3D టెక్నాలజీతో పాన్ ఇండియా సినిమా 'కొరగజ్జ' | Koragajja Movie Made With 3d Technology | Sakshi
Sakshi News home page

3D టెక్నాలజీతో పాన్ ఇండియా సినిమా 'కొరగజ్జ'

Mar 21 2026 9:20 PM | Updated on Mar 21 2026 9:20 PM

Koragajja Movie Made With 3d Technology

కర్ణాటకలోని తులునాడు ప్రాంతంలో అత్యంత పవిత్రంగా పూజించే కొరగజ్జ దైవం కథ ఆధారంగా ఓ సినిమా రాబోతోంది. 'కొరగజ్జ' పేరుతో తీస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ సాపల్య నిర్మిస్తున్నారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్  దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని రీసెంట్‌గా విడుదల చేయాలని అనుకున్నారు కానీ చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని మార్చుకుని వాయిదా వేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)

'కొరగజ్జ' చిత్రాన్ని చూసిన అంతర్జాతీయ బృందం ఇచ్చిన సలహా మేరకే వాయిదా వేశారట. ఈ మూవీని త్రీడీ ఫార్మాట్‌లోకి మార్చితే ఇంకా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని, మరింతమందికి రీచ్ అవుతుందని చెప్పారట. దీంతో సినిమాని 2డీ నుంచి 3డీకి మార్చేందుకు టీంకి చాలా టైం కావాల్సి వస్తోంది.

ఈ అప్‌గ్రేడ్‌పై దర్శకుడు సుధీర్ అత్తవర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం దాదాపు 40 మంది నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందం ఈ త్రీడీ ఫార్మాట్ కోసం పనిచేస్తోంది. క్లైమాక్స్‌ను నీటి అడుగున తిరిగి తీశారు. ఈ సన్నివేశాన్ని కేరళలోని తిరువనంతపురంలో ఉన్న మలయాళ స్టార్ మోహన్‌లాల్‌కు చెందిన 'విస్మయ' స్టూడియోలో చిత్రీకరించారు.

(ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement