సర్‌ఫ్రైజ్‌.. మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా | Vishnu Vinyasam Movie now streaming in OTT | Sakshi
Sakshi News home page

సర్‌ఫ్రైజ్‌.. మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా

Mar 20 2026 8:14 AM | Updated on Mar 20 2026 8:55 AM

Vishnu Vinyasam Movie now streaming in OTT

టాలీవుడ్‌లో విభిన్న కథలను ఎంచుకుంటూ వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న ఏకైక హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు   శ్రీ విష్ణు.. ఆయన నటించిన తాజా చిత్రం ‘ విష్ణు విన్యాసం సడెన్‌గా  ఓటీటీలోకి వచ్చేసింది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఫిబ్రవరి 27, 2026న విడుదలైన ఈ సినిమాకు థియేటర్స్‌లో పాజిటివ్ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో శ్రీవిష్ణుకు జోడిగా నయన్ సారిక నటించగా.. సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్‌, సత్యం రాజేశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శ్రీనివాస్‌ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రలలో మెప్పించారు.

థియేటర్లలో విడుదలైన కేవలం మూడు వారాలకే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో విష్ణు విన్యాసం మూవీ  స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి బహుళ భాషల్లో అందుబాటులో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మూవీకి పాన్-ఇండియన్ ఓటీటీ విడుదల లభించడంతో శ్రీ విష్ణు పేరు ఎక్కువమంది ప్రేక్షకులకు చేరడానికి సహాయపడుతుంది.

కథేంటంటే..
విష్ణు(శ్రీవిష్ణు) ఓ జూనియర్‌ లెక్చరర్‌. జాతకాల పిచ్చి. ఎంతలా అంటే.. వాస్తు బాగోలేదని పక్కింటి వాళ్ల ఇంట్లోని వాష్‌రూమ్‌ని వాడుకునేంత. తనకున్న మూఢనమ్మకాల పిచ్చితో 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోడు. అతన్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది మరో లెక్చరర్‌ మనీషా(నయనసారిక). ఆమె అలవాటు, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ.. విష్ణు కూడా ఆమెను ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యే ముందు మనీషా ఓ నిజాన్ని రివీల్‌ చేస్తుంది. అదేంటి? ఆ నిజం తెలిసిన తర్వాత వీరిద్దరి లవ్‌స్టోరీలో వచ్చిన మలుపులు ఏంటి? చివరికి విష్ణు, మనీషాలు పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement