బిగ్‌బాస్ హౌస్‌లో సుమన్‌ను ఇష్టపడనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకుల దగ్గర నుంచి హౌస్‌మేట్స్ వరకు అందరికీ అతడంటే ఇష్టమే! తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ నవ్విస్తాడు. సూటిగా సుత్తిలేకుండా మాట్లాడే అతడి వైఖరికి అందరూ ఫిదా అవుతారు. కాకపోతే ఆటలో పెద్దగా సత్తా చూపించకపోయేసరికి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఫ్యామిలీ వీక్‌లో సుమన్ కోసం అతడి భార్య ఇంట్లోకి వచ్చింది. వచ్చీరావడమే తనూజకు దూరంగా ఉండమని చెప్పింది.
మాట మార్చేసిన సుమన్
ఇది ఎపిసోడ్‌లోనూ టెలికాస్ట్ అయింది. కానీ, ఇప్పుడేమో తన భార్య అలా అనలేదని మాట మార్చేశాడు సుమన్. తనూజకు దూరంగా ఉండమని మీ భార్య ఎందుకు చెప్పింది? అని ఓ విలేకరి అడిగాడు. ఆ ప్రశ్నకు సుమన్ స్పందిస్తూ.. దూరంగా ఉండమని చెప్పలేదు. తనూజవాళ్లు బాగా ఆడుతున్నారు. మీరింకా బాగా ఆడండి అని చెప్పిందంతే! అంతే తప్ప జాగ్రత్త అని చెప్పలేదు.
4 రోజులు ఏడుస్తూనే..
మీరు బాగా ఆడుతున్నారు, ఇంకాస్త ఎఫర్ట్స్ పెట్టి వాళ్లలా ఆడమని నా భార్య సలహా ఇచ్చింది. అది బయటకు తప్పుగా వెళ్లింది. దానివల్ల ఆమె నాలుగురోజులపాటు తినకుండా ఏడుస్తూ కూర్చుంది. నేను తప్పుగా ఏం చెప్పాను? అని చాలా బాధపడింది అన్నాడు. ఈ కామెంట్స్ విన్న జనాలు.. ఎపిసోడ్‌లో అందరం చూశాం.. ఎందుకు కవర్ చేయాలని చూస్తున్నావ్? ఆమెది ఏ తప్పూ లేకపోతే ఎందుకు ఏడవడం? అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: పిల్లాడికి అబద్ధం చెప్పి బిగ్‌బాస్‌కు.. ఏడ్చేసిన సంజనా


