ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా | MissTerious Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT Movie: మూడు నెలలకు ఓటీటీలో సైలెంట్‌గా స్ట్రీమింగ్

Mar 21 2026 4:05 PM | Updated on Mar 21 2026 4:14 PM

MissTerious Movie OTT Streaming Now

తెలుగు బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ సాహ్ని నటించిన తెలుగు సినిమా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇంతకీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? దీని సంగతేంటి?

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)

రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్‌పుత్, అబిద్ భూషణ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'మిస్‌టీరియస్‌'. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబరు 19న థియేటర్లలోకి వచ్చింది. కానీ చిన్న సినిమా కావడం, నటీనటులు ఎవరనేది జనాలకు తెలియకపోవడంతో వచ్చినట్లే వెళ్లిపోయింది. ఇప్పుడు మూడు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.

'మిస్‌టీరియస్' విషయానికొస్తే.. కొండాపూర్‌ ఎస్సై రాంఖీ(అబిద్‌ భూషన్‌) 15 రోజులుగా కనిపించకుండా పోతాడు. దీంతో రాంఖీ మిస్సింగ్‌ కేసుని ఏసీపీ ఆనంద్‌ సాయి(బలరాజ్‌ వాడి)కి అప్పగిస్తారు. విచారణలో భాగంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ విరాట్‌(రోహిత్‌ సాహ్ని), అతని భార్య శిల్ప(మేఘన రాజ్‌పుత్‌)ని విచారించాల్సి వస్తుంది. రాంఖీ మిస్సింగ్‌కి వీళ్లకు ఉన్న సంబంధమేంటి? విరాట్‌ విల్లాకి రాంఖీ ఎందుకు వెళ్లాడు? అతను అక్రమంగా  ఓ గన్ ఎందుకు కొన్నాడు? రాంఖీ బతికే ఉన్నాడా? ‍లేదా? ఈ కేసుని ఏసీపీ ఆనంద్‌ ఎలా ముగించాడు?‌ ఇందులో మిస్సిరా (రియా కపూర్) పాత్ర ఏంటి? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)

Advertisement
 
Advertisement
Advertisement