3D టెక్నాలజీతో పాన్ ఇండియా సినిమా 'కొరగజ్జ'
కర్ణాటకలోని తులునాడు ప్రాంతంలో అత్యంత పవిత్రంగా పూజించే కొరగజ్జ దైవం కథ ఆధారంగా ఓ సినిమా రాబోతోంది. 'కొరగజ్జ' పేరుతో తీస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ సాపల్య నిర్మిస్తున్నారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని రీసెంట్గా విడుదల చేయాలని అనుకున్నారు కానీ చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని మార్చుకుని వాయిదా వేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)'కొరగజ్జ' చిత్రాన్ని చూసిన అంతర్జాతీయ బృందం ఇచ్చిన సలహా మేరకే వాయిదా వేశారట. ఈ మూవీని త్రీడీ ఫార్మాట్లోకి మార్చితే ఇంకా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని, మరింతమందికి రీచ్ అవుతుందని చెప్పారట. దీంతో సినిమాని 2డీ నుంచి 3డీకి మార్చేందుకు టీంకి చాలా టైం కావాల్సి వస్తోంది.ఈ అప్‌గ్రేడ్‌పై దర్శకుడు సుధీర్ అత్తవర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం దాదాపు 40 మంది నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందం ఈ త్రీడీ ఫార్మాట్ కోసం పనిచేస్తోంది. క్లైమాక్స్‌ను నీటి అడుగున తిరిగి తీశారు. ఈ సన్నివేశాన్ని కేరళలోని తిరువనంతపురంలో ఉన్న మలయాళ స్టార్ మోహన్‌లాల్‌కు చెందిన 'విస్మయ' స్టూడియోలో చిత్రీకరించారు.(ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు)