ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ కలెక్షన్స్‌.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్‌ | Ustaad Bhagat Singh Movie 2 Days Collections | Sakshi
Sakshi News home page

ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ కలెక్షన్స్‌.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్‌

Mar 21 2026 10:44 AM | Updated on Mar 21 2026 10:58 AM

Ustaad Bhagat Singh Movie 2 Days Collections

పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఉస్తాద్ భగత్‌సింగ్ బాక్సాఫీస్‌ వద్ద తేలిపోయింది. గబ్బర్‌ సింగ్‌ మాదిరి పవన్‌ కెరీర్‌లోనే గుర్తుండిపోయేలా మూవీ ఉంటుందని ఫ్యాన్స్‌ అంచనా వేస్తే.. వారి లెక్కలు తారుమారు అయిపోయాయి. బాక్సాఫీస్‌ వద్ద రెండురోజుల కలెక్షన్స్‌ చూస్తే నిర్మాతలకు నష్టాలు తప్పవని తెలుస్తోంది.  తొలిరోజు కాస్త పర్వాలేదనిపించిన కలెక్షన్స్‌ రెండోరోజు 80శాతం పడిపోయాయి. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఇప్పటికీ అధికారికంగా కలెక్షన్స్‌ ప్రకటించలేకపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమౌతుంది.

ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ కలెక్షన్స్‌ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ వెల్లడించింది. ఫస్ట్‌ డే  దేశవ్యాప్తంగా రూ 34.75 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది. అయితే, రెండోరోజు కేవలం రూ. 9.25 కోట్ల నెట్‌ మాత్రమే రాబట్టింది. దీంతో రెండురోజుల్లో మొత్తంగా రూ. 44 కోట్ల నెట్‌ రాబట్టింది.  మొదటి రోజుతో పోల్చి చూస్తే.. దాదాపు 80 శాతం వసూళ్లు మరుసటి రోజుకు పడిపోయాయి. ఉగాది, రంజాన్‌ పండుగలతో లాంగ్ వీకెండ్‌లోనే ఇలా ఉంటే.. సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉండబోతుందో ఊహించవచ్చు. 

ఆపై నేడు (మార్చి 21) ధురంధర్‌-2 తెలుగు వర్షన్‌ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఆదివారం వరకు బుకింగ్స్‌ 95శాతం పైగానే పూర్తి అయ్యాయి. దీంతో చాలాచోట్ల ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ను తొలగించి ధురంధర్‌-2 చిత్రాన్ని వేయనున్నారు.  ఉదయం ఆటలతో పాటు ఏపీలో టికెట్ రేట్ల పెంచి భారీ సంఖ్యలో విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ .. కలెక్షన్స్‌ పరంగా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నడంతో ట్రేడ్‌ వర్గాలను కూడా కలవరపెడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement