పెళ్లి తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ నటించిన మొదటి చిత్రం 'చీకటిలో'. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం శోభిత బాగానే కష్టపడింది. పలు ఇంటర్వ్యూలకు హాజరైంది. ఈ క్రమంలోనే తన గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. పెళ్లయినప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా ఇంట్లో వంట చేయలేదు. ఆ దిశగా ఎప్పుడూ ప్రయోగాలు చేయలేదు. కానీ ఎప్పుడూ ఫోన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాను.
రోజూ ఆర్డర్ పెడతా..
చైతన్య షోయూ రెస్టారెంట్ నుంచే కాకుండా ఇతర హోటల్స్ నుంచి కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తుంటాను. రోజూ కచ్చితంగా ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటూనే ఉంటాను. ఇంకా దగ్గరివాళ్లకు ఫోన్ చేసి హైదరాబాద్‌లో మంచి పునుగులు, సమోసాలు, మిరపకాయ్ బజ్జీ, టిఫిన్స్.. ఎక్కడ దొరుకుతాయ్? అని అడుగుతూ ఉండేదాన్ని. మంచి భోజనం ఎక్కడుందని అడిగి తెలుసుకుని మరీ వెళ్లి తింటాను అని చెప్పుకొచ్చింది.
సినిమా
అయితే ఎంత తిన్నా, ఏం తిన్నా వర్కవుట్స్ మాత్రం తప్పనిసరి అని చెప్తోంది. ఈమె చివరగా చీకటిలో సినిమాలో క్రైమ్ పాడ్‌కాస్టర్‌గా యాక్ట్ చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాకు చంద్ర పెమ్మరాజు రచనా సహకారంతో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడు. ఆమని, ఈషా చావ్లా, విశ్వదేవ్ రాచకొండ కీలక పాత్రలు పోషించారు. శోభిత ప్రస్తుతం తమిళంలో వెట్టువమ్ మూవీలో యాక్ట్ చేస్తోంది.
చదవండి: ఓటీటీలో రాజాసాబ్


