బిగ్‌బాస్ 7 ఫేమ్ శుభ శ్రీ రాయగురు కాబోయే భర్తతో కలిసి షికార్లు తిరుగుతోంది. ఈ ఏడాది జూన్‌లో మనోభావాలు పాప.. నిర్మాత, నటుడు అజయ్ మైసూర్‌ను ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. వీరిద్దరూ మేజెస్టీ సాంగ్‌లో జంటగా నటించారు. ఆ పాటతోనే ప్రేమలో పడి జంటగా కలిసుండాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లెప్పుడన్నది మాత్రం ఇంకా చెప్పనేలేదు.
లగ్జరీ కారు కొనుగోలు
అయితే కొన్ని వారాల క్రితమే ప్రియుడి కోసం ఆస్ట్రేలియా చెక్కేసిందీ బ్యూటీ. అక్కడ కాబోయే భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ లవ్ బర్డ్స్ కొత్త కారు కొన్నారు. ఇప్పటికే అజయ్ దగ్గర 20కి పైగా కార్లున్నట్లు సమాచారం. ఇప్పుడు కొత్తగా మరో లగ్జరీ కారు చేరింది. అదే మెర్సిడిస్ బెంజ్ AMG45S స్పెషల్ ఎడిషన్.
ఇకనైనా మారండి
ఈ మోడల్ కారు ఆస్ట్రేలియాలో కేవలం 20 మాత్రమే అందుబాటులో ఉండగా అందులో ఒకదాన్ని అజయ్ జంట సొంతం చేసుకుంది. అదే విషయాన్ని అజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ.. ఇకనైనా బోర్ కొట్టే బ్లాక్ అండ్ వైట్ కార్లకు స్వస్తి పలికి కలర్‌ఫుల్ కార్లను కొనుగోలు చేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు. వీళ్లు కొన్న కారు గ్రీన్ కలర్‌లో ఉంది. దీని ధర కోటికి పైనే ఉంటుందంటున్నారు. కాగా అజయ్.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, 10th క్లాస్ డైరీస్, హ్యాంగ్‌మ్యాన్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రైవేట్ సాంగ్స్, పలు షార్ట్ ఫిలింస్‌లో నటించాడు.


