breaking news
Ajay Mysore
-
'బ్లాక్ అండ్ వైట్ బోర్'.. మరో లగ్జరీ కారు కొన్న లవ్ బర్డ్స్
బిగ్‌బాస్ 7 ఫేమ్ శుభ శ్రీ రాయగురు కాబోయే భర్తతో కలిసి షికార్లు తిరుగుతోంది. ఈ ఏడాది జూన్‌లో మనోభావాలు పాప.. నిర్మాత, నటుడు అజయ్ మైసూర్‌ను ఎంగేజ్మెంట్ చేసుకుంది. వీరిద్దరూ మేజెస్టీ సాంగ్‌లో జంటగా నటించారు. ఆ పాటతోనే ప్రేమలో పడి జంటగా కలిసుండాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లెప్పుడన్నది మాత్రం ఇంకా చెప్పనేలేదు.లగ్జరీ కారు కొనుగోలుఅయితే కొన్ని వారాల క్రితమే ప్రియుడి కోసం ఆస్ట్రేలియా చెక్కేసిందీ బ్యూటీ. అక్కడ కాబోయే భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ లవ్ బర్డ్స్ కొత్త కారు కొన్నారు. ఇప్పటికే అజయ్ దగ్గర 20కి పైగా కార్లున్నట్లు సమాచారం. ఇప్పుడు కొత్తగా మరో లగ్జరీ కారు చేరింది. అదే మెర్సిడిస్ బెంజ్ AMG45S స్పెషల్ ఎడిషన్. ఇకనైనా మారండిఈ మోడల్ కారు ఆస్ట్రేలియాలో కేవలం 20 మాత్రమే అందుబాటులో ఉండగా అందులో ఒకదాన్ని అజయ్ జంట సొంతం చేసుకుంది. అదే విషయాన్ని అజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ.. ఇకనైనా బోర్ కొట్టే బ్లాక్ అండ్ వైట్ కార్లకు స్వస్తి పలికి కలర్‌ఫుల్ కార్లను కొనుగోలు చేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు. వీళ్లు కొన్న కారు గ్రీన్ కలర్లో ఉంది. దీని ధర కోటికి పైనే ఉంటుందంటున్నారు. కాగా అజయ్.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, 10th క్లాస్ డైరీస్, హ్యాంగ్‌మ్యాన్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రైవేట్ సాంగ్స్, పలు షార్ట్ ఫిలింస్‌లో నటించాడు. View this post on Instagram A post shared by Ajay Mysore (@ajay_mysore__) -
మూడు రోజుల్లో బిగ్‌బాస్ బ్యూటీ బర్త్‌డే.. లక్ష రూపాయలతో..
ప్రేమ పుట్టడానికి క్షణం చాలు అంటుంటారు. కానీ, బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు విషయంలో ప్రేమలో పడేందుకు ఒక పాట చాలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. గతేడాది మేజస్టీ ఇన్ లవ్ అనే ప్రైవేట్ సాంగ్‌లో నటించింది. నటుడు, నిర్మాత అజయ్ మైసూర్‌తో కలిసి యాక్ట్ చేసింది. సాంగ్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అప్పుడే శుభశ్రీ మనసులోనూ పెళ్లంటే ఇతడినే చేసుకోవాలని నిర్ణయించుకుంది.ప్రేమ జంటపై ట్రోలింగ్అజయ్ అయితే ఆమె చేయి ఇస్తే చాలు జీవితాంతం వదలకుండా పట్టుకుంటానని మనసులోనే కోటి కలలు కనేశాడు. అతడు ధైర్యం చేసి ప్రపోజ్ చేయగా సుబ్బు ఓకే చెప్పడం.. వీరి ఎంగేజ్మెంట్ జరగడం కూడా అయిపోయింది. అయితే డబ్బు కోసమే శుభశ్రీ.. అజయ్‌ను పెళ్లి చేసుకుంటుందని, అతడి లుక్ బాలేకపోయినా జీవితాంతం కలిసుండేందుకు ఒప్పుకుందంటూ విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీనిపై సుబ్బు ఘాటుగానే స్పందించింది. మనిషి లుక్స్ కన్నా మంచి మనసే తనకు ముఖ్యమని, ఎవరేమనుకున్నా తనకు అనవసరం అని పేర్కొంది.శుభశ్రీ బర్త్‌డేకు..తాజాగా ఈ ప్రేమజంట ఓ మంచి పనికి పూనుకున్నారు. శుభశ్రీ బర్త్‌డే రోజు (జూలై 15)న లక్ష రూపాయలను పది భాగాలుగా చేసి దానం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మీ కష్టాన్ని మాతో చెప్పుకోండి, మీకు సాయం చేస్తామంటూ వీడియో రిలీజ్ చేశారు. మంగళవారం నాడు పదిమందిని సెలక్ట్ చేసి వారికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్నారు. ఇది చూసిన అభిమానులు.. కాబోయే జంట మంచి మనసును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) చదవండి: ఓటీటీలోకి ప్రియాంక చోప్రా యాక్షన్ కామెడీ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ -
'21 లగ్జరీ కార్లు చూసి పడిపోయింది'.. తట్టుకోలేక ఏడ్చేసిన శుభశ్రీ
ఒక్క పాటతో పడిపోయింది బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు. నటుడు, నిర్మాత అజయ్ మైసూర్‌తో కలిసి మేజస్టీ ఇన్ లవ్ అనే ప్రైవేట్ సాంగ్‌లో నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు. ఆలస్యం చేయడం ఎందుకనుకున్నారో ఏమో కానీ వెంటనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే అతడికి బోలెడంత ఆస్తి ఉందని, 21 కార్లున్నాయని.. అందుకే మనోభావాలు పాప వెంటనే పెళ్లికి కూడా సిద్ధపడిపోయిందని ట్రోలింగ్ జరిగింది.మోడల్‌గా..తాజాగా ఈ ట్రోలింగ్‌పై శుభశ్రీ రాయగురు (SubhaShree Rayaguru) స్పందించింది. అలాగే తన ప్రేమకథను, పర్సనల్ విషయాలను కూడా చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో శుభశ్రీ మాట్లాడుతూ.. మాది లీగల్ ఫ్యామిలీ.. నాన్న జడ్జి. కాబట్టి నేను కూడా న్యాయవిద్య చదివాను. ముంబైలో లా చదువుతున్న సమయంలో మోడలింగ్ చేశాను. ఫెమినా మిస్ ఇండియా ఒరిస్సాగా టైటిల్ గెలిచాను. ఐఏఎస్ కోచింగ్‌కు వెళ్దామనుకునే సమయంలో ఈ ట్రోఫీ రావడంతో మనసు మారింది. సినిమాలు ట్రై చేశాను. అలా బిగ్‌బాస్ ఆఫర్ కూడా వచ్చింది. ఈ షోకు వెళ్లాక నాకు చాలా ఫేమ్ వచ్చింది.సాంగ్ షూటింగ్లో పరిచయంఈ మధ్యే మేజస్టీ సాంగ్ చేశాను. ఆస్ట్రేలియాలో జరిగిన సాంగ్ షూటింగ్లో అజయ్‌ను తొలిసారి కలిశాను. సహనటుల్లాగే మాట్లాడుకునేవాళ్లం. వారం రోజులపాటు షూటింగ్ జరిగింది. చివరి రోజు షూటింగ్లో తను నాకు ప్రపోజ్ చేస్తుంటే నాకు తెలియకుండానే ఎంజాయ్ చేశాను. అలా 9 నెలల కిందట మా ప్రేమ మొదలైంది. మా ప్రేమకు ఇంట్లోవాళ్లు వెంటనే ఒప్పుకోలేదు. నెమ్మదిగా అంగీకరించారు. డబ్బు కోసమే పెళ్లి?మా ఇద్దరి గురించి సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేశారు. అబ్బాయి నల్లగా ఉన్నాడు. అతడెలా నచ్చాడు? డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటున్నావా? అని వాగారు. అలా అనడానికి మీకెంత ధైర్యం? నేను ఎలాంటి పార్ట్నర్ను ఎంపిక చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? అయినా ఈ జనరేషన్ యువత ఇలాంటి కామెంట్లు చేస్తుంటే నమ్మలేకపోయాను. నాకంటూ సొంతిల్లుంది, కారుంది, బాగానే డబ్బు సంపాదించాను. నాకెవరి డబ్బులు అక్కర్లేదు.పెళ్లే కాలేదు.. భరణం గురించి కామెంట్స్నేను పెళ్లి చేసుకునే అబ్బాయి నాకు గౌరవం ఇస్తాడా? ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడా? అని మాత్రమే చూస్తాను. ఈ లక్షణాలు లేకపోతే ఎంత డబ్బున్నా నేను పెళ్లి చేసుకోను. అజయ్ పరిచయమైనప్పటినుంచి ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ 9 నెలలకాలంలో నేను ఎక్కువగా ఏడ్చింది లేదు. నాకు మనిషి లుక్స్ గురించి అవసరం లేదు. మేమిద్దరం సంతోషంగా ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యం. మహా అయితే ఆరు నెలలు కలిసుంటారు.. భరణం ఎంత తీసుకుంటారు? ఇలాంటి కామెంట్లు చూసి తట్టుకోలేకపోయాను. ట్రోలింగ్ దెబ్బకు జ్వరంఈ ట్రోల్స్ చూసి ఏడ్చేశాను. ఇంకా పెళ్లే కాలేదు. భరణం దాకా వెళ్లిపోయారేంట్రా? అనుకున్నా.. ఆ కామెంట్ల దెబ్బతో నిశ్చితార్థం అయిన రెండురోజులకే నాకు జ్వరం వచ్చింది. నేనేమైనా తప్పు చేశానా? ఎందుకిలా తిడుతున్నారు? అని నాలో నేనే బాధపడ్డాను. అజయ్ ఇంట్లోవాళ్లు కూడా చాలా ఫీల్ అయ్యారు. దయచేసి నోటికొచ్చినట్లు మాట్లాడకండి అని శుభశ్రీ కోరింది. ఈమె రుద్రవీణ, అమిగోస్, కథ వెనుక కథ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) చదవండి: నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం


