బిగ్‌బాస్ ఫైనల్ వీక్ అంతా పిక్నిక్ హాలీడేలా సాగిపోతుంది. ఫైనలిస్టుల జర్నీ వీడియోలతో కాస్త ఎమోషనల్‌గానూ ఉంటుంది. ఇప్పటికే నిన్నటి ఎపిసోడ్‌లో ఇమ్మాన్యుయేల్ జర్నీ చూపించారు. నేడు తనూజ, పవన్ జర్నీ చూపించనున్నారు. ఈ మేరకు తాజాగా పవన్ కోసం ఓ ప్రోమో వదిలారు.
యోధుడిగా నిలబడ్డావ్
'మీరు ఎవరివైపు ఉంటే వారికి కొండంత బలం.. ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం.. మీకు ఏ గెలుపూ సులువుగా లభించలేదు. చెమటోడ్చి, చివరి వరకు పోరాడి గెలిచారు. స్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్ చేస్తూ టఫెస్ట్ కాంపిటీటర్‌గా, తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోధుడిగా టాప్ 5లో నిలబడ్డారు' అని పొగిడాడు. సీజన్ అంతా తిట్టు పడ్డ పవన్.. ఎట్టకేలకు బిగ్‌బాస్ నోటితో పొగడ్తలు అందుకుని శెభాష్ అనిపించాడు. అతడి ఫుల్ జర్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే!


