నిధి అగర్వాల్‌పై చేతులు.. వీళ్లు మగాళ్లు కాదంటూ చిన్మయి ఫైర్‌ | Nidhi Agerwal Mobbed By Fans At Raja Saab Song Launch Event In Hyderabad, Chinmayi Sripaada Shocking Reaction Went Viral | Sakshi
Sakshi News home page

నిధి అగర్వాల్‌పై చేతులు.. వీళ్లు మగాళ్లు కాదంటూ చిన్మయి ఫైర్‌

Dec 18 2025 9:46 AM | Updated on Dec 18 2025 11:23 AM

Singer Chinmayi Slap On Nidhi Agarwal incident

ప్రభాస్‌- మారుతిల సినిమా  ది రాజా సాబ్ నుంచి తాజాగా రెండో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రమోషన్స్‌ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని లులూ మాల్‌కు హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ రావడంతో భారీగా అభిమానులు చేరుకున్నారు. అయితే, ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో తన కారు వద్దకు  అభిమానులు చొచ్చుకు వచ్చారు. ఆమెతో సెల్ఫీల తీసుకునేందకు ఎగబడ్డారు. ఈ క్రమంలో మరికొందరు ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

నిధి అగర్వాల్‌ కనీసం తన కారు వద్దకు కూడా చేరుకోవడం కష్టమైంది. అయితే, అక్కడ ఉన్న బౌన్సర్లు అక్కడున్నవారిని వెనక్కి నెట్టి చివరకు నిధి అగర్వాల్‌ను కారు ఎక్కించారు. దీంతో నిధి ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను షేర్‌ చేస్తే.. సింగర్ చిన్మయి ఘాటుగానే స్పందిచారు.  నిధి అగర్వాల్‌కు ఎదురైన సంఘటన చాలా దారుణంగా ఉందని ఆమె పేర్కొన్నారు. వీళ్లు మగాళ్లు కాదు, జంతువులంటూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. జంతువుల కంటే హీనంగా ఉన్నారంటూ చిన్మయి భగ్గుమంది. ఇలాంటి మానవ మృగాలను భూమిపై ఉంచకుండా మరో గ్రహానికి పంపించాలని కోరింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement