రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'పెద్ది'. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. లెక్క ప్రకారం ఈనెల 27న చరణ్ పుట్టినరోజు కానుకగా థియేటర్లలోకి తీసుకొస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యమయ్యేసరికి నెలరోజులు వాయిదా వేశారు. ఏప్రిల్ 30న తీసుకొస్తామని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇది చాలారోజులైపోయింది. ఇప్పుడు మళ్లీ 'పెద్ది' వాయిదా గురించి రూమర్స్ వస్తున్నాయి.
(ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)
'పెద్ది' ప్రస్తుత పరిస్థితి చూస్తే మరో 4 రోజుల టాకీతో పాటు రెండు పాటల చిత్రీకరణ ఇంకా చేయాల్సి ఉందట. రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. టీమ్ మాత్రం కచ్చితంగా చెప్పిన తేదీకే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ చేస్తున్నారు. కానీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తోపాటు షూటింగ్ ఇన్ టైంలో పూర్తి చేస్తారా సందేహం కలుగుతోంది.
మరోవైపు 'పెద్ది' వాయిదాపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. చరణ్ పుట్టినరోజున ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని అధికారికంగా ప్రకటించారు. దీనిబట్టి చూస్తే దాదాపు ఏప్రిల్ 30నే పాన్ ఇండియా రిలీజ్ అని అనుకోవచ్చు. కానీ ఏమైనా ఆలస్యమైతే మాత్రం జూలైలో తేదీని పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'తో హిట్ కొట్టారు. రీసెంట్గా పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చింది. దీనికి ఏమంత పాజిటివ్ టాక్ అయితే రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ తమ అశలన్నీ 'పెద్ది'పైనే పెట్టుకున్నారు.
(ఇదీ చదవండి: ఉస్తాద్ భగత్‌సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్)


