boss Keerthi Bhat First Post After Engagement Break Up With Vijay Karthik, Reacts To Trolls Post Went Viral | Sakshi
Sakshi News home page

Keerthi Bhat On Breakup: అదే మరింత బాధిస్తోంది.. నా జీవితానికి ఏదైనా అయితే..

Jan 30 2026 1:54 PM | Updated on Jan 30 2026 2:11 PM

Bigg Boss Keerthi Bhat First Post After Break Up With Vijay Karthik

కన్నడ నటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ కీర్తి భట్‌ మూడేళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. దర్శకుడు, హీరో విజయ్‌ కార్తీక్‌ తోటతో ప్రేమలో ఉన్న ఆమె అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇద్దరూ ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక ఒకేచోట కలిసున్నారు. కానీ పెళ్లి ఊసు మాత్రం పక్కన పెట్టేశారు. ఈ ఏడాదైనా వెడ్డింగ్‌ గురించి శుభవార్త చెప్తారనుకుంటే విడిపోయామని బ్రేకప్‌ న్యూస్‌ చెప్పారు.

కీర్తి మోసం చేసిందంటూ..
అది విని అభిమానులు షాక్‌కు గురయ్యారు. కీర్తిని తల్లిలా చూసుకుంటానన్న విజయ్‌ కార్తీక్‌ ఎందుకింత మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అతడు సోషల్‌ మీడియా వేదికగా కీర్తియే తనను వదిలేసి మరో కొత్త జీవితం ప్రారంభించిందన్నాడు. తన దగ్గర డబ్బు లేదనే వదిలేసి మరో వ్యక్తిని చూసుకుందని చెప్పాడు.

కీర్తిపై ట్రోలింగ్‌
దీంతో చాలామంది కీర్తిని విమర్శిస్తున్నారు. తల్లి కాలేదని తెలిసినా పెళ్లికి ముందుకు వచ్చి అంత బాగా చూసుకున్న వ్యక్తిని డబ్బు కోసం వదిలేయడం కరెక్ట్‌ కాదని తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో కీర్తి భట్‌ తాజాగా ఓ పోస్ట్‌ పెట్టింది. ఒకరు చెప్పిన మాటల్ని విని అదే కరెక్ట్‌ అనుకుని నన్ను తప్పు పట్టడం సరి కాదు. మీరు నా గత పోస్ట్‌ చూస్తే.. అందులో ఎక్కడా అవతలివారి బలహీనతల్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావించలేదు.

నా వల్ల కావట్లేదు
నాపై యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలలో లేనిపోని ఊహాగానాలు, కథలు అల్లుతూ ఏవేదో ప్రచారం చేస్తున్నారు. అది నన్ను మరింత బాధపెడుతోంది. నిజంగా నావల్ల కావడం లేదు. ఎవరైతే నాపై నిందలు వేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారో వారి పేర్లు అన్నీ రాసిపెట్టుకున్నాను. నా జీవితంలో ఏదైనా జరగరానిది జరిగితే అందుకు వారే బాధ్యులు అని రాసుకొచ్చింది.

 

 

చదవండి: అత్తారింట్లో ఇంకా ఆ ప్రయోగం చేయలేదు: శోభిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement