మూడు రోజుల్లో బిగ్‌బాస్‌ బ్యూటీ బర్త్‌డే.. లక్ష రూపాయలతో.. | Subhashree Rayaguru, Ajay Mysore Announces Rs 10,000 for 10 People | Sakshi
Sakshi News home page

Subhashree Rayaguru: కాబోయే భర్తతో మంచి పనికి శ్రీకారం చుట్టిన శుభశ్రీ

Jul 12 2025 12:39 PM | Updated on Jul 12 2025 12:52 PM

Subhashree Rayaguru, Ajay Mysore Announces Rs 10,000 for 10 People

ప్రేమ పుట్టడానికి క్షణం చాలు అంటుంటారు. కానీ, బిగ్‌బాస్‌ బ్యూటీ శుభశ్రీ రాయగురు విషయంలో ప్రేమలో పడేందుకు ఒక పాట చాలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. గతేడాది మేజస్టీ ఇన్‌ లవ్‌ అనే ప్రైవేట్‌ సాంగ్‌లో నటించింది. నటుడు, నిర్మాత అజయ్‌ మైసూర్‌తో కలిసి యాక్ట్‌ చేసింది. సాంగ్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అప్పుడే శుభశ్రీ మనసులోనూ పెళ్లంటే ఇతడినే చేసుకోవాలని నిర్ణయించుకుంది.

ప్రేమ జంటపై ట్రోలింగ్‌
అజయ్‌ అయితే ఆమె చేయి ఇస్తే చాలు జీవితాంతం వదలకుండా పట్టుకుంటానని మనసులోనే కోటి కలలు కనేశాడు. అతడు ధైర్యం చేసి ప్రపోజ్‌ చేయగా సుబ్బు ఓకే చెప్పడం.. వీరి ఎంగేజ్‌మెంట్‌ జరగడం కూడా అయిపోయింది. అయితే డబ్బు కోసమే శుభశ్రీ.. అజయ్‌ను పెళ్లి చేసుకుంటుందని, అతడి లుక్‌ బాలేకపోయినా జీవితాంతం కలిసుండేందుకు ఒప్పుకుందంటూ విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. దీనిపై సుబ్బు ఘాటుగానే స్పందించింది. మనిషి లుక్స్‌ కన్నా మంచి మనసే తనకు ముఖ్యమని, ఎవరేమనుకున్నా తనకు అనవసరం అని పేర్కొంది.

శుభశ్రీ బర్త్‌డేకు..
తాజాగా ఈ ప్రేమజంట ఓ మంచి పనికి పూనుకున్నారు. శుభశ్రీ బర్త్‌డే రోజు (జూలై 15)న లక్ష రూపాయలను పది భాగాలుగా చేసి దానం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మీ కష్టాన్ని మాతో చెప్పుకోండి, మీకు సాయం చేస్తామంటూ వీడియో రిలీజ్‌ చేశారు. మంగళవారం నాడు పదిమందిని సెలక్ట్‌ చేసి వారికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్నారు. ఇది చూసిన అభిమానులు.. కాబోయే జంట మంచి మనసును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

 

 

చదవండి: ఓటీటీలోకి ప్రియాంక చోప్రా యాక్షన్‌ కామెడీ ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement