సూపర్ హిట్ మూవీ దృశ్యం-2 డైరెక్టర్ అభిషేక్ పాఠక్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. పెళ్లయిన రెండు సంవత్సరాల తర్వాత తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. నటి శివాలిక ఓబెరాయ్‌ను పెళ్లాడిన ఆయన ఇవాళ శుభవార్తను పంచుకున్నారు. బేబీ పాఠక్ 2026లో వస్తోందంటూ ఫోటోను షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈ జంట ఫిబ్రవరి 2023లో గోవాలో వివాహం చేసుకున్నారు. అభిషేక్ పాఠక్ నిర్మించిన ఖుదా హాఫిజ్ మూవీతో శివాలిక నటించారు. అదే సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అభిషేక్ పాఠక్ టర్కీలో శివాలికకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. వచ్చే ఏడాదిలో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. కాగా.. అభిషేక్ పాఠక్ బాలీవుడ్‌లో పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన భార్య శివాలికి ఓబెరాయ్ మూడు సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది.


