పాకిస్తాన్‌ టీవీలో 'ధురంధర్‌-2'.. వీడియో షేర్‌ చేసిన జర్నలిస్ట్‌ | Dhurandhar 2 Movie Pirated Version Being Watched In Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ టీవీలో 'ధురంధర్‌-2'.. వీడియో షేర్‌ చేసిన జర్నలిస్ట్‌

Mar 20 2026 11:12 AM | Updated on Mar 20 2026 11:28 AM

Dhurandhar 2 Movie Pirated Version Being Watched In Pakistan

‘ధురంధర్‌-2’  సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లతో రికార్డ్‌ క్రియేట్‌ చేస్తుంది. ఫస్ట్‌ డే ఏకంగా రూ. 172 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ప్రముఖ సంస్థలు పేర్కొన్నాయి.  మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా  ఈ మూవీ విడుదలైంది. కానీ, ఈ చిత్రం పాకిస్తాన్‌లో విడుదల కాలేదు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఈ మూవీని తెరకెక్కించడం కొన్ని దేశాలు దీన్ని బ్యాన్‌ చేసినట్లు బాలీవుడ్‌ మీడియా గతంలోనే పేర్కొంది. అయినప్పటికీ పాక్‌ దేశ ప్రజలు రణవీర్ సింగ్ నటించిన ధురంధర్‌-2 మూవీని చూడటానికి ఉత్సాహంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో పాక్‌ ప్రజలు ఈ సినిమా పైరసీ వెర్షన్‌ను చూస్తున్నారు.

పాక్‌లోని లాహోర్‌లో ధురంధర్‌-2  సినిమా చూస్తున్న దృశ్యాన్ని పాకిస్తానీ జర్నలిస్ట్‌ షేర్‌ చేశారు. అదే పోస్ట్‌ను భారత్‌కు చెందిన ఆదిత్య రాజ్ కౌల్ తన సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. 'ధురందర్' చిత్రానికి రీసెర్చ్ కన్సల్టెంట్‌గా ఆయన ఉన్న విషయం తెలిసిందే.  పాక్‌లోని లాహోర్‌లో ధురంధర్‌-2  సినిమా చూస్తున్న దృశ్యాన్ని ఒక పాకిస్తానీ జర్నలిస్ట్‌ షేర్‌ చేసిన ట్వీట్‌ను ఆదిత్య రీషేర్ చేశారు.  పాకిస్తానీ ఉగ్రవాదాన్ని అణచివేయడం గురించి ఈ సినిమా ఉన్నా సరే వారు పైరసీ కాపీ కోసం వెతికి మరీ చూస్తున్నారు.  

పాకిస్తాన్‌లో భారతీయ చిత్రాలు నిషేధించబడినప్పటికీ, అక్కడి ప్రజలు మన సినిమాల పైరసీ వెర్షన్‌లను చూసి ఆనందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో, పొరుగు దేశంలో ధురందర్ పార్ట్ 1 పైరసీ వెర్షన్‌ను కూడా చూశారు.  ఆ సమయంలో మూవీ విడుదలైన కేవలం రెండు వారాల్లోనే పాకిస్తాన్‌లో 1.8 మిలియన్లకు (18 లక్షలు) పైగా ఇల్లీగల్ డౌన్‌లోడ్‌ నమోదయ్యాయని అంచనా. ఇప్పుడు ధురందర్ -2 పైరసీ కాపీని టెలిగ్రామ్‌ గ్రూప్‌లలో షేర్‌ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో పార్ట్‌-1 విడుదలైనప్పుడు కూడా పాక్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement