బిగ్‌బాస్ తెలుగు 9 సోషల్‌మీడియాలో ట్రెండిగ్ టాపిక్.. డిసెంబర్ 21న ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. టాప్-5లో తనూజ, కల్యాణ్, ఇమ్మన్యుయేల్, పవన్, సంజనలు ఉన్నారు. ఈ క్రమంలో వారి జర్నీ వీడియోలను బిగ్‌బాస్ చూపిస్తున్నారు. ముందుగా ఇమ్మన్యుయేల్ ప్రయాణాన్ని చూపించిన బిగ్‌బాస్.. గురువారం ఎపిసోడ్‌లో తనూజ గురించి జర్నీ ఉంది. ఈ క్రమంలో తనకు సంబంధించిన ప్రోమోను బిగ్‌బాస్ టీమ్ వదిలింది.
బిగ్‌బాస్‌లో తన జర్నీ చూసుకున్న తనూజ చాలా ఎమోషనల్ అయిపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో తనూజ కన్నీళ్లు పెట్టుకున్నా, నవ్వినా సరే నటిస్తుంది అంటూ చాలామంది కామెంట్లు చేశారు. అయితే, అలాంటి విమర్శలు చేసినవారికి సమాధానంగా బిగ్‌బాస్ ప్రోమో ఉంది. బిగ్‌బాస్ ఇల్లు నటనకు ఎలాంటి ఆస్కారం లేని చోటు అంటూ క్లారిటీ ఇచ్చారు. కత్తికి రెండువైపులా పదునైన వ్యక్తిత్వంతో హౌస్‌లో కొనసాగారంటూ పేర్కొన్నారు.. క్లిష్టపరిస్థితిలో ఎన్నో ఒడిదిడుకులు ఎదుర్కొని చిచ్చరపిడుగులా టాప్-5లో చేరారని భారీ ఎలివేషన్ ఇచ్చారు.


