ఓటీటీలో 'ఆంధ్రకింగ్‌ తాలుకా'.. ప్రకటన వచ్చేసింది | Andhra King Taluka Movie OTT Streaming Details Out | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'ఆంధ్రకింగ్‌ తాలుకా'.. ప్రకటన వచ్చేసింది

Dec 20 2025 11:58 AM | Updated on Dec 20 2025 12:18 PM

Andhra King Taluka Movie OTT Streaming Details Out

రామ్‌ పోతినేని, ఉపేంద్ర కలిసి నటించిన మూవీ 'ఆంధ్రకింగ్‌ తాలుకా'.. నవంబర్‌ 27న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. వరుస పరాజయాల తర్వాత రామ్‌ భారీ అంచనాలతో ఈ మూవీని చేశారు. సినిమా బాగుందని టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్స్‌ మాత్రం పెద్దగా రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు పి.మహేశ్‌బాబు తెరకెక్కించారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే, రావు రమేశ్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య తదితరులు నటించారు

‘ఆంధ్రకింగ్‌ తాలుకా’ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్‌ 25న స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ,మలయాళం, తమిళ్‌లో విడుదల అవుతుందని ఒక పోస్టర్‌ను షేర్‌ చేశారు. ఈ మూవీ కోసం సుమారు రూ. 60 కోట్లు బడ్జెట్‌ పెట్టినట్లు సమాచారం. అయితే, ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది.

కథేంటంటే.. 
ఈ సినిమా కథంతా 2000-2003 మధ్యకాలంలో సాగుతుంది. సూర్య(ఉపేంద్ర) ఓ స్టార్‌ హీరో. ప్లాప్‌ సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్‌ తెప్పించే అభిమానులు ఉన్నారు. అయితే వరుసగా తొమ్మిది సినిమాలు డిజాస్టర్‌ కావడంతో.. తన కెరీర్‌లో 100వ మూవీతో ఎలాగైన భారీ హిట్‌ కొట్టాలనే కసితో ఉంటాడు. అయితే 100వ సినిమా షూటింగ్‌ మొదలైన కొన్నాళ్లకే ఆగిపోతుంది. ఇక సినిమా చేయలేనంటూ నిర్మాత చేతులెత్తేస్తాడు. ఆ సినిమా పూర్తి చేయాలంటే మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ డబ్బు కోసం మరో నిర్మాతకు ఫోన్‌ చేస్తే.. తన కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో తండ్రి పాత్ర చేయమని అడుగుతాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా..తర్వాత ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకుంటాడు.

ఈ విషయం నిర్మాతకు చెప్పేలోపే.. సూర్య అకౌంట్‌లో రూ. 3 కోట్లు వచ్చి చేరుతాయి. ఆ డబ్బు ఎవరేశారని ఆరా తీయగా..తన వీరాభిమాని సాగర్‌(రామ్‌ పోతినేని) గురించి తెలుస్తుంది. రాజమండ్రి సమీపంలోని గోడపల్లిలంక అనే ఒక చిన్న పల్లెటూరికి చెందిన సాగర్‌కు అంత డబ్బు ఎలా వచ్చింది? అసలు సాగర్‌కి హీరో సూర్య అంటే ఎందుకు అంత పిచ్చి?  ప్రియురాలు మహాలక్ష్మీ(భాగ్యశ్రీ బోర్సె)ని దక్కించుకోవడం సాగర్‌ చేసిన చాలెంజ్‌ ఏంటి?  ఆ చాలెంజ్‌లో సాగర్‌ గెలిచాలడా ఓడాడా? హీరోపై ఉన్న అభిమానం..సాగర్‌ని, తన ఊరిని ఎలా మార్చేసింది? అభిమానిని వెతుక్కుంటూ వచ్చిన హీరో సూర్యకి.. తెలిసొచ్చిన విషయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement