మాస్ జాతర తర్వాత రవితేజ నటించిన లేటేస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాసామిరంగ బ్యూటీ ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ మూవీ రిలీజ్‌కు కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ఇప్పటికే ఓ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీతో పాటు భార్య, భర్తల మధ్య జరిగే సీన్స్ ఆడియన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. టీజర్ చివర్లో వదిన వాళ్ల చెల్లి అంటే నా వైఫేగా అనే రవితేజ కామెడీ పంచ్ డైలాగ్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ చూసేయండి. కాగా.. ఈ సినిమా 2026 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.


