సినిమాలో ఎంత పెద్ద హీరోలు ఉన్నా ఐటమ్ సాంగ్స్ తప్పనిసరిగా మారుతోంది. కథ, కథనాలు ఎంత బాగున్నా, ఆ చిత్రాలకు ఎక్కువ మైలేజ్ ఇస్తున్నవి ఐటమ్ సాంగ్స్‌నే అంటున్నారు సీనీ పండితులు. అలా ఐటమ్ సాంగ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లుగా మారిన అతి కొద్దిమంది స్టార్ హీరోయిన్లలో తమన్నా పేరు ముందు ఉంటుంది. రజనీ నటించిన జైలర్ మూవీలో తమన్నా అందాలు ఆరబోసిన నువ్వు కావాలయ్యా పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
జైలర్ 2లో ఐటం సాంగ్
అదేవిధంగా కూలీ చిత్రంలో పూజాహెగ్డే స్టెప్పేసిన మోనికా సాంగ్ కూడా ఈచిత్రానికి కొంత మైలేజ్‌ను తీసుకొచ్చింది. తాజాగా రజనీ నటిస్తున్న జైలర్–2 చిత్రంలోనూ ఐటమ్‌సాంగ్ ఉంటుందని సమాచారం. కాకపోతే ఈ సారి మిల్కీ బ్యూటీ తమన్నాకు బదులుగా బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసే ప్లాన్‌లో ఉన్నారట! ఆమె ఎవరో కాదు నోరా ఫతేహి.
స్టెప్పేయనున్న నోరా ఫతేహి?
మోడలింగ్ రంగంలో రాణించిన ఈ క్రేజీ భామ హిందీ బిగ్‌బాస్ రియాలిటి గేమ్‌షోలోనూ పాల్గొంది. అనంతరం పలు హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నటించి గుర్తింపు పొందింది. ఇప్పుడు జైలర్–2 మూవీలో ఐటమ్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!


