వారణాసి ఆలయంలో అఖండ-2 టీమ్.. నీ టైమ్ బాగుంది బ్రో! | nandamuri Balakrishna visits Varanasi temple after akhanda 2 release | Sakshi
Sakshi News home page

Varanasi temple: బాలయ్య చేతిలో బతికిపోయిన అభిమాని.. వీడియో వైరల్!

Dec 19 2025 2:31 PM | Updated on Dec 19 2025 5:10 PM

nandamuri Balakrishna visits Varanasi temple after akhanda 2 release

బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన లేటేస్ట్ మూవీ అఖండ-2. డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. ఒక వారం ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ ఆదరణ దక్కించుకోలేకపోయింది. గతంలో విడుదలై హిట్‌గా నిలిచిన అఖండకు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

తాజాగా బాలయ్య, బోయపాటి ప్రముఖ ఆలయం వారణాసిలో ప్రత్యేక పూజలు చేశారు. అఖండ-2 రిలీజ్ తర్వాత స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో బోయపాటి, బాలయ్య కనిపించడంతో భక్తులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా.. అదే సమయంలో బాలయ్య భుజంపై ఉన్న కండువా కింద పడిపోయింది. కానీ ఫ్యాన్స్‌పై ఆగ్రహంతో రెచ్చిపోయే సైలెంట్‌గా కండువా తీసుకుని ముందుకు కదిలారు. ఇది చూసిన నెటిజన్స్ అదేంటి బాలయ్య ఇంతలా మారిపోయారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదృష్టం కొద్ది అతను బతికిపోయాడని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో చాలాసార్లు అభిమానులపై బాలయ్య చేయి చేసుకున్న సంఘటనల గురించి మనందరికీ తెలిసిందే. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement